BigTV English

Fake Liquor Case: అక్రమంగా మద్యం అమ్ముతున్న.. ఇద్దరు మహిళలు అరెస్ట్

Fake Liquor Case: అక్రమంగా మద్యం అమ్ముతున్న.. ఇద్దరు మహిళలు అరెస్ట్
Advertisement

Fake Liquor Case: ట్రావెల్‌ ఎజెంట్‌ ముసుగులో విదేశీ మద్యం వ్యాపారం.. ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ  నేపథ్యంలో ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. వారి దగ్గర విలువైన విదేశీ మద్యం బాటిళ్లు, కారు, టూ వీలర్‌ను స్వాధీనం చేసుకున్నారు.


జూబ్లీహిల్స్‌కు చెందిన సుమీత్‌ అనే వ్యక్తి ట్రావెల్‌ ఎజెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇతను వివిధ దేశాలకు చాల మంది ట్రావెలర్స్‌ను విదేశాలకు పంపిస్తు ఉంటాడు. అయితే, ఇదే వ్యాపారం ముసుగులో అతను విదేశీ మద్యం స్మగ్లింగ్ చేస్తున్నట్లు తేలింది. విదేశాలకు వెళ్లే ప్రయాణికుల సహాయంతో అక్కడి నుంచి మద్యం తెప్పించి, హైదరాబాద్‌లోని హై ప్రొఫైల్ కస్టమర్లకు అధిక ధరలకు అమ్ముతుంటాడు. ఒక్కో బాటిల్‌పై వందల రూపాయల లాభం పొందుతూ సుమీత్‌ నెట్‌వర్క్‌ భారీగా విస్తరించింది.

సమాచారం తెలుసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ చంద్రశేఖర్‌ గౌడ్‌, ఎస్సై శ్రీనివాస్‌ సిబ్బందితో కలిసి బోరబండా ప్రాంతంలో దాడి నిర్వహించారు. అక్కడ మూర్తి యుగేందర్‌ అనే వ్యక్తి టూ వీలర్‌పై.. మద్యం బాటిళ్లను తీసుకెళుతున్నట్లు గుర్తించారు పోలీసులు. అతని వద్ద నుంచి తొమ్మిది విదేశీ మద్యం బాటిల్లు లభించాయి. నిందితుడితో పాటు మనీష్‌ కుమార్‌ ఇంట్లోను, కారులో తనిఖీలు నిర్వహించే మరో 43 మద్యం బాటిళ్లను కారులో లభించాయి.


దీనిపై మరింత సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఈ మొత్తం స్మగ్లింగ్‌ వ్యవహారం వెనుక ట్రావెల్‌ ఎజెంట్‌ సుమీత్‌ ఉన్నట్లు గుర్తించారు. విదేశాల నుంచి ఎయిర్‌పోర్ట్‌ ద్వారా మద్యం తెప్పించి, స్థానికంగా అమ్మకాలు జరిపే వ్యవస్థను అతడే నడుపుతున్నాడని తేలింది. ఈ నేపథ్యంలో పోలీసులు సుమీత్‌పై కూడా కేసు నమోదు చేశారు.

పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి ఒక కారు, ఒక టూ వీలర్‌, 52 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సీజ్ చేసిన వస్తువుల విలువ రూ. 6 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు.

మద్యం అమ్మకాలు చేస్తున్న మహిళల అరెస్ట్

ఇదిలా ఉంటే.. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో భాగంగా ఎస్టీఎఫ్‌ బీ టీమ్‌ సీఐ బిక్షారెడ్డి, ఎస్సై బాలరాజు బృందం బోరబండా ఇందిరానగర్‌ ప్రాంతంలో తనిఖీలు చేపట్టింది. అక్కడ ఇద్దరు మహిళలు సంచుల్లో మద్యం బాటిళ్లు అమ్ముతున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

తనిఖీల్లో 173 మద్యం సీసాలు లభించాయి. వీటిలో క్వార్టర్లు, హాఫ్‌ బాటిళ్లు, బీరు సీసాలు ఉన్నాయి. ఈ ఈశ్వరమ్మ, మరియాల అనే ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసి, సీజ్ చేసిన మద్యం సీసాలతో పాటు.. అమీర్‌పేట్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ కు తరలించారు.

Related News

Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ బైపోల్.. ఈ తేదీల్లో ఎగ్జిట్ పోల్స్ నిషేదం, ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

Etala Rajender: ఈటలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి షాకింగ్ న్యూస్.. ఒక్కొక్కరిపై రూ.2 కోట్ల పరువు నష్టం దావా?

Supreme Court: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా..

Clashes in BJP: రామచంద్రరావు ముందే.. పొట్టు పొట్టు కొట్టుకున్న బీజేపీ నేతలు

Jogipet News: ఒక్క నిమిషం వదిలిపెట్టండి.. ఆత్మహత్య చేసుకుంటా-సలీమ్, మేటరేంటి?

Hydra Demolitions: వణుకు పుట్టిస్తున్న హైడ్రా..! రాజేంద్రనగర్‌లో అక్రమ కట్టడాలు నేలమట్టం

Mlc Kavitha: నా దారి వేరు.. ఆయ‌న దారి వేరు.. కేసీఆర్‌పై క‌విత షాకింగ్ కామెంట్స్

Big Stories

×