Krish Jagarlamudi: క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi)ఇటీవల పెద్ద ఎత్తున వినపడుతున్న పేరు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటించిన హరిహర వీరమల్లు(Hariharaa Veeramallu) సినిమా విడుదలకు సిద్ధమైనప్పటి నుంచి ఈయన పేరు పెద్ద ఎత్తున వార్తలలో వినపడుతుంది నిజానికి ఈ సినిమాకు దర్శకుడుగా క్రిష్ జాగర్లమూడి ఎంపికయ్యారు. ఈయన అద్భుతమైన కథను తీసుకువచ్చి పవన్ కళ్యాణ్ గారికి వివరించడంతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. అయితే ఈ సినిమా నుంచి అనూహ్యంగా క్రిష్ జాగర్లమూడి తప్పుకున్నారు. ఇలా ఈయన తప్పుకోవడంతో నిర్మాత ఎ.ఏం రత్నం కుమారుడే ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించారు.
ఉన్నఫలంగా తప్పుకున్న క్రిష్..
ఇలా క్రిష్ సినిమా నుంచి తప్పుకున్న తర్వాత జ్యోతి కృష్ణ(Jyothi Krishna) దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత క్రిష్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని జ్యోతి కృష్ణ ఈ సినిమాని సరైన విధంగా హ్యాండిల్ చేయలేకపోయారన్నది కొంతమంది అభిమానుల అభిప్రాయం. ఇకపోతే ఈ సినిమా ఇప్పటికీ మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇలా ఈ సినిమా విడుదలయ్యి మంచి టాక్ సొంతం చేసుకున్నప్పటికీ డైరెక్టర్ క్రిష్ మాత్రం ఈ సినిమా గురించి ఎక్కడా కూడా స్పందిస్తూ ఒక పోస్ట్ కూడా చేయలేదు.
చిత్ర బృందంతో విభేదాలు నిజమేనా?
ఈ సినిమా విడుదలకు రెండు రోజుల ముందు సినిమా గురించి పవన్ కళ్యాణ్ గురించి ఎంతో గొప్పగా తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేయడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు. కానీ, సినిమా విడుదలైన తర్వాత సినిమా బాగుందని జ్యోతి కృష్ణ పనితీరు గురించి కానీ ఎక్కడ ప్రస్తావించకపోవడంతో నిజంగానే క్రిష్, నిర్మాతల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయా? అందుకే ఈయన మౌనంగా ఉన్నారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఉన్నఫలంగా క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఎన్నో సందేహాలు వ్యక్తం అయ్యాయి.
వీరమల్లుపై స్పందించని క్రిష్…
ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నిర్మాత రత్నం గారు క్రిష్ తప్పుకోవడం గురించి మాట్లాడుతూ… ఈ సినిమా కరోనా కారణం వల్ల, పవన్ కళ్యాణ్ ఎన్నికల కారణంగా ఆలస్యం అవుతున్న నేపథ్యంలోనే క్రిష్ తనకు ఉన్నటువంటి కమిట్మెంట్స్ కారణంగా సినిమా నుంచి తప్పుకున్నారే తప్ప ఎలాంటి గొడవలు విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పటికీ ఈ సినిమా విడుదల గురించి సినిమా అందుకున్న సక్సెస్ గురించి క్రిష్ మాట్లాడకపోవడంతో నిజంగానే గొడవలు జరిగాయా? అంటూ మరోసారి సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకైతే క్రిష్ ఎక్కడ స్పందించలేదు తదుపరి ఈ సినిమా గురించి ఏదైనా పోస్ట్ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఘాటి(Ghaati) సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ఇప్పటికీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడటంతో సెప్టెంబర్ లో విడుదల కాబోతుందని సమాచారం.
Also Read: Paritala Nirupam: కొత్త ప్రయాణం మొదలు పెడుతున్న నిరుపమ్ దంపతులు…బ్లెస్సింగ్స్ కావాలంటూ!