BigTV English

Hyderabad Trains: స్లీపర్ కోచ్‌లు సగానికి తగ్గింపు, సామాన్యలపై తీవ్ర ప్రభావం!

Hyderabad Trains: స్లీపర్ కోచ్‌లు సగానికి తగ్గింపు, సామాన్యలపై తీవ్ర ప్రభావం!

Indian Railwyas: దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న తాజా నిర్ణయం.. సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపించబోతోంది. హైదరాబాద్ నుంచి రాకపోకలు కొనసాగించే సుదూర రైళ్లలో స్లీపర్ క్లాస్ కోచ్ ల సంఖ్య తగ్గించాలని రైల్వే అధికారులు నిర్వహించారు. ఈ నిర్ణయం బడ్జెట్ ప్రయాణికులపై ప్రభావం చూపనుంది. తెలంగాణ ఎక్స్‌ ప్రెస్, హుస్సేన్ సాగర్ ఎక్స్‌ ప్రెస్ లాంటి రైళ్లలో స్లీపర్ బెర్తులు తగ్గించి, ఏసీ కోచ్ లను పెంచారు.


పలు రైళ్లలో స్లీపర్ కోచ్ ల తగ్గింపు

హైదరాబాద్ నుంచి రాకపోకలు కొనసాగించే పలు ప్రముఖ రైళ్లలో ఈ మర్పులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్-న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ ప్రెస్, ముంబైకి వెళ్లే హుస్సేన్ సాగర్ ఎక్స్‌ ప్రెస్, కోస్తా ఆంధ్రకు వెళ్లే గోదావరి, గౌతమి ఎక్స్‌ ప్రెస్‌లు, చెన్నైకి వెళ్లే చార్మినార్ ఎక్స్‌ ప్రెస్ కూడా ఇప్పుడు కీలక మార్పులకు గురయ్యింది. ఈ సర్వీసులలో చాలా వరకు AC కోచ్‌లు 12 వరకు పెరిగాయి. సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ ప్రెస్‌ లోనూ ఈ మార్పులు జరిగాయి. గతంలో ఇది పాత ICF రేక్‌ లతో నడిచినప్పుడు 14 స్లీపర్, 6 AC కోచ్‌లను కలిగి ఉండేది. ఇప్పుడు, మెరుగైన భద్రత, వేగానికి గుర్తుంపు అయిన LHB (లింక్-హాఫ్‌మన్-బుష్) రేక్‌ లతో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఈ రైలు కేవలం 3 స్లీపర్ కోచ్‌లు, 13 AC కోచ్‌లతో నడుస్తుంది.  అటు హైదరాబాద్ దక్కన్ – ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ సర్వీస్‌ లో ఇప్పుడు 8 AC కోచ్‌లకు బదులుగా 2 స్లీపర్ కోచ్‌లు మాత్రమే ఉన్నాయి.


ఇబ్బందులు పడుతున్న సామాన్యులు!

రైల్వే అధికారులు తీసుకున్న తాజా నిర్ణయంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. “నేను శ్రీకాకుళంకు రూ.435 స్లీపర్ టికెట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించాను. కానీ దొరకలేదు. 3 టైర్ ఏసీ టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “మధ్యతరగతి కుటుంబాలపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.  “ఏడాది పొడవునా, ముఖ్యంగా శీతాకాలంలో AC ప్రయాణం చేయలేం. అయినప్పటికీ, అనేక ప్రత్యేక రైళ్లు ఖాళీ AC బెర్త్‌లతో నడుస్తాయి. స్లీపర్ ప్రయాణికులు మాత్రమే ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే అధికారులు స్లీపర్, AC కోచ్‌లను 8:8 నిష్పత్తిలో నడపాలి” అని ప్రయాణీకులు కోరుతున్నారు.

Read Also:  జనరల్ టికెట్ తో ప్రయాణిస్తున్నారా? ఈ రూల్స్ కచ్చితంగా తెలియాల్సిందే!

రైల్వే అధికారులు ఏం చెప్తున్నారంటే?

AC ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్ కారణంగానే అదనపు కోచ్ లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. “చాలా మంది ప్రయాణీకులు ఎయిర్ కండిషనింగ్ సౌకర్యాన్ని ఇష్టపడతారు. ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు ఈ ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు. అందుకే కోచ్ ల సంఖ్య పెంచాల్సి వచ్చింది” అని రైల్వే అధికారులు తెలిపారు.

Read Also:  రైల్వే స్టేషన్లలో AI టెక్నాలజీ, ఇక చీమ చిటుక్కుమన్నా ఇట్టే తెలిసిపోతుంది!

Related News

TTE Instagram: అమ్మాయి టికెట్ చూసి.. అలా చేయాలంటూ ఒత్తిడి చేసిన టీసీ, ఓర్ని దుంప తెగ!

Trains Cancelled: 3 రాష్ట్రాల్లో రైల్వే అలర్ట్, ఏకంగా 55 రైళ్లు క్యాన్సిల్!

Singapore – Malaysia: మలేసియా, సింగపూర్‌లకు IRCTC సరికొత్త ప్యాకేజ్.. మరీ ఇంత చౌకగానా?

Vande Bharat Train: రైల్వేకు బుర్ర ఉందా? వందేభారత్‌ను ఎవరైనా ఆ రోజు నిలిపేస్తారా?

Rajahmundry to Tirupati Flight: రాజమండ్రి నుంచి తిరుపతికి నేరుగా విమానం.. ఎప్పటి నుంచంటే?

Rail Neer: గుడ్ న్యూస్.. రైల్ నీర్ బాటిల్ ధరలు తగ్గుతున్నాయ్, ఇకపై ఎంతంటే?

Bullet Train: ఏంటీ.. మన బుల్లెట్ ట్రైన్‌కు అడ్వన్స్ బుకింగ్ ఉండదా? మరి రైలు ఎక్కేది ఎలా?

Watch Video: ఫోన్ కొట్టేసిన పోలీసు.. ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది, చివరికి..

Big Stories

×