Hari Hara veeramallu ticket rates : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త సినిమా వస్తుంది అంటేనే, అది కూడా భారీ బడ్జెట్ సినిమా అయితే టికెట్ రేట్ విషయంలో ఎప్పుడు టాపిక్ నడుస్తూ ఉంటుంది. భారీ బడ్జెట్ సినిమాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రిలీజ్ అవుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను చిత్ర యూనిట్ రేట్ గురించి అభ్యర్థన చేయటం అనేది కామన్ గా మారిపోయింది.
రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ పరిస్థితిని అర్థం చేసుకొని కొన్నిసార్లు టికెట్ రేట్లు హైక్ చేయడానికి పరిమిషన్ ఇస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఒక కొలిక్కి వచ్చింది. కానీ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్లు చాలా తక్కువగా ఉండేవి. దీనిపైన విపరీతమైన విమర్శలు కూడా వచ్చాయి. మరోవైపు వినోదం సామాన్య ప్రేక్షకుడికి కూడా అందుబాటులో ఉండాలి అని అప్పుడు నాయకులు వాదన.
తెలంగాణలో టికెట్ రేట్ హై కు గ్రీన్ సిగ్నల్
‘హరి హర వీరమల్లు’ మూవీ టికెట్ రేట్ల పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. జులై 23న ₹600 టికెట్ రేటుతో 9PM ప్రీమియర్ షోకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 24 నుంచి 27 వరకు మల్టీప్లెక్స్ టికెట్ రేటుపై ₹200+GST, సింగిల్ థియేటర్లలో ₹150+GST పెంచుకోవచ్చని జీవోలో తెలిపారు. JUL 28 నుంచి AUG 2 వరకు మల్టీప్లెక్స్ లో ₹150+GST, సింగిల్ థియేటర్లలో ₹106+GST పెంపు ఉండనుంది. రోజుకు 5 షోలు వేయనున్నారు. మొత్తానికి ఈ జీవో అనేది చిత్ర యూనిట్ కి మంచి సపోర్ట్ అని చెప్పాలి. సినిమా బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు దానిలో డౌట్ లేదు. కానీ ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుంది అనేది వేచి చూడాలి.
ఇప్పుడిప్పుడే సినిమా మీద హైప్
ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పుడు విపరీతమైన అంచనాలు ఉండేవి. సినిమా నుంచి రిలీజ్ చేసిన వీడియో కూడా అందరిని విపరీతంగా ఆకట్టుకుంది. క్రిష్ జాగర్లమూడి పవన్ కళ్యాణ్ హీరోగా పాన్ ఇండియా లెవెల్ సక్సెస్ సాధిస్తాడు అని అందరూ ఊహించారు. కానీ కొన్ని కారణాల వలన ఎప్పుడూ రిలీజ్ కావలసిన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఈ వాయిదా పడే ప్రాసెస్లో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. తర్వాత జ్యోతి కృష్ణ దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చారు. అప్పటినుంచి ఈ సినిమా మీద అంచనాలు కొంతమేరకు తగ్గిపోయాయి. కానీ రీసెంట్ గా వచ్చిన ట్రైలర్, పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ఇవన్నీ కూడా ఈ సినిమా మీద కొత్త ఊపును క్రియేట్ చేశాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది.
Also Read : Hari Hara veeramallu ticket rates : హరిహర వీరమల్లు చిత్ర యూనిట్ అనుకూలంగా తెలంగాణ ప్రభుత్వం