E-Paper
Advertisement

హీరోయిన్లకు షాకిచ్చేలా నిధి అగర్వాల్ హెయిర్ కేర్.. ఇంట్లోనే ఈజీగా!

హీరోయిన్లకు షాకిచ్చేలా నిధి అగర్వాల్ హెయిర్ కేర్.. ఇంట్లోనే ఈజీగా!
Advertisement

Nidhhi Agerwal:నిధి అగర్వాల్..సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే, తన అందం, ఆరోగ్యం విషయంలో అస్సలు తగ్గనంటుంది ఈ టాలీవుడ్ క్రేజీ బ్యూటీ . సాధారణంగా హీరోయిన్లు తమ హెయిర్ కోసం ఖరీదైన హెయిర్ కేర్ ప్రొడక్ట్స్, రకరకాల బ్యూటీ ట్రీట్మెంట్స్ తీసుకుంటారన్న సంగతి తెల్సిందే.

కానీ నిధి మాత్రం బయటి ప్రొడక్ట్స్ కంటే ఇంట్లోనే తయారు చేసుకునే హోం రెమెడీ లకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం విశేషం.ఇక ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లోఈ అమ్మడు షేర్ చేసిన ఓ క్రేజీ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఒక లడ్డూను పట్టుకుని కెమెరాకు ఫన్నీగా పోజిస్తూ పెట్టిన ఫోటో ఇపుడు అభిమానులని ఫిదా చేస్తుంది.

Advertisement

ఈ ఫొటోతో పాటు తన హెయిర్ కేర్ గురించి అనేక ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది ఈ అమ్మడు. ముఖ్యంగా.. తన జుట్టు ఆరోగ్యం విషయంలో చాలా సీరియస్‌గా ఉంటానని, ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకున్న ఈ ‘హెయిర్ హెల్త్ లడ్డూ’ ద్వారా జుట్టుకు కావాల్సిన పోషకాలను అందిస్తున్నానని చెప్పుకొచ్చింది.

అంతేకాదు, దీన్ని తయారు చేసుకోవడం కూడా పెద్ద కష్టమేమీ కాదని, తనకు ఎంతో ఉపయోగపడిన ఈ టిప్ అభిమానులకు కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానని తెలిపింది.

Advertisement

ఇక నిధి అగర్వాల్ విషయానికి వస్తే కేవలం గ్లామరస్ ఫొటోషూట్లతోనే కాకుండా, అప్పుడప్పుడు తన లైఫ్ స్టైల్, ఫిట్‌నెస్ హ్యాబిట్స్ ని కూడా ఫాలోవర్స్‌తో పంచుకుంటూ ఉంటుందన్న సంగతి తెల్సిందే.

ఇక సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో టైగర్ ష్రాఫ్ కి జోడీగా ‘మున్నా మైఖేల్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, ఆ తర్వాత నాగచైతన్య ‘సవ్యసాచి’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇక అఖిల్ అక్కినేనితో ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో మెరిసినప్పటికీ, రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతోనే నిధికి మాస్ క్రేజ్ వచ్చిందని చెప్పాలి. అందులో డాక్టర్ సారా పాత్రలో తన గ్లామర్, నటనతో యూత్‌ను మెస్మరైజ్ చేసింది.

. ఆ తర్వాత అశోక్ గల్లా ‘హీరో’ చిత్రంతో పాటు తమిళంలో ‘ఈశ్వరన్’, ‘భూమి’, ‘కలగ తలైవన్’ వంటి సినిమాల్లో నటించి తన స్టామినా ప్రూవ్ చేసుకుంది నిధి.అయితే భారీ ఆశలు పెట్టుకున్న పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’రెబల్ స్టార్ ప్రభాస్ ‘ది రాజాసాబ్’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోతుంది ఆ భామ.

మొత్తానికి నిధి అగర్వాల్ షేర్ చేసిన ఈ హెయిర్ హెల్త్ లడ్డూ పోస్ట్ చూస్తుంటే, అసలైన అందం వేసుకునే మేకప్‌లో తినే ఫుడ్ లో ఉందని మరోసారి ప్రూవ్ అవుతుంది.

also read:కూతురు జ్ఞాపకాలతోనే జీవితం.. ఇప్పటికీ చెప్పులు వేసుకోని విజయ్ ఆంటోనీ!

Tags

Related News

త్రివిక్రమ్ డైరెక్షన్ లో చిరు .. గాడ్ ఆఫ్ వార్ లేనట్టేనా?

అలీ రెండో పెళ్లి చేసుకున్నారా? ఇన్నాళ్లకు చేదు నిజం బయట పెట్టిన జుబేదా?

కూతురు జ్ఞాపకాలతోనే జీవితం.. ఇప్పటికీ చెప్పులు వేసుకోని విజయ్ ఆంటోనీ!

బాహుబలి కాంబో మళ్లీ రావడం అంత ఈజీ కాదా?

రూ.50 కోట్లతో వచ్చిన భోగి.. బాక్సాఫీస్ దగ్గర పరిస్థితి ఏంటి?

గ్లామర్ డోస్ పెంచిన దేవియాని శర్మ.. ఫ్యాన్స్‌కు పండగే!

రూ.2500 కోసం ఎంఎస్ నారాయణ పట్టుబట్టారా?.. అసలు విషయం చెప్పిన తమ్మారెడ్డి!

Big Stories

Advertisement
×