E-Paper
Advertisement

అలీ రెండో పెళ్లి చేసుకున్నారా? ఇన్నాళ్లకు చేదు నిజం బయట పెట్టిన జుబేదా?

అలీ రెండో పెళ్లి చేసుకున్నారా? ఇన్నాళ్లకు చేదు నిజం బయట పెట్టిన జుబేదా?
Advertisement

Ali Wife Zubeda: జుబేదా పరిచయం అవసరం లేని పేరు .ప్రముఖ కమెడియన్ అలీ (Ali)భార్యగా ఈమె అందరికీ సుపరిచితమే. బాల నటుడుగా సినిమా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అలీ జుబేదను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు  ముగ్గురు సంతానం. అలీ కమెడియన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇక జుబేదా(Zubeda) కూడా ఇటీవల కాలంలో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి వంటలకు సంబంధించిన వీడియోలతో పాటు బిజినెస్ కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇలా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అంటూ ఈమె కూడా చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు..

16 సంవత్సరాలకే వివాహం..

ఇకపోతే ఇటీవల జుబేదా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈమె తమకు సంబంధించిన ఎన్నో వ్యక్తిగత విషయాలను బయటపెట్టారు. ఈ క్రమంలోనే గతంలో అలీ రెండో పెళ్లి(ali second marriage ) చేసుకున్నారు అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై కూడా జుబేదా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. తనకు 16వ సంవత్సరంలోనే పెళ్లి జరిగిందని తెలిపారు. పెళ్లి అయిన ఏడాదికి అలీ రెండో పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు వచ్చిన మాట నిజమేనని జుబేదా తెలిపారు.

నటి శుభ శ్రీతో రెండో పెళ్లి..

Advertisement

మాకు పెళ్లి జరిగిన ఏడాదికి మా నాన్న నన్ను మా ఇంటికి తీసుకెళ్లారు అలా ఇంటికి తీసుకువెళ్లిన మరుసటిరోజే అలీ రెండో వివాహం చేసుకున్నారని మా నాన్నకు ఎవరో ఫోన్ చేసి చెప్పారు. అలా చెప్పడంతో నాన్న కంగారుపడి తనకేమీ చెప్పకుండా వెంటనే తిరిగి మా అత్తారింటికి తీసుకువచ్చారు. అసలు నాన్న ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ట్రైన్ దిగి ఆటోలో వెళుతున్న సమయంలో నువ్వు ఏమీ బాధపడకు ఇంటికి వెళ్ళగానే శుభశ్రీ ఉంటుంది అంటూ అసలు విషయం చెప్పారు. నాన్న అలా చెప్పినప్పటికీ నేను నమ్మలేదు ఎందుకంటే ఆయనకు నేనంటే చాలా ఇష్టం ఏడాదికే ఎంతో ప్రేమను చూపించారు కాబట్టి నేను నమ్మలేదని జుబేదా తెలిపారు.

సినిమా షూటింగ్లో భాగం..

ఇక ఇంటికి వెళ్ళగానే డోర్ కొట్టగా అత్తయ్య వచ్చి డోర్ తీయగానే ఆమె కూడా ఎందుకు మళ్ళీ ఈ పిల్ల వచ్చింది అంటూ ఆశ్చర్య పోయిందని, నేను మాత్రం వెళ్ళి మా గదిలో శుభశ్రీ ఎక్కడ ఉందా అని వెతకడం మొదలుపెట్టాను. అప్పుడే వాష్ రూమ్ లో నుంచి వచ్చిన మా ఆయన నన్ను చూసి షాక్ అయ్యారు.  జరిగిన విషయం మొత్తం మా ఆయనకు చెప్పడంతో ఆయన షాక్ అయ్యారని జుబేదా తెలిపారు. అయితే సినిమా షూటింగ్లో భాగంగా  పెళ్లికి సంబంధించిన సీన్ జరగడంతో నిజంగానే పెళ్లి చేసుకున్నారనే ఒక పుకారు పుట్టించారని అలీ అప్పట్లో రెండో పెళ్లి చేసుకున్నారు అంటూ వచ్చిన వార్తలలో ఏమాత్రం నిజం లేదని జుబేదా ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Also Read: ఒక్క హిట్ కొట్టిందో లేదో.. నిర్మాతలకు కండిషన్లు పెడుతున్న సాత్విక!

Related News

కూతురు జ్ఞాపకాలతోనే జీవితం.. ఇప్పటికీ చెప్పులు వేసుకోని విజయ్ ఆంటోనీ!

బాహుబలి కాంబో మళ్లీ రావడం అంత ఈజీ కాదా?

రూ.50 కోట్లతో వచ్చిన భోగి.. బాక్సాఫీస్ దగ్గర పరిస్థితి ఏంటి?

గ్లామర్ డోస్ పెంచిన దేవియాని శర్మ.. ఫ్యాన్స్‌కు పండగే!

రూ.2500 కోసం ఎంఎస్ నారాయణ పట్టుబట్టారా?.. అసలు విషయం చెప్పిన తమ్మారెడ్డి!

ఒక్క హిట్ కొట్టిందో లేదో.. నిర్మాతలకు కండిషన్లు పెడుతున్న సాత్విక!

రామ్ చరణ్ తో నటించాలని ఉందా.. ఇలా చేస్తే చాలు!

Big Stories

Advertisement
×