Nidhhi Agerwal : పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు జూలై 24న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. తరుణంలో సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించింది చిత్ర యూనిట్. కొన్ని కారణాల వలన కేవలం 1000 నుంచి 1500 మంది ఆడియన్స్ మధ్యలోనే ఈ కార్యక్రమం జరిగేటట్టు శిల్పకళా వేదికలో ప్లాన్ చేశారు.
హరిహర వీరమల్లు సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మొదటిసారి చేస్తున్న పాన్ ఇండియా సినిమా కాబట్టి చాలామందికి ఒక క్యూరియాసిటీ ఉంది. ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ చాలా కష్టపడ్డారు. అలానే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ కూడా విపరీతంగా చేశారు. సినిమాల్లో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుంది.
చాలా సంవత్సరాల నుంచి దీనికోసం ఎదురు చూస్తున్నాను.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. నేను చాలా సంవత్సరాల నుంచి ఈ మూమెంట్ కోసం ఎదురు చూస్తున్నాను. నేను ఇక్కడ అందరి ముందు నిల్చోటం చాలా గ్రేట్ ఫుల్. నేను పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడూ చెప్పలేదు. నేను పవన్ కళ్యాణ్ గారికి అతి పెద్ద వీరాభిమానిని. నేను మీ పక్కన నటించే అవకాశం పొందుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. నేను జీవితాంతం ఇది గుర్తుపెట్టుకుంటాను. ఇది వన్ ఆఫ్ మై మోస్ట్ స్పెషల్ ఎక్స్పీరియన్స్. రత్నం గారికి నా హృదయపూర్వకంగా సెల్యూట్ చేస్తున్నాను.
డేట్ మారదు రికార్డ్స్ మారుతాయి
ఇక ఈ సినిమా గురించి కొన్ని విషయాలు పంచుకున్న తర్వాత, దర్శకుడు జ్యోతి కృష్ణ సార్ ఎప్పుడూ చెప్పినట్లు.. ఈ సినిమా డేట్ మారదు ఖచ్చితంగా రికార్డ్స్ మారుతాయి అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ సినిమా చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. దానికి పలు రకాల కారణాలు ఉన్నాయి. అతనికి ఇప్పుడు మాత్రం జూలై 24న సినిమా ఖచ్చితంగా వచ్చి ప్రేక్షకుల్ని అలరిస్తుంది అని నిధి అగర్వాల్ తెలిపారు.
Also Read: Hari Hara veeramallu ticket rates : హరిహర వీరమల్లు చిత్ర యూనిట్ కు అనుకూలంగా తెలంగాణ ప్రభుత్వం