Jyothi Krishna on HHVM: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దాదాపు రెండేళ్ల తర్వాత చేసిన చిత్రం హరిహర వీరమల్లు(Harihara Veeramalu). పీరియాడికల్ యాక్షన్ డ్రామా గా వచ్చిన ఈ సినిమా జూలై 24వ తేదీన విడుదల అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. శ్రీ మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం (AM Ratnam) భారీ బడ్జెట్లో నిర్మించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్గా నటించింది. ఇక అనసూయ, నాజర్ , సుబ్బరాజు, సత్యరాజ్, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇందులో ఎవరికివారు తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారని చెప్పవచ్చు.
క్రిష్ కథను మార్చలేదు – జ్యోతి కృష్ణ
ఇదిలా ఉండగా 2021 లోనే ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి (Krish jagarlamudi) దర్శకత్వంలో ఈ సినిమా మొదలయ్యింది. అయితే కొన్ని కారణాలవల్ల సినిమా నుండి ఆయన తప్పుకున్నారు. ఆ తర్వాతే జ్యోతి కృష్ణ(Jyothi Krishna) ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇకపోతే సినిమా విడుదలైన తర్వాత క్రిష్ డైరెక్షన్ చేసిన కథను జ్యోతి కృష్ణ పూర్తిగా మార్చేశారని, అసలు ఈ సినిమా కథ ఒక వర్గం ఆడియన్స్ ను ఏమాత్రం మెప్పించలేదని కామెంట్లు వస్తున్నాయి. దీనికి తోడు క్రిష్ జాగర్లమూడి ఎందుకు సినిమా నుండి సడన్గా తప్పుకున్నారు అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ విషయంపై జ్యోతి కృష్ణ స్పందించారు.
క్రిష్ కథను పార్ట్ 2 లో చూపించబోతున్నాం – జ్యోతి కృష్ణ
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జ్యోతి కృష్ణ మాట్లాడుతూ.. “డైరెక్టర్ క్రిష్ నా కోసం దాదాపు ఏడాది పాటు ఎదురుచూశారు. ఆయనకు అంగీకరించిన ప్రాజెక్టులు ఉండడంతోనే హరిహర వీరమల్లు ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. అయితే క్రిష్ అనుకున్న కోహినూరు కథ పార్ట్ 2 లో వస్తుంది. కోహినూర్ కోసం అసలేం జరిగింది అనేది అక్కడ చూపించబోతున్నాము. ఇక క్రిష్ కథను పూర్తిగా మార్చేశారు అంటూ వస్తున్న వార్తలలో వాస్తవం లేదు. ఆయన కథను పార్ట్ 2 లో చూపించబోతున్నాం ” అంటూ డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికైతే పార్ట్ 2 లో క్రిష్ కోహినూరు కథను చూడబోతున్నామని తెలిసి అభిమానులు మరింత ఎక్సైజ్మెంట్గా ఎదురుచూస్తున్నారు.
యుద్ధభూమి అనే టైటిల్ తో పార్ట్ 2..
ఇకపోతే ఔరంగజేబు దగ్గర ఉన్న కోహినూరు కోసం ఢిల్లీ వెళ్లిన వీరమల్లు .. అక్కడ వీరిద్దరి మధ్య టఫ్ ఫైట్ జరుగుతుంది. అక్కడితో సినిమా పూర్తవుతుంది. ఇక అక్కడి నుంచి కొనసాగింపుగా ‘యుద్ధభూమి’ అనే టైటిల్ తో ఇప్పుడు పార్ట్ 2 లో క్రిష్ దర్శకత్వం వహించిన కోహినూర్ భాగాన్ని పెట్టబోతున్నట్లు డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికైతే ఈ యుద్ధ భూమి టైటిల్ తో రాబోతున్న ఈ పార్ట్ 2 ఊహించని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని మేకర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ:Ilaiyaraaja: మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాకు సుప్రీంకోర్టు షాక్.. అసలేం జరిగిందంటే?