BigTV English
Advertisement

Ilaiyaraaja: మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాకు సుప్రీంకోర్టు షాక్.. అసలేం జరిగిందంటే?

Ilaiyaraaja: మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాకు సుప్రీంకోర్టు షాక్.. అసలేం జరిగిందంటే?

Ilaiyaraaja:మ్యూజిక్ మాస్ట్రో గా ఇండియన్ సినీ హిస్టరీలో ఇళయరాజా(Ilaiyaraaja)కు ఎంత మంచి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అయితే అలాంటి ఇళయరాజా ఈ మధ్యకాలంలో వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇళయరాజా మ్యూజిక్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఆయనకు కూసింత గర్వం కూడా ఉంటుంది అని ఇండస్ట్రీలోని ఓ వర్గం వాళ్లు అనుకుంటూ ఉంటారు. అయితే అలాంటి ఇళయరాజాకి తాజాగా సుప్రీంకోర్టులో పెద్ద షాక్ తగిలింది. మరి ఇంతకీ ఇళయరాజా కి సంబంధించిన కేసు ఏంటి.. ? ఎందుకు ఆయనకు సుప్రీం కోర్టులో షాక్ తగిలింది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


ఇళయరాజాకు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. కారణం ఇదే?

ఇళయరాజా 536 సంగీత రచనలకు సంబంధించి కాపీ రైట్ వివాదం ప్రస్తుతం సుప్రీం కోర్టు(Supreme Court) లో ఉన్న సంగతి తెలిసిందే.అయితే ఈ కాపీ రైట్ కేసుని బాంబే హైకోర్టు (Bombay High court) నుండి మద్రాస్ హైకోర్టు కి బదిలీ చేయమని మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ఈ మధ్యనే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ తాజాగా ఇళయరాజా చేసిన పిటిషన్ ని పరిశీలించిన జస్టిస్ కె.వినోద్ చంద్రన్ (Vinod Chandran), జస్టిస్ ఎన్. వి. అంజారియా (N.V. Anjaria) ధర్మాసనం ఆ పిటిషన్ ని కొట్టి పారేసింది..దీంతో ఇళయరాజాకు పెద్ద షాక్ తగిలింది.. అయితే ఇప్పటికే ఇళయరాజా కంపోజ్ చేసిన 536 రచనల్లో 310 రచనలకు సంబంధించిన కేసు మద్రాస్ లోని హైకోర్టులో సమాంతరంగా నడుస్తోంది. ఈ కారణం తోనే ఇళయరాజా బాంబే హైకోర్టు నుండి మద్రాస్ హైకోర్టు(Madras High court)కి బదిలీ చేయాలని పిటిషన్ వేయగా.. దాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా కొట్టి వేసింది.


అసలు వివాదం ఏమిటంటే?

ఇక ఇళయరాజా 536 రచనల వివాదం విషయానికి వస్తే… 2022లో సోనీ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్(Sony Music Entertainment) సంస్థ ఇళయరాజాకు సంబంధించిన ఇళయరాజా మ్యూజిక్ ఎన్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (Ilayaraja Music N Management Private Limited)కి సంబంధించిన 536 రచనలను ఉపయోగించకూడదని బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో 536 రచనలపై పూర్తి హక్కులతో పాటు,ఎకో రికార్డింగ్స్, ఓరియంటల్ రికార్డ్స్ పూర్తిగా తమ ఆధీనంలోనే ఉన్నాయంటూ సోనీ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ సంస్థ పిటిషన్ లో పేర్కొంది.. దీంతో ఈ వివాదం మొదలైంది. ఇక 2022లో మొదలైన ఈ వివాదం ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది. ఈ కేసు ప్రస్తుతం బొంబాయి హైకోర్టులోనే ఉండగా మద్రాస్ హైకోర్టుకి మార్చమని ఇళయరాజా పిటిషన్ వేసినా కూడా ఆ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టి పారేసింది.

ALSO READ:Film industry: సినిమా పైరసీపై కఠిన నిర్ణయం.. మూడేళ్ల జైలు శిక్షతోపాటు..?

Related News

Peddi: చికిరి హుక్ స్టెప్ బావుంది.. కాపీ కొట్టకుండా ఒరిజినల్ అయ్యి ఉంటే ఇంకా బావుండేది

Dies Irae Trailer : ‘డీయస్ ఈరే’ ట్రైలర్ వచ్చేసింది.. మిస్టరీ థ్రిల్లర్ సీన్ల తో థియేటర్లు దద్దరిల్లాల్సిందే..

Salman Khan: సల్మాన్ ఖాన్ కు లీగల్ నోటీసులు.. ఎప్పుడూ డబ్బేనా.. ప్రాణాలతో పనిలేదా?

NTR: ఎన్టీఆర్ లుక్స్.. భయపడుతున్న ఫ్యాన్స్.. నీల్ మావా నువ్వే కాపాడాలి

Chikiri Song Promo : మొత్తానికి ‘చిక్రి’ అంటే ఏంటో చెప్పేసిన బుచ్చిబాబు

Kiran Abbavaram : కె ర్యాంప్ మూవీకి లీగల్ చిక్కులు… దాన్ని కూడా వాడేస్తున్నారా?

Dharma Mahesh: పోలీసులను ఆశ్రయించిన ధర్మా మహేష్.. భార్య గౌతమీతో పాటు అతనిపై ఫిర్యాదు!

Bahubali: The Eternal War: బాహుబలి మరణం.. ముగింపు కాదు!

Big Stories

×