Prabhas Rajamouli:టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబోకి రంగం సిద్దమవుతుందన్న వార్తలు ఇపుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.అవును …ప్రపంచవ్యాప్తంగా బాహుబలి తో తెలుగు సినిమా స్థాయిని నెక్స్ట్ లెవెల్ కి తీసికెళ్ళిన జక్కన్న ,ప్రభాస్ ల కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందనే వార్తలు ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంటాయి.
నిజానికి దర్శకధీరుడు రాజమౌళి, రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి జోడీ కడితే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సునామీ సృష్టిస్తారో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తల్లో అసలు నిజమెంత? అసలు వీళ్లిద్దరూ ఇప్పట్లో కలిసి సినిమా చేయడం సాధ్యమేనా? అన్న అనుమానాలు ఇపుడు ట్రేడ్ వర్గాలు రైజ్ చేస్తున్నాయి.
ఈ కాంబినేషన్ లో సినిమా మళ్ళీ రావాలని అభిమానులు ఈ క్రేజీ కాంబో కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నా, రియాలిటీ చూస్తే మాత్రం ఈ ప్రాజెక్ట్ అంత త్వరగా పట్టాలెక్కేలా కనిపించడం లేదునే చెప్పాలి.ముందుగా రాజమౌళి విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్‌బాబుతో ‘వారణాసి’ అనే భారీ గ్లోబల్ ప్రాజెక్టుతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెల్సిందే.
ఈ సినిమా కోసం జక్కన్న ఇప్పటికే రెండేళ్ల నుండి ఫుల్ బిజీ గా ఉన్నాడు.ఇక బాహుబలి ఐదేళ్లపాటు సాగదీసిన జక్కన్న మేకింగ్ మేకింగ్ స్టైల్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు.షూటింగ్, వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకే ఏళ్ల తరబడి కేటాయిస్తారు.
పైగా ఒక సినిమా పూర్తయిన తర్వాత మరో ప్రాజెక్ట్ మొదలుపెట్టడం అంటే అంత ఆషామాషీ కాదు.ఇక ‘వారణాసి’ రిలీజ్ అయ్యాక ఆ సినిమా ప్రమోషన్లతో ఫుల్ బిజీ అయిపోతాడు. కాబట్టి వెంటనే ప్రభాస్‌తో సినిమా స్టార్ట్ చేస్తారనే వార్తలు ప్రస్తుతానికి రూమర్స్ అనే చెప్పాలి.
ఇటు ప్రభాస్ లైనప్ చూస్తే కూడా అంతే బిజీగా కనిపిస్తుంది. ఇప్పటికే ‘ఫౌజీ’, సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’, ‘కల్కి 2898 ఏడీ’ పార్ట్ 2, వంటి భారీ పాన్ ఇండియా సినిమాలతో గ్యాప్ లేకుండా ఉన్నాడు.ఇక వీటిలో ఒక్కో సినిమా కంప్లీట్ అవ్వడానికి చాలా టైమ్ పట్టేలా ఉందని వస్తున్న అప్ డేట్ బట్టి అర్థమవుతుంది .
.ఒక సినిమాకు డేట్స్ ఇస్తే మరో సినిమా షెడ్యూల్‌పై ఎఫెక్ట్ పడే పరిస్థితి . ఇలాంటి టైంలో రాజమౌళి సినిమా కోసం మళ్లీ నాలుగైదేళ్లు కేటాయించడం ప్రభాస్‌కు సాధ్యమయ్యే పనేనా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న !మరోవైపు బాహుబలి కంటే ముందే రాజమౌళి ప్రభాస్‌కు రెండు కథలు చెప్పారని, అందులో ఒకటి బాహుబలి కాగా రెండోది ఒక యాక్షన్ డ్రామా అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అయితే ఇన్నేళ్ల తర్వాత ఆ పాత కథనే మళ్లీ తీస్తారా అంటే అనుమానమే, అప్పటికి ఇప్పటికి ట్రెండ్ చాలా మారిపోయింది. పైగా 2028 నుంచి ప్రభాస్ డేట్స్ రాజమౌళికి ఇస్తున్నారని వస్తున్న వార్తలపై అటు హీరో కానీ, ఇటు డైరెక్టర్ కానీ ఎక్కడా రియాక్ట్ .కాలేదు మరి ముందు ముందు ఏమైనా రియాక్ట్ అవుతారో చూడాలి .
also read:రూ.50 కోట్లతో వచ్చిన భోగి.. బాక్సాఫీస్ దగ్గర పరిస్థితి ఏంటి?