Tammareddy Bharadwaja:ms నారాయణ.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.తనదైన కామెడీతో ఎన్నో సినిమాల్లో నటించి నవ్వించిన ఈ స్టార్ కమెడియన్ మనల్ని వదిలి పదేళ్ళకి పైగానే అయిపొయింది.అయితే తాజాగా ms ని గుర్తుచేసుకున్నారు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ .శ్రీకాంత్ హీరోగా చేసిన నేను పెళ్లికి రెడీ సినిమా 23 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో ms గురించి అలాగే సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలని చెప్పుకొచ్చారు.
డబ్బుల దగ్గరకు వచ్చేసరికి మాత్రం
నేను పెళ్లికి రెడీ సినిమాలో ms నారాయణ సినిమా మొత్తం ఉంటాడని,ఒకరకంగా చెప్పాలంటే హీరో శ్రీకాంత్‌తో ఈక్వల్ గా క్యారక్టర్ ఉంటుందని చెప్పుకొచ్చారు.ఇక షూటింగ్ సెట్లో ఎంఎస్ నారాయణ ఎప్పుడూ సీరియస్‌గా ఉండకుండా నవ్విస్తూనే ఉండేవారని, కానీ డబ్బుల దగ్గరకు వచ్చేసరికి మాత్రం చాలా పట్టుదలగా ఉండేవాడని గుర్తు చేసుకున్నారు.
ఇక అసలు విషయం చెబుతూ అప్పట్లో టీడీఎస్ విధానం కొత్తగా వచ్చినప్పుడు, తన రెమ్యునరేషన్లో టీడీఎస్ కట్ చేయకుండా పూర్తి డబ్బులు ఇవ్వాలని మంకు పట్టు పడేవాడని,కట్ చేసిన డబ్బులు మళ్లీ ఎప్పుడు వస్తాయో తెలియదనే టెన్షన్‌తో మొత్తం డబ్బులు వెంటనే ఇవ్వాలని పట్టుబట్టేవారని వివరించాడు.
ఫలితం వేరేలా ఉండేదేమో
ఇక సినిమా విషయానికి ముగ్గురు హీరోయిన్లు, మంచి కామెడీ ఉన్నా ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదని ,సినిమా చూసిన తర్వాత కొన్ని చోట్ల ఎదో మిస్ అయిందని అనిపించిందని తెలిపారు., రెండు మూడు రోజులు రీషూట్ చేద్దామని దర్శకుడిని అడగగా వద్దనడంతో చేయలేకపోయామని, అప్పుడు రీషూట్ చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమోనని ఇప్పటికీ అనిపిస్తుందని ఆరోజుల్ని గుర్తుచేసుకున్నారు.
ఒకే స్టోరీతో వేర్వేరు భాషల్లో సినిమాలు తీసినా ఫలితాలు ఎందుకు మారతాయో కూడా వివరించారు. ఒక అబ్బాయి ముగ్గురు అమ్మాయిలను ప్రేమించే కథతో హిందీలో వచ్చిన సినిమా బాగా ఆడినా, తెలుగులో వచ్చిన సినిమాలు మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాయని గుర్తుచేశారు. కథ ఒక్కటే అయినా దాన్ని చూపించే తీరు, కామెడీ , సీన్ల మధ్య లింక్ సరిగ్గా కుదరడం వల్లే సినిమా ఫలితం మారుతుందని చెప్పుకొచ్చారు.
చిరంజీవి కోతల రాయుడు సినిమాలో
అయితే రీషూట్ విషయంలో మాత్రం ఎప్పుడూ వెనుకాడేవాడిని కానని , చిరంజీవి కోతల రాయుడు సినిమాలో జైలు సీన్లు సరిగ్గా రాలేదని మళ్లీ సెట్ వేసి రెండు రోజులు షూట్ చేశామని చెప్పుకొచ్చాడు. కుటుంబం కోసం హీరో తీసుకునే నిర్ణయం, తండ్రి పరువు కాపాడే ఎమోషన్ ఆ సీన్లు బాగా పండటంతో సినిమా హిట్ అవ్వడానికి అది కూడా ఒక కారణమైందని తెలిపారు.
నేను పెళ్లికి రెడీ సినిమా బడ్జెట్ సుమారు 40 నుంచి 50 లక్షల వరకు ఉండేదని, రెమ్యునరేషన్లు కలిపితే కోటి నుంచి కోటిన్నర దాకా ఖర్చయిందని చెప్పారు. సినిమా ఆడకపోవడంతో పెట్టిన డబ్బు మొత్తం పోయిందని, ఆ నష్టాన్ని తట్టుకోవడం కష్టమై ఆ తర్వాత ఉద్యోగాలు కూడా చేయాల్సి వచ్చిందని సరదాగా అన్నారు. మొత్తంగా ms గురించి అలాగే తాను తీసిన సినిమా ఫ్లాప్ అయినా విధానం గురించి తమ్మారెడ్డి చేసిన కామెంట్స్ ఇపుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి .
also read:నాగవ్వ, వైష్ణవి సోనీ కాంబినేషన్లో వచ్చిన సాంగ్స్ ఇవే.. ఎన్ని హిట్లో తెలుసా?