Nithya Menen: నిత్యామీనన్(Nithya Menen) తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. అలా మొదలైంది అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకొని తదుపరి తెలుగుతో పాటు తమిళ, మలయాళం సినిమాలలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. నిత్యా మీనన్ నటనకు గాను ఎన్నో అవార్డులో పురస్కారాలు రావడమే కాకుండా ఇటీవల ఈమె నటించిన తిరు సినిమాకు నేషనల్ అవార్డు కూడా లభించింది. ఇక ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న నిత్యామీనన్ త్వరలోనే “తలైవన్ తలైవి” (Thalaivan Thalaivii) అనే రొమాంటిక్ కామెడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
తలైవన్ తలైవి…
విజయ్ సేతుపతి(Vijay Sethupathi), నిత్యామీనన్ జంటగా నటిస్తున్న ఈ సినిమా జులై 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్యామీనన్ తన పెళ్లి(Marriage) గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీల పెళ్లిళ్ల గురించి తెలుసుకోవటానికి అభిమానులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే నిత్యామీనన్ పెళ్లి గురించి బ్రేకప్స్ గురించి గతంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
పెళ్లి గురించి ఆలోచన లేదు..
తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె పెళ్లి గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా నిత్యామీనన్ మాట్లాడుతూ నేను చిన్నతనంలో ఉన్నప్పుడు నా జీవిత భాగస్వామి గురించి ఎక్కువగా ఆలోచించేదాన్ని కానీ నాకు ఇప్పుడు అలాంటి ఆలోచనలు లేవని తెలిపారు. జీవితం అంటే పెళ్లి, పిల్లలు, కుటుంబం మాత్రమే కాదు మనకు నచ్చిన విధంగా మన జీవితాన్ని ఆస్వాదించడం అని తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా ఇతర వ్యక్తులలో ప్రేమను గుర్తించి పెళ్లి చేసుకోవడం అనేది సాధ్యం కానీ విషయమని ఈమె తెలియజేశారు.
రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు…
నా పెళ్లి విషయంలో నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను నాకు పెళ్లి జరిగితే మంచిది, జరగకపోతే మరీ మంచిది అంటూ ఈమె షాకింగ్ కామెంట్స్ చేశారు. రతన్ టాటా(Ratan Tata) లాంటి ఒక గొప్ప వ్యక్తి పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని ముగించారు ఆయనతో పోలిస్తే మనం ఎంత అంటూ ఈమె తన పెళ్లి గురించి మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే… పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమాని సత్య జ్యోతి ఫిలిమ్స్ నిర్మించగా విజయ్ సేతుపతి నిత్యామీనన్ జంటగా కనిపించబోతున్నారు ఈ సినిమాలో యోగి బాబు శరవనన్, వంటి తదితరులు నటించారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల చేసిన ప్రమోషనల్ అప్డేట్స్ సినిమాపై ఎంతో మంచి అంచనాలనే పెంచేసాయి.
Also Read: Samantha: దూకుడు పెంచిన సమంత.. ఆ లేడీ డైరెక్టర్ తో కొత్త సినిమా?