Human bridge: దేశంలో గత కొన్నిరోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. అంతే కాకుండా.. లోతట్టు ప్రాంతాలన్ని కూడా జలమయం అయ్యాయి. భారీ వానలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. మరోవైపు వర్షాలతో జనాలు అసలు.. బైటకు వెళ్లాలంటేనే భయంతో వణికిపోతున్నారు.
విరిగిన రహదారి.. చిక్కుకుపోయిన విద్యార్థులు
కాగా తాజాగా పంజాబ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు.. మోగా జిల్లా లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఒక స్కూల్‌కు చెందిన విద్యార్థులు వర్షంలో చిక్కుకుపోయారు. వారిని స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా, మార్గ మధ్యలో రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తున్నా, అక్కడ వంతెన లేకపోవడం, రహదారి పాడైపోవడం వల్ల 35 మంది విద్యార్థులు ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
స్థానికులు గొప్ప మనసు
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో, ఇద్దరు స్థానిక యువకులు ముందుకు వచ్చారు. వారిద్దరు నదిలోకి దిగి మానవ వంతెనగా మారిపోయారు. ఒకరి భుజంపై, మరొకరి నడుము మీదుగా విద్యార్థులు వంతెన దాటినట్లుగా నడిపించడమే కాకుండా, వారి శరీరాన్నే ఓ సహజ వంతెనగా ఉపయోగించి.. విద్యార్థుల్ని వరద నీటిలోంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఇద్దరు యువకులు పొడవుగా నీటిలో నిలబడిన తీరు, విద్యార్థులు ఒక్కొక్కరిగా వారి శరీరాన్ని ఆధారంగా చేసుకుని.. దాటి వెళ్తున్న తీరు ఎంతో ఉద్వేగంగా, స్పృహాత్మకంగా కనిపిస్తుంది.
ప్రశంసల జల్లు
ఈ ఘటనను చూసిన ప్రతి ఒక్కరూ.. ఆ యువకుల ధైర్యాన్ని, మానవతా స్పూర్తిని పొగుడుతున్నారు. ఇదే అసలైన హీరోయిజం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పంజాబ్ సీఎం కార్యాలయం కూడా స్పందించి, ఆ ఇద్దరు స్థానికులను అభినందించింది. విద్యార్థుల కుటుంబాలు, పాఠశాల సిబ్బంది ఆ యువకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సంఘటన మనకు గొప్ప పాఠం
మనిషి జీవితానికి విలువ లేకుండా మారిపోతున్న ఈ రోజుల్లో.. ఈ సంఘటన మనకు గొప్ప పాఠం నేర్పుతుంది. మానవత్వం ఇంకా బతికే ఉంది. సమయం వచ్చినప్పుడు సమాజం కోసం నిలబడ్డ మనిషి విలువ.. అమూల్యమైనదనే విషయాన్ని మళ్లీ గుర్తుచేస్తుంది.
Also Read: ఇండియాలో ఆ నగరంలోనే అక్రమ సంబంధాలు ఎక్కువట, మన సైడే!
కాగా తమ గ్రామానికి రాకపోకలు సాగించేందుకు ఈ ఒక్క రహదారే ఉందని.. స్థానికులు చెబుతున్నారు. వర్షాల కారణంగా ఇప్పుడు అది కొట్టుకుపోవడంతో.. తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ప్రభుత్వం ఇకనైన స్పందించి తమకు సహాయం చేయాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
మనుషులే వంతెనగా మారి.. 35 మంది విద్యార్థులను రక్షించిన స్థానికులు..
భారీ వర్షాలకు పంజాబ్ లోని మోగా జిల్లాలో కొట్టుకుపోయిన రోడ్డు
రోడ్డు దాటేందుకు వీలు లేక చిక్కుకుపోయిన విద్యార్థులు
దీంతో నీటి ప్రవాహానికి అడ్డుగా వంతెనలా మారి చిన్నారులను కాపాడిన ఇద్దరు స్థానికులు
సోషల్… pic.twitter.com/F1YQpW7tCM
— BIG TV Breaking News (@bigtvtelugu) July 25, 2025