Bhogi Movie:నారీ నారీ నడుమ మురారి వంటి సూపర్ హిట్ తర్వాత సంపత్ నంది తో జత కట్టాడు శర్వా .భోగి అనే టైటిల్ తో వచ్చిన ఈ సినిమా ఈరోజే థియేటర్ లోకి వచ్చేసింది.అయితే ఎప్పుడూ చేసే రొటీన్ కమర్షియల్ సినిమాలు చేసే శర్వా ఈసారి తెలంగాణ పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో రా అండ్ రస్టిక్ సినిమా ని చేయడం విశేషం.
ఇక ఇందులో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించగా, పల్లెటూరి కథగా తెరకెక్కిన ఈ సినిమాపై రిలీజ్‌కు ముందే మంచి బజ్ ఏర్పడింది. అయితే భారీ బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం రాబడుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.
శరత్ స్వాత్, అవినాష్, లాల్, దయానంద రెడ్డి, రోహత్ పట్నాయక్, ఆడుకాలం నరేన్ లు కీలక పాత్రల్లో కనిపించగా గతంలో ‘రచ్చ’, ‘బెంగాల్ టైగర్’ లాంటి కమర్షియల్ సినిమాలతో సక్సెస్ అందుకున్న సంపత్ నంది, ఈసారి రస్టిక్ స్టోరీని ఎంచుకోవడం విశేషం.
ఇక ఈ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కేకే రాధామోహన్ ఏకంగా 50కోట్ల వరకు ఖర్చు పెట్టాడని ట్రేడ్ వర్గాల టాక్ . శర్వానంద్ రేంజ్ హీరో సినిమాకు ఇంత బడ్జెట్ పెట్టారంటే, బాక్సాఫీస్ దగ్గర కూడా గట్టిగానే రాబట్టాల్సి ఉంటుంది.
ఇక సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చూస్తే థియేట్రికల్ రైట్స్ ద్వారా సుమారు రూ.25 కోట్ల బిజినెస్ జరిగినట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ .దీనికి తోడు డిజిటల్, శాటిలైట్, ఇతర నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా సుమారు రూ.15 కోట్లు వచ్చాయని తెలుస్తుంది.
మొత్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు రూ.40 కోట్లకు చేరిన ఈ సినిమా గట్టున పడాలంటే సుమారు రూ.25 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది. అంటే వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ.50 కోట్ల గ్రాస్ టార్గెట్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ రేసులోకి దిగిందన్న మాట.
ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం మొదటి రోజు తెలంగాణలో రూ.2 కోటి, ఏపీలో రూ.1.50 కోట్లు, కర్ణాటకలో రూ.25 లక్షలకు పైగా రావచ్చని తెలుస్తుంది.ఇక రెస్టాఫ్ ఇండియా కలిపి రూ.3 కోట్లు, ఓవర్సీస్ నుంచి మరో రూ.2 కోట్లు వస్తే తొలి రోజు రూ.7 నుండి 8 కోట్ల నెట్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.
అయితే ఒకరోజు గడిస్తే కానీ ఈ లెక్కల్లో ఎంత నిజముందో బయట పడుతుంది.అయితే సినిమాకి మిక్స్డ్ టాక్ రావడంతో సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అన్న టాక్ విపిస్తుంది .చూడాలి మరి ఒకే ఒక జీవితం’, ‘మహానుభావుడు’, ‘శతమానం భవతి’ సినిమాలతో ఆకట్టుకున్న శర్వా ‘భోగి’ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో !
also read:గ్లామర్ డోస్ పెంచిన దేవియాని శర్మ.. ఫ్యాన్స్‌కు పండగే!