Avika Gor: చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా బాలనటిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు నటి అవికా గోర్(Avika Gor). ఇలా బాలనటిగా ఎన్నో టీవీ సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం హీరోయిన్ గా కూడా వెండి తెరపైకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తెలుగులో ఉయ్యాల జంపాల అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న అవికా అనంతరం పలు తెలుగు సినిమాలలో నటించారు. ప్రస్తుతం కెరియర్ పరంగా హీరోయిన్ గా నిర్మాతగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్న ఈమె ఇటీవల కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
అవికా గోర్ గత కొంతకాలంగా మిలింద్ చంద్వాని (Milind Chandwani)అనే వ్యక్తితో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇలా కొన్ని సంవత్సరాలు పాటు ప్రేమలో ఉన్న ఈ జంట ఇటీవల పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. వీరి వివాహం సెప్టెంబర్ 30వ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను కూడా ఈ జంట సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ వీరికి అభినందనలు తెలియజేశారు అయితే కొంతమంది మాత్రం వీరి పెళ్లిపై పెద్ద ఎత్తున విమర్శలు చేయడం మొదలుపెట్టారు.
మామూలుగా అయితే సెలబ్రిటీలు వారి వివాహాన్ని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు కానీ అవికా, మిలింద్ మాత్రం వీరి వివాహాన్ని టీవీ రియాలిటీ షోలో చేసుకోవడంతో ఇది కాస్త విమర్శలకు కారణమైంది. ఇలా ఒక రియాలిటీ షోలో పెళ్లి చేసుకోవడం వల్ల సదరు చానల్ కు అద్భుతమైన రేటింగ్ వస్తుందని, అందుకుగాను ఈ జంట భారీ స్థాయిలో డబ్బు కూడా తీసుకున్నారంటూ విమర్శలు రావడంతో ఈ విమర్శలపై అవికా దంపతులు స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఇలా టీవీ షోలో పెళ్లి చేసుకోవాలనేది చిన్నప్పటి నుంచి నా కల అని ఈమె తెలియజేశారు.
అది నా చిన్నప్పటి కోరిక…
ఇలా నా కోరిక మేరకు టీవీ రియాలిటీ షోలో పెళ్లి చేసుకోవటం అనేది సరైన నిర్ణయమే అని తెలిపారు. మా పెళ్లి ద్వారా మేము చాలా సంతోషంగా ఉన్నామని, అయితే డబ్బు కోసమే ఇలా టీవీ షోలో పెళ్లి చేసుకున్నాము అంటూ వస్తున్న విమర్శలను తాను పెద్దగా పట్టించుకోనని తెలియజేశారు. మా వివాహం కొద్దిమంది అతిథిల సమక్షంలో ఎంతో సాంప్రదాయబద్ధంగా చాలా సంతోషకర వాతావరణం లో జరిగిందంటూ వీరి పెళ్లిపై వస్తున్న విమర్శలను ఖండిస్తూ ఈ కొత్త జంట చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరి కొంతమంది ఈ దంపతులకు పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నారు. పెళ్లి పేరుతో సెలబ్రిటీలు కొన్ని వందల కోట్లు ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాకాకుండా రియాలిటీ షోలో సింపుల్ గా పెళ్లి చేసుకోవడంతో పలువురు ఈ జంటకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Ram Pothineni: మెగా ఫోన్ పట్టనున్న యంగ్ హీరో… స్క్రిప్ట్ కూడా సిద్ధం!