Wife And Husband Incident: ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. భర్తకు విషం పెట్టి చంపడానికి ప్రయత్నించింది భార్య.. అయిన చావకపోవడంతో రెండో సారి మళ్లీ పెట్టడంతో విజయవంతం అయ్యింది.
పెరుగన్నంలో విషం..
అయితే ఫిరోజాబాద్ తుండ్లాలో సునీల్, శశి దంపతులు నివాసముంటున్నారు. అయితే సునీల్ భార్య శశికి.. గత కొంతకాలంగా యాదవేంద్రతో పరిచయం ఏర్పడింది. దీంతో వాళ్ల పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ఆమె ప్రేమకి భర్త అడ్డుగా ఉన్నాడని గమనించి.. భర్త అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడు యాదవేంద్రతో కలిసి పక్క ప్లాన్ చేసింది. ప్రియుడు యాదవేంద్ర పాయిజన్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టి శశికి ఇచ్చాడు.
మొదటిసారి చావలేదని.. రెండోసారి కిచిడిలో విషం..
ప్రియుడు విషం తీసుకువచ్చి ఇవ్వడంతో.. శశి పెరుగన్నంలో విషంపెట్టి భర్తకు వడ్డించింది. అయితే విషం అన్నం తిన్న భర్తను ఏమి తెలియనట్టుగా ఆసుపత్రికి తీసుకెళ్లింది. దీని తర్వాత సునీల్ అనారోగ్యం కాస్త క్షీణించిన గత కొంత కాలం తర్వాత బతికి బయటపడ్డాడు. హమ్మయ్య.. నా ఆరోగ్యం బాగు పడిందని సునీల్ తల్లిదండ్రులు, సునీల్ అనుకున్నారు.
కొడుకు ఇంటికి వచ్చాడనీ సంబరపడేలోపే..
కానీ పాపం.. శశి తన భర్త ఇంటికి తిరిగి వచ్చిన మరుసటి రోజే.. మొదటి సారి చావలేదని, మళ్లీ ఈ సారి కిచిడిలో విషం పెట్టి చక్కగా.. అన్నం ప్రేమగా తినిపించినట్టు నటించింది. దీంతో తన భర్త చనిపోయాడు. ఈ ఘటనను సాధారణ మరణంగా క్రీయెట్ చేసి అంత్యక్రియలు జరిపించింది. కొడుకు చనిపోయిన తర్వాత సునీల్ తల్లిదండ్రులకు కోడలి ప్రవర్తనపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్వాప్తును వేంటనే ముమ్మరం చేశారు. ఇంట్లో విషం ప్యాకేట్ కనిపించటంతో శశిని పోలీసులు విచారించారు. శశి యాదవేంద్రతో చేసిన వాట్సప్ చాట్ ఆధారంగా వీరి భాగోతం బయటపడింది. పూర్తిగా శశి చేసినటువంటి.. ఇదొక సినిమా ప్లాన్‌గా తెలుస్తోంది.
Also Read: ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు రంగం సిద్ధం
శిక్షలు తప్పవు..
భార్యలు.. ఇలాంటి వాటికి ముందుకు వచ్చి భర్తలను ఎవరైతే అఘాయిత్యం చేస్తు్న్నారో.. అతి కిరతాకంగా ప్లాన్ చేసి.. మరి చంపుతున్న వారికి కచ్చితంగా కఠిన శిక్షలు తప్పవంటున్నారు పోలీసుశాఖ.