Paritala Nirupam: పరిటాల నిరుపమ్(Paritala Nirupam) అంటే ఈయన గుర్తు రాకపోయినా కార్తీకదీపం(Karthika Deepam) డాక్టర్ బాబు లేదా కార్తీక్ అంటే అందరికీ టక్కున నిరుపమ్ పరిటాల గుర్తుకు వస్తారు. ఎన్నో సీరియల్స్ లో నటుడిగా నటించి ప్రేక్షకులను మెప్పించినప్పటికీ ఈయనకు మాత్రం కార్తీక దీపం సీరియల్ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చింది. ఈ సీరియల్ ద్వారా నిరుపమ్ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.. ప్రస్తుతం కార్తీకదీపం 2 ప్రసారమౌతూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటుంది.
బిజినెస్ రంగంలోకి నిరుపమ్ దంపతులు…
ఇకపోతే నిరుపమ్ పరిటాల సీరియల్స్ మాత్రమే కాకుండా సీరియల్స్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే త్వరలోనే వీరు మరొక కొత్త అధ్యాయం మొదలు పెట్టబోతున్నారని తెలుస్తోంది. తాజాగా నిరుపమ్ , మంజుల (Manjula)దంపతులు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. ఈ వీడియో ద్వారా తమ కొత్త ప్రయాణం మొదలవుతోందని మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి అంటూ వీరు ప్రారంభించబోతున్న బిజినెస్ గురించి తెలియజేశారు. నిరుపమ్ దంపతులు త్వరలోనే క్లాత్ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తోంది.
శ్రీవల్లి కలెక్షన్స్…
ఈ సందర్భంగా నిరుపమ్ మాట్లాడుతూ… ఇప్పటివరకు మీరు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు. అది కెరియర్ పరంగా, వ్యక్తిగతంగా మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మాపై ఉంటూ మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేశారని అయితే ఇకపై మేము ప్రారంభించబోయే బిజినెస్ లో కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలని తెలిపారు. ఇప్పటికే శ్రీ వల్లి కలెక్షన్స్(Sri Valli Collections) అందరికీ తెలిసిందే.. అయితే ప్రస్తుతం తాము శ్రీవల్లి కలెక్షన్స్ తో కొలాబరేట్ అవుతున్నామని, త్వరలోనే కొత్త స్టోర్ కూడా ప్రారంభించబోతున్నామని తెలియజేశారు. జులై 30వ తేదీ తమ కొత్త స్టోర్ ప్రారంభం కాబోతుందని తప్పకుండా మీ అందరి సపోర్ట్ మాకు ఉంటూ మా ఈ ప్రయత్నాన్ని సక్సెస్ చేయాలి అంటూ ఈ సందర్భంగా మంజుల నిరుపమ్ అభిమానులకు తెలియజేస్తూ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
?igsh=MWpqZzdpbmYycHBpdg%3D%3D
ఇక మంజుల నిరుపమ్ ఇద్దరూ చంద్రముఖి సీరియల్ లో కలిసి నటించారు. ఈ సీరియల్ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడటం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక వీరిద్దరూ పలు సీరియల్స్ చేస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తూ వీరికి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. ఇక త్వరలోనే క్లాత్ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఈ జంటకు అభినందనలు తెలియజేయడమే కాకుండా మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నారు.ఇప్పటివరకు సీరియల్స్ లో నటిస్తూ నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నిరుపమ్ బిజినెస్ లో కూడా అదే విధంగా సక్సెస్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Also Read: Bobby Deol: ఔరంగజేబు పాత్రకు బాబీ డియోల్ ఫస్ట్ ఛాయిస్ కాదా… ఎవరంటే?