E-Paper
Advertisement

కూతురు జ్ఞాపకాలతోనే జీవితం.. ఇప్పటికీ చెప్పులు వేసుకోని విజయ్ ఆంటోనీ!

కూతురు జ్ఞాపకాలతోనే జీవితం.. ఇప్పటికీ చెప్పులు వేసుకోని విజయ్ ఆంటోనీ!
Advertisement

Vijay Antony:మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ మొదలెట్టి ,నటుడిగా సత్తా చాటిన విజయ్ ఆంటోనీ 2023లో తన కుమార్తె మీరాను కోల్పోవడంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయిన సంగతి తెల్సిందే .ఇక ఈ సంఘటన అప్పట్లో కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ ని కూడా కలచివేసింది.అయితే ఇప్పుడు విజయ్ ఆంటోనీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తన కుమార్తె కోసం గతంలో ఆయన ఎన్నో జతల షూలను కొన్నాడని , అయితే వాటిని ఆమెవేసుకోకుండానే కన్ను మూసిందని ఆ జ్ఞాపకంతోనే ఆయన అప్పటి నుంచి చెప్పులు వేసుకోకుండా జీవిస్తున్నాడని తెలుస్తుంది.

Advertisement

అంతే కాకుండా ఆమె చివరిసారిగా చేతికి పెట్టుకున్న వాచ్‌ను కూడా ఇప్పటికీ ఆయన పెట్టుకుంటున్నాడని విజయ్ ఆంటోనీ భార్య ఫాతిమా అనేక సార్లు చెప్పింది కూడా.ఇంట్లో కాస్ట్ల వాచీలు ఎన్నో ఉన్నప్పటికీ, మీరా జ్ఞాపకంగా మిగిలిన ఆ వాచ్‌నే ఆయన ఎక్కువగా పెట్టుకోవడం చూస్తే కూతురు మీరా అంటే విజయ్ ఆంటోని కి ఎంత ఇష్టమో అర్థమవుతుంది.

నిజానికి విజయ్ ఆంటోనీకి తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా ‘బిచ్చగాడు’ సినిమాతో ఆయనకు ఇక్కడ విపరీతమైన క్రేజ్ వచ్చిందన్నా సంగతి తెల్సిందే. ఒక సాధారణ తల్లి కోసం కొడుకు చేసే త్యాగం, తల్లి కొడుకుల మధ్య ఉండే అనుబంధాన్ని చూపించిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Advertisement

ఆ తర్వాత బేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్, బిచ్చగాడు 2 వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు . అయితే ,స్క్రీన్ పైన ,స్క్రీన్ వెనకాల తనదైన కష్టంతో ఎంతో మందిని అలరిస్తున్న విజయ్ ఆంటోనీ నిజ జీవితంలో ఇంతటి విషాదాన్ని ఎదుర్కోవడం నిజంగా అభిమానులను బాధపెట్టేదే.

ఇక మీరా చనిపోయిన తర్వాత విజయ్ ఆంటోనీ తన మనసులోని బాధను భయపెడుతూ తన కూతురితో పాటు తాను కూడా చనిపోయినట్లుగా అనిపించిందని, ఇకపై ఆమె పేరుతో మంచి పనులు చేస్తానని గతంలో ఒక పోస్ట్ వదిలడం ఎందరినో ఎమోషనల్ చేసింది

ఇక ప్రస్తుతం విజయ్ ఆంటోనీ నటించిన ‘అప్పా కుట్టి’ సినిమా కూడా తండ్రీకూతుళ్ల అనుబంధం చుట్టూ తిరిగే కథ కావడం మరో ఆసక్తికరమైన విషయం. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ఫాతిమా తన భర్త గురించి ఇలాంటి ఎమోషనల్ టాపిక్ అందరితో  పంచుకోవడంతో విజయ్ ఆంటోని కి సంబంధించిన వార్తలు ఇపుడు మరోసారి హైలెట్ అవుతున్నాయి.

also read:బాహుబలి కాంబో మళ్లీ రావడం అంత ఈజీ కాదా?

Tags

Related News

బాహుబలి కాంబో మళ్లీ రావడం అంత ఈజీ కాదా?

రూ.50 కోట్లతో వచ్చిన భోగి.. బాక్సాఫీస్ దగ్గర పరిస్థితి ఏంటి?

గ్లామర్ డోస్ పెంచిన దేవియాని శర్మ.. ఫ్యాన్స్‌కు పండగే!

రూ.2500 కోసం ఎంఎస్ నారాయణ పట్టుబట్టారా?.. అసలు విషయం చెప్పిన తమ్మారెడ్డి!

ఒక్క హిట్ కొట్టిందో లేదో.. నిర్మాతలకు కండిషన్లు పెడుతున్న సాత్విక!

రామ్ చరణ్ తో నటించాలని ఉందా.. ఇలా చేస్తే చాలు!

జనవరి 12 విడుదల డబ్బింగ్ షురూ…యమ స్పీడు మీదున్న అనిల్ రావిపూడి!

Big Stories

Advertisement
×