Rajkumar Rao: బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ (Raj Kumar Rao)చట్టపరమైన చిక్కుల్లో ఉన్నారు. 2017లో విడుదలైన ‘బెహెన్ హోగీ తేరీ’ (Behen Hogi Teri)సినిమాకి సంబంధించిన ఒక చట్టపరమైన కేసులో భాగంగా రాజ్‌కుమార్ రావు జూలై 28, 2025న జలంధర్ కోర్టులో(Jalandhar court ) లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఇక ఈ వివాదంలో భాగంగా ఈయన జులై 30వ తేదీ విచారణకు హాజరు కావాల్సి ఉందని తెలిపారు. ఈ క్రమంలోనే నటుడు రాజ్ కుమార్ ఈ విచారణకు హాజరుకాని నేపథ్యంలో ఈయనపై కోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
బెహెన్ హోగీ తేరీ సినిమాలో శివుడి పాత్ర..
దాదాపు 8 సంవత్సరాల క్రితం ఈయనపై నమోదు అయిన కేసులో భాగంగా ఇప్పుడు కోర్టు ఇతనికి నాన్ బెయిలబల్ వారెంట్ జారీ చేయడంతో ఈ విషయం కాస్త బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనగా మారింది. మరి ఈయనపై నమోదు అయిన ఈ కేసు ఏంటి అనే విషయానికి వస్తే..బెహెన్ హోగీ తేరి సినిమా పోస్టర్‌లో రాజ్‌కుమార్ రావు శివుడి గెటప్(Lord Shiva Getup)లో కనిపించడం వల్ల ఈ వివాదం తలెత్తింది. ఇందులో భాగంగా శివుడు బైక్ పై చెప్పులు వేసుకుని వెళుతున్నటువంటి ఒక పోస్టర్ పై తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఇక ఈ విషయంపై స్థానిక శివసేన నాయకుడు డివిజన్ నంబర్ 5 పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తూ అభ్యంతరం తెలిపారు.
హిందూ మనోభావాలు దెబ్బతీసేలా..
ఈ సినిమాలో శివుడి పాత్ర చెప్పులు వేసుకున్నట్టు చూపించడంతో కచ్చితంగా ఈ సంఘటనలు హిందూ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయి అంటూ అభ్యంతరం తెలియచేశారు. ఇలా అప్పట్లో రాజ్ కుమార్ పై కేసు నమోదు అయింది కేవలం ఇతనిపై మాత్రమే కాకుండా చిత్ర దర్శకుడు నితిన్ కక్కర్, నిర్మాత అముల్ వికాస్ మోహ్లే, నటి శ్రుతి హాసన్‌లపై కేసు నమోదు చేశారు. ఇలా ఇతని పట్ల కేసు నమోదు కావడంతో రాజ్ కుమార్ కోర్టుకు హాజరు కావాలి అంటూ సమన్లు జారీ చేశారు. ఇలా కోర్టుకు హాజరు కానీ నేపథ్యంలోనే ఈయన పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఈయన అరెస్ట్ కు ముందు ముందస్తు బెయిల్ రావడంతో ఈ కేసు విషయంలో కోర్టు విచారణకు హాజరుకావాలని సూచించారు.
స్పందించని రాజ్ కుమార్ రావు..
ఇలా కోర్టు విచారణకు ప్రస్తుతం ఈయన హాజరుకాని నేపథ్యంలో ఇతని విషయంలో సంచలన తీర్పు ప్రకటించింది. ఇలా ఈ సినిమా విషయంలో కోర్టు ఈయన పట్ల సంచలన తీర్పు ప్రకటించినప్పటికీ ఈ విషయంపై రాజ్ కుమార్ ఇప్పటివరకు ఎక్కడ స్పందించలేదు. ఇక రాజ్ కుమార్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన పలు సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. భూల్ చూక్ మాఫ్, మాలిక్ వంటి సినిమాలు ద్వారా ఈ ఏడాది మొదట్లో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఈయన నెట్ ఫ్లిక్స్ కోసం టోస్టర్ అనే సినిమాలో నటిస్తున్నారు. మరి కోర్టు తీర్పు గురించి రాజ్ కమార్ స్పందన ఎలా ఉంటుందనేది తెలియాల్సి ఉంది.
Also Read: Saiyaara OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ సైయార…ఎప్పుడు? ఎక్కడంటే?