HHVM Pre Release Event: పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా జులై 24న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ తరుణంలో చిత్ర యూని ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ కు చాలా మంది సినిమా ప్రముఖులు హాజరయ్యారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది.
ఈ సినిమాకి సంబంధించిన టికెట్లు ఆల్రెడీ బుక్ మై షో లో సేల్ అయిపోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ సినిమా ట్రైలర్ తర్వాత అంచనాలు బాగా పెరిగాయి. ఈవెంట్ కి బ్రహ్మానందం హాజరయ్యారు పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ అసలు సినిమా యాక్టర్ ఏంటి.?
పవన్ కళ్యాణ్ తనని తాను చాలా మలుపు తిప్పుకున్నారు. ఎవరితో మాట్లాడడు, ఎటు పక్కనో నిలబడతాడు. ఇతను సినిమా యాక్టర్ ఏంటి అని మనం అనుకుంటే, చిరంజీవి గారు సురేఖ గారి ప్రోత్సాహంతో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో యాక్టింగ్ చేశాడు. పోనీ యాక్ట్ చేశాడు అలాగే అయిపోయింది అనుకున్న తరుణంలో, అంతటితో ఆగాడా మళ్లీ ఎందుకు తిరిగాడో తెలియదు కానీ రాజకీయాల్లోకి తిరిగాడు. ఇది ఆయన చేసుకున్నది కాదు. నన్ను నడిపించిన ఒక డెస్టిని. లేచిన కెరటం గొప్పది కాదు. పడి లేచిన కెరటం గొప్పది. ఎంతమంది ఎన్నైనా అనుకోనివ్వండి. సముద్రమంత ఒకసారి ఎదురు వచ్చి గుండెల మీద కొట్టిన సరే స్ట్రైట్ గా నిలబడి చెప్పగలిగినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ కు భారీ ఎలివేషన్
బ్రహ్మానందం మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పుట్టుక మీది చావు మీది బ్రతుకు దేశానిది. మూర్ఖత్వం అనే పదం మనం వాడుతాం. కానీ మూర్ఖత్వానికి ఇంకో పదం పట్టుదల. పట్టుదల ఉంటే ఏదైనా చేయగలం. ఒక లాల్ బహుదూర్ శాస్త్రి పట్టుదల. కుడి చేత్తో పుస్తకాలు పట్టుకొని ఎడమ చేతితో గంగా నది ఈదుకుంటూ వెళ్లి చదువుకున్నటువంటి దాదాసాహెబ్ అంబేద్కర్. ఆయన పట్టుదల. ఎంతమంది చెప్పినా వినకుండా నేను నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. అని చెప్పే రమణ మహర్షి పట్టుదల. రామకృష్ణ పరమహంస పట్టుదల. వీళ్ళందరూ పట్టుదలతో పుట్టారు పట్టుదలతో పెరిగారు కాబట్టే ఇవాల్టి వరకు ఇలా నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ ఎంత గొప్ప వారు అవుతారు అనేది నిర్ణయించడం మన చేతుల్లో లేదు. అంటూ గొప్ప మాటలు మాట్లాడారు.
Also Read: Nidhhi Agerwal : చాలా సంవత్సరాల నుంచి దీనికోసం ఎదురు చూశాను, స్టేజ్ పైన ఎమోషనల్ అయిపోయిన నిధి