BigTV English

Samantha: దూకుడు పెంచిన సమంత.. ఆ లేడీ డైరెక్టర్ తో కొత్త సినిమా?

Samantha: దూకుడు పెంచిన సమంత.. ఆ లేడీ డైరెక్టర్ తో కొత్త సినిమా?

Samantha: సినీ నటి సమంత(Samantha) ప్రస్తుతం వరుస సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. కెరియర్ మొదట్లో హీరోయిన్ గా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న సమంత ఇటీవల కాలంలో నిర్మాతగా మారి సొంత నిర్మాణంలో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. సమంత ట్రాలాలా(Tralala) అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి ఇటీవల ఈ నిర్మాణ సంస్థలో శుభం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే సమంత తదుపరి సినిమా చేయటానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.


లేడీ ఓరియంటెడ్ చిత్రం..

ఈ సినిమాకు సమంత నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా ఇందులో ఒక చిన్న పాత్రలో కూడా కనిపించి సందడి చేశారు. అయితే ఈ సినిమాకు మంచి ఆదరణ వచ్చిన నేపథ్యంలో సమంత తన దూకుడు పెంచారని తెలుస్తుంది. త్వరలోనే తన నిర్మాణ సంస్థలు మరొక సినిమాని ప్రకటించబోతున్నారు అయితే ఈ సినిమాలో సమంత ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారని సమాచారం. ఈ సినిమా లేడీ ఓరియంటెడ్ సినిమాగా రాబోతుందని, ఈ సినిమాకు లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి(Nandini Reddy) దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు సమాచారం.


నందిని రెడ్డి డైరెక్షన్ లో సమంత..

ఇక ఈ చిత్రం న్యూ ఏజ్ సోషల్  డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇకపోతే నందిని రెడ్డి సమంతకు చాలా మంచి స్నేహితురాలు అనే విషయం తెలిసిందే. అయితే సమంత విడాకులు తీసుకోకముందు నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత నాగచైతన్య జంటగా సినిమా రాబోతుందని అప్పట్లో ప్రకటన వచ్చింది కానీ అప్పటికే సమంత నాగచైతన్య మధ్య విభేదాలు రావడం, విడాకులు తీసుకొని విడిపోవడంతో ఈ సినిమా కార్యరూపం దాల్చలేదు. ఇక తాజాగా సమంత తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టిన నేపథ్యంలో తన నిర్మాణ సంస్థలోనే నందిని రెడ్డి కొత్త సినిమాని  ప్రకటించబోతున్నారని తెలుస్తోంది.

ఖుషి చివరి సినిమా…

ఇక సమంత కెరియర్ విషయానికొస్తే ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా కొంత బ్రేక్ ఇచ్చిన సమంత తిరిగి వరుస సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తూ ఉన్నారు. ఇటీవల ఈమె సిటాడెల్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ వెబ్ సిరీస్ అనుకున్న స్థాయిలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఈమె నెట్ ఫ్లిక్స్ కోసం రక్త్ బ్రహ్మాండ్ అనే సిరీస్ లో నటిస్తున్నారు. ఇక వెండి తెరపై సమంత చివరిగా ఖుషీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా 2023వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినా, ఈ సినిమా అప్పట్లో పరవాలేదు అనిపించుకుంది కానీ ప్రేక్షకులు అంచనాలకు అనుగుణంగా సక్సెస్ అందుకోలేకపోయింది.

Also Read: Anjana Devi: హాస్పిటల్లోనే పవన్ తల్లి అంజనా దేవి.. అసలు విషయం చెప్పిన పవన్!

Related News

HBD Mahesh Babu: తెలుగులో ఆ ఘనత అందుకున్న ఏకైక హీరో!

Prabhas : సైలెంట్ గా పని కానిచ్చేసిన డార్లింగ్.. ‘ఫౌజీ ‘ కోసం పక్కా ప్లాన్..

Raksha Bandhan 2025: రాఖీ స్పెషల్.. టాలీవుడ్ లో సిస్టర్ సెంటిమెంట్ సినిమాలు..

Janhvi Kapoor: తడిచీరలో దేవర బ్యూటీ అందాల విందు.. పరమ్ సుందరి రెయిన్ సాంగ్ చూశారా ..?

Kaantha: దుల్కర్- భాగ్యశ్రీ కెమిస్ట్రీ చూశారా.. ఇదేదో బాగా వర్క్ అవుట్ అయ్యేలానే ఉందే

Couple Friendly : అమ్మ బాబోయ్ ఆ కిస్సులు ఏంటన్నా, సంతోష్ శోభన్ రూట్ మార్చాడు భయ్యా

Big Stories

×