BigTV English

War 2 Trailer: హృతిక్ వర్సెస్ ఎన్టీఆర్.. ఇది కదరా అసలైన వార్ అంటే..

War 2 Trailer: హృతిక్ వర్సెస్ ఎన్టీఆర్.. ఇది కదరా అసలైన వార్ అంటే..

War 2 Trailer: ఎన్నాళ్లగానో ఎదురుచూసిన సమయం రానే వచ్చేసింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వార్ 2. YRF యూనివర్స్ నుంచి వస్తున్న స్పై యాక్షన్ డ్రామాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ వీడియోస్ సినిమాపై అంచనాలను ఆకాశానికి తాకేలా చేశాయి. ఆగస్టు 14 న వార్ 2 రిలీజ్ కు సిద్దమవుతుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచిన మేకర్స్ తాజాగా వార్ 2 ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.


 

హృతిక్, ఎన్టీఆర్ ఇద్దరూ.. తామెంటో  చెప్పుకుంటూ రావడంతో ట్రైలర్ మొదలయ్యింది. నేను ప్రమాణం చేస్తున్నాను.. నేను నా పేరును, ఒంటిని, గుర్తింపును, కుటుంబాన్ని అన్ని వదిలేసి ఒక నీడగా మారిపోతాను అనే హృతిక్ డైలాగ్ లో ఒక సైనికుడిగా ఎలా మారాడు.. ? దేశం కోసం ఏం చేశాడు.. ? అనేది చూపించారు. నేను మాటిస్తున్నాను.. ఎవ్వరూ చేయలేని పనులను నేను చేసి చూపిస్తాను. ఎవ్వరూ పోరాడలేని యుద్దాన్ని నేను పోరాడతాను’ అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ లో అతడు కూడా ఒక సైనికుడని చూపించారు. ముఖ్యంగా ఇద్దరూ చెప్పే డైలాగ్స్ ట్రైలర్ కే హైలైట్ గా మారాయి. మధ్యలో తారక్.. యుద్ధంలో ఒక ఆయుధాన్ని.. చస్తా.. లేదా చంపుతా అనే డైలాగ్ తో తన క్యారెక్టర్ ఏంటి అనేది చెప్పుకొచ్చేశాడు.


 

ఇక ఈ ఇద్దరు సైనికులు.. దేశం కోసం పోరాడే క్రమంలో ఒకరికి ఒకరు ఎలా బద్ద శత్రువులుగా మారారు. ఒకరిని ఒకరు ఎందుకు చంపుకోవడానికి ప్రయత్నించారు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. వార్ 2 మొత్తం ఎన్టీఆర్ వర్సెస్ హృతిక్  లానే కనిపిస్తుంది. హృతిక్ కి కియారా జోడి కాగా.. ఎన్టీఆర్ కు హీరోయిన్ లేదు అని తెలుస్తోంది. స్పై యూనివర్స్ లో హృతిక్ కింగ్ అయితే.. ఎన్టీఆర్ ఇప్పుడే అడుగుపెట్టినట్లు తెలిసిపోతుంది. వార్ లో ఉన్న టైగర్ ష్రాఫ్ ఫోటో కనిపించడంతో అతడు కూడా ఇందులో కనిపించనున్నట్లు హింట్ ఇచ్చేశారు.

ఇక యాక్షన్ సీక్వెన్స్, హృతిక్- ఎన్టీఆర్ మధ్య ఫైట్.. సినిమాకే హైలైట్ గా మారనున్నాయి. ఇద్దరూ సైనికులే.. ఆ ఇద్దరి మధ్యనే యుద్ధం. అయితే దేనికోసం ఆ యుద్ధం అనేదే కథగా చూపించిన విధానం ఆకట్టుకుంది. ట్రైలర్ తో సినిమాపై హైప్ ను ఇంకా పెంచేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ట్రైలర్ చూసిన అభిమానులు ఇది కదా అసలైన వార్ అంటే అని చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Related News

War 2 Pre Release Event : ఇప్పుడు అసలైన వార్… ఈ ఒక్క దాంతో కూలీని దాటేసింది

NTR: కాళ్ళ మీద పడ్డ అభిమాని.. ఎన్టీఆర్ ఏం చేసాడంటే

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

War 2 Pre release: అభిమానులపై కోప్పడిన తారక్.. ఇక్కడి నుంచి వెళ్లిపోనా అంటూ!

War 2 Pre release: నన్ను ఎవరూ ఆపలేరు.. పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చిన తారక్!

War 2 Pre release: తారక్ మీకు అన్న… నాకు తమ్ముడు.. స్పీచ్ అదరగొట్టిన హృతిక్!

Big Stories

×