Banning on Hindi Movies Songs: త్రిభాషా సూత్రం వివాదంపై తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. త్రిభాషా సూత్రంపై కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాల మధ్య ఎంతోకాలంగా వివాదం నెలకొసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు హిందీ భాషకు వ్యతిరేకంగా ఎంకే స్టాలిన్ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనుందని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా హిందీ బోర్డులు, పాటలు, సినిమాలు, హోర్డింగ్స్ని నిషేధించేందుకు ఈ బిల్లు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన చట్టంపై చర్చించేందుకు నిన్న రాత్రి ముఖ్యమంత్రి ఏంకే స్టాలిన్ అత్యవసర సమావేశం నిర్వహించారు.
న్యాయ నిపుణులు, ప్రభుత్యం మధ్య ఈ అత్యవసర సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. హిందీ భాషను తమపై బలవంతంగా రుద్దడం, రాష్ట్రంలో హిందీ భాష ప్రాముఖ్యతను తగ్గించడమే కాకుండ.. హిందీ బోర్డులు, సినిమాలు, పాటలు, హోర్డింగ్స్ ని నిషేధించాలనే ఉద్దేశంతో ఈ బిల్లును రూపొందించినట్టు తెలుస్తోంది. రాజ్యాంగానికి లోబడే ఈ బిల్లు తయారు చేసినట్టు సమాచారం. అధికార డీఎంకే తీసుకున్న ఈ చర్య హిందీ భాషను బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ ద్రవిడ ఉద్యమం నుంచి వస్తున్న సుదీర్ఘ పోరాటాన్ని ఇది మరింత బలోపేతం చేసేలా ఉంది.
తమిళ భాష, సంస్కృతిని రక్షించడానికే ఈ బిల్లును పెడుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ బిల్లులో ఎక్కడ రాజ్యాంగంలలోని నిబంధనలు తప్పలేదని, రాజ్యాంగానికి అనుగుణంగానే రూపొందించామని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 343-351 కింద ఆంగ్లాన్ని సహ-అధికారిక భాషగా కొనసాగిస్తుందని ఎంకే స్టాలిన్ ప్రభుత్వం వెల్లడించింది. హిందీ భాషను తమిళ ప్రజలపై బలవంతంగా రుద్దడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని డీఎంకే సహా పలు పార్టీలు ఆరోపిస్తోన్న విషయం విధితమే. తమిళనాడుపై బలవంతంగా హిందీ భాషను రుద్దడానికి వ్యతిరేకంగా ఆ రాష్ట్ర శాసనసభ ఇటీవలే ఓ తీర్మానం చేసింది. అధికార భాషలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ నివేదికలోని సిఫారసులను అమలు చేయొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
Also Read: Rishab Shetty : బ్యాన్ ఎఫెక్ట్… తెలుగు వాళ్ల దెబ్బకు దిగొస్తున్న రిషబ్ శెట్టి
సెప్టెంబర్ 9న రాష్ట్రపతికి ఈ కమిటీ నివేదించిన సిఫారసులను తమిళులు సహా ఇతర రాష్ట్రాల్లో భాషలకు, వాటిని మాట్లాడే ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని సీఎం ఎంకే స్టాలిన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంతోపాటు హిందీయేతర భాషలు మాట్లాడే రాష్ట్రాలకు భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఇచ్చిన హామీకి పార్లమెంటరీ కమిటీ సిఫారసులు వ్యతిరేకంగా ఉన్నాయని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. దీన్ని అసెంబ్లీ కూడా ఆమోదించింది. అయితే డీఎంకే పెట్టబోతున్న ఈ బిల్లుపై బీజేపీ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ప్రభుత్వ చర్యపై బీజేపీ నేత వినోజ్ సెల్వం ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీ భాషను రాష్ట్రంలో నిషేధించేందుకు ఈ బిల్లు అని, ఇది డీఎంకే ముర్ఖపు చర్య అని ఆయన ధ్వజమెత్తున్నారు. భాషను రాజకీయ సాధనంగా ఉపయోగించకూడదని, ఇది డీఎంకే తెలివి తక్కువ చర్యకు నిదర్శనమన్నారు.