E-Paper
Advertisement

పెళ్లి పీటలు ఎక్కిన ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నటుడు చందు..

పెళ్లి పీటలు ఎక్కిన ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నటుడు చందు..
Advertisement

Illu Illaalu Pillalu Serial Actor Chandu: ఇటీవల కాలంలో సినిమా సెలబ్రిటీలు వరుసగా పెళ్లిళ్లు చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఇక బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ (Illu Illaalu Pillalu Serial)సెలెబ్రిటీలు వరుసగా శుభవార్తలను తెలియజేస్తున్నారు. ఇదివరకే ప్రేమ పాత్రలో నటించిన నటి లావణ్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్టు తెలియజేశారు. అదేవిధంగా నర్మదా పాత్రలో నటిస్తున్న అన్షు రెడ్డి కూడా ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సీరియల్ లో చందు పాత్ర(Chandu Role)లో నటిస్తున్న ప్రశాంత్ కడియం(Prashanth Kadiyam ) పెళ్లి బంధంలోకి అడుపెట్టారు.

ప్రశాంత్ కడియం వివాహం..

ఈ ఏడాది ఆగస్టు నెలలో ప్రశాంత్ తన నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇలా వీరి నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఈయన వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా కొత్త జంటకు అభినందనలు తెలుపుతూ పోస్టులు చేస్తున్నారు. నవంబర్ 26వ తేదీ ప్రశాంత్ కడియం పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తుంది.

పెళ్లి పీటలెక్కిన ప్రశాంత్ కడియం..

Advertisement

ఇక వీరిద్దరికి పెళ్లికి సంబంధించిన ఫోటోలు బయటకు రాలేదు కానీ పెళ్లి తర్వాత ప్రశాంత్ భార్యతో కలిసి దిగిన ఫోటో ఒకటి బయటకు రావడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇక ప్రశాంత్ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు తన బ్యాగ్రౌండ్ ఏంటి అనే వివరాలను ఇదివరకు ఎక్కడ వెల్లడించలేదు. అయితే ఆమె సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న అమ్మాయి మాత్రం కాదని తెలుస్తోంది. ఇలా కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ప్రశాంత్ కడియంకు అభిమానులు అభినందనలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు.

గుర్తింపు తెచ్చిన సీరియల్..

ఇకపోతే ప్రశాంత్ వైజాగ్ కు చెందిన కుర్రాడు. సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఆసక్తితో ఈయన ఇండస్ట్రీ వైపు అడుగులు వేయగా బుల్లితెర అవకాశాలను అందుకుంటున్నారు. ఇక ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో చందు అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ సీరియల్ ద్వారా ప్రశాంత్ కడియం ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈయన గతంలో నాగపంచమి, కుంకుమ పువ్వు మళ్లీ అనే తదితర సీరియల్స్ లో నటించారు కానీ ఇల్లు ఇల్లాలు పిల్లలు మాత్రం మంచి గుర్తింపును తీసుకువచ్చింది. ఈ సీరియల్ పెద్ద కొడుకుగా చందు అనే పాత్రలో నటిస్తూ మంచి ఆదరణ దక్కించుకున్నారు.

Advertisement

Also Read: త్రివిక్రమ్ డైరెక్షన్ లో చిరు .. గాడ్ ఆఫ్ వార్ లేనట్టేనా?

Related News

బిగ్ బాస్ 10 విన్నర్ అతనే.. పుసుక్కున నోరు జారిన సుధీర్..

నాగవ్వ, వైష్ణవి సోనీ కాంబినేషన్‌లో వచ్చిన సాంగ్స్ ఇవే.. ఎన్ని హిట్లో తెలుసా?

గాజులు గలగల హిట్.. గజ్జెలు గలగల ఫ్లాప్.. రాధమ్మ కూతురికి ఏంటీ షాక్!

నా జీవితంలో దారుణమైన చీకటి రోజులవే: రోహిత్!

ఝాన్సీ పుట్టినరోజు.. మంచి పనికి శ్రీకారం చుట్టిన రైతుబిడ్డ.. ఫ్యాన్స్ కు స్పెషల్ రిక్వెస్ట్!

నాపై కేస్ పెడతామని బెదిరించారు..నిజాలు బయటపెట్టిన రోహిత్!

Big Stories

Advertisement
×