Ram Pothineni: టాలీవుడ్ హీరోగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు రామ్ పోతినేని (Ram Pothineni)ఒకరు. ఎనర్జిటిక్ హీరోగా ఎన్నో విభిన్నమైన సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ హీరో ఇటీవల కాలంలో సరైన స్థాయిలో తన సినిమాల ద్వారా సక్సెస్ అందుకోలేకపోతున్నారని చెప్పాలి. ఇక ఈయన చివరిగా స్కంద సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచింది. ఇక త్వరలోనే ఆంధ్రా కింగ్ తాలూకా(Andhra King Taluka) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈయన తాజాగా జగపతిబాబు (Jagapathi Babu)హోస్ట్ గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా(Jayammu Nischayammuraa)కార్యక్రమానికి హాజరయ్యారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఇందులో భాగంగా జగపతిబాబు ఈయన లవ్ గురించి అలాగే కెరియర్ కి సంబంధించిన విషయాల గురించి కూడా ప్రశ్నించారు. అపార్ట్మెంట్ లో సోలోగా ఉంటున్నావు ఎఫైర్ అయితే గ్యారెంటీగా ఉంటుంది వార్తలు కూడా బయటకు వస్తున్నాయి అంటూ ప్రశ్నించారు.
జగపతిబాబు ఇలా ప్రశ్నించడంతో వెంటనే రామ్ లవ్ అనండి బాగుంటుంది అంటూ సిగ్గు పడిపోయారు. ఒక అమ్మాయిని పడేయడానికి చాలా తిప్పలు పడాల్సి వస్తోంది అంటూ రామ్ చెప్పడంతో ఖచ్చితంగా ఈయన ప్రేమలో ఉన్నారని స్పష్టమవుతుంది. మరి తన లవ్ గురించి ఇంకా ఎలాంటి విషయాలు పంచుకున్నారనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఇకపోతే ఇటీవల రామ్ రైటర్ గా కూడా మారిన సంగతి తెలిసిందే. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో నువ్వుంటే చాలు అనే పాటను స్వయంగా రామ్ రాశారు. ఈ పాట ఎంతలా ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక జగపతిబాబు ఈయనని ప్రశ్నిస్తూ కథలు కూడా రాస్తున్నావట కదా అని అడగడంతో స్క్రిప్ట్ కి సంబంధించిన విషయాలను వెల్లడించారు.
డైరెక్టర్ గా ఎప్పుడు మారబోతున్నావు అంటూ ప్రశ్నించడంతో ఇంకా ఆ సినిమాపై వర్క్ చేయాల్సి ఉందని వెల్లడించారు. రామ్ స్పీడ్ చూస్తుంటే త్వరలోనే ఈయన డైరెక్టర్ గా తన మొదటి సినిమాని ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇకపోతే రామ్ గత కొద్ది రోజులుగా నటి భాగ్యశ్రీతో ప్రేమలో ఉన్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఇలా నిత్యం వీరి రిలేషన్ కి సంబంధించిన ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతున్నప్పటికీ వీరు మాత్రం ఈ వార్తలపై ఎక్కడ స్పందించలేదు. ఒక అమ్మాయిని పడేయడానికి చాలా కష్టమవుతుందని మాట్లాడటంతో కచ్చితంగా ఈయన రిలేషన్ లో ఉన్నారని అభిమానులు భావిస్తున్నారు.
Also Read: Pankaj dheer: మహాభారత కర్ణుడు పంకజ్ ధీర్ మృతి..68 ఏళ్ల వయసులో