Kaaka Movie:మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా, ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby kolli) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ డ్రామా మూవీ కాకా (Kaaka).. ఒకవైపు సినిమా షూటింగ్ వేగంగా జరుపుకుంటుండగా.. మరొకవైపు ఈ సినిమా విడుదల తేదీ పై రోజుకో వార్త సంచలనం సృష్టించిన విషయం తెలిసింద ముఖ్యంగా గత రెండేళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర (Vishwambhara ) సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తారని ,అందుకే కాకా మూవీని శివరాత్రి సందర్భంగా విడుదల చేసే అవకాశాలున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయిన విషయం కూడా తెలిసిందే. అయితే ఈ వార్తలన్నింటికీ చెక్ పెడుతూ చిత్ర బృందం నవంబర్ 28న అధికారికంగా ప్రకటించగా.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ‘కాకా’ విడుదల తేదీపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. “ఆటో జానీ గుర్తున్నాడా? ఈ సంక్రాంతికి సరికొత్తగా కాకా మూవీ ద్వారా మీ ముందుకు వస్తున్నాడు” అంటూ అధికారికంగా పోస్టు పంచుకున్నారు. “జనవరి 13 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మీ అందరిని కలుస్తాం.. సంక్రాంతికి ఆటో జానీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడు” అంటూ చిరంజీవి షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మొత్తానికి అయితే గత కొంతకాలంగా ఈ సినిమా వాయిదా పడొచ్చు అంటూ వస్తున్న వార్తలకు చిరంజీవి అధికారికంగా చెక్ పెట్టారు.
మరొకవైపు చిత్ర బృందం కూడా ఈ రూమర్స్ కి చెక్ పెడుతూ ఒక కొత్త ఆన్ లొకేషన్ పోస్టర్ ను విడుదల చేసింది. ఇందులో దర్శకుడు బాబి కొల్లి, రచయిత కోన వెంకట్ తో కలిసి చిరంజీవి ఏదో ఒక విషయాన్ని నిషితంగా గమనిస్తున్నట్లు కనిపించారు. దీంతో పాటు సినిమా నుంచి మొదటి పాటను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు ప్రకటించి అభిమానులలో ఉత్సాహాన్ని నింపారు. మొత్తానికైతే ఇన్ని రోజులు వాయిదా పడబోతోంది అంటూ వస్తున్న వార్తలకు ఊహించని సమాధానమిచ్చి రూమర్స్ కి చెక్ పెట్టారు. ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకే వాల్తేరు వీరయ్య వచ్చి భారీ బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట కే నారాయణ నిర్మిస్తుండగా.. సంగీతాన్ని ఎస్ . తమన్ అందిస్తున్నారు.. ఇక ఇప్పుడు తాజా ప్రకటనతో సంక్రాంతి బరిలో మెగాస్టార్ సినిమా కూడా ఉండడంతో హిట్ గ్యారెంటీ అంటూ అభిమానులు అప్పుడే కామెంట్లు చేస్తున్నారు.
also read: 12 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో..
ఇదిలా ఉండగా మరొకవైపు విశ్వంభర ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనే అనుమానాలు మళ్లీ వ్యక్తమవుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. గతంలో ప్రభాస్ ఫౌజీ కోసం ఖరారు చేసిన మార్చి 19 2027 విడుదల తేదీ పై విశ్వంభర కన్నేసినట్లు తెలుస్తోంది. మరోవైపు మహేష్ బాబు, ఎస్.ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న వారణాసి సినిమా ఏప్రిల్ 7వ తేదీకి ఫౌజీని మార్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఏది నిజమో తెలియదు కానీ సినిమా విడుదల తేదీలపై కొత్త చర్చలు వ్యక్తం అవుతున్నాయి.
ఆటో జానీ గుర్తున్నాడా? 😉
ఈ సంక్రాంతికి సరికొత్తగా #KAAKA లో మీ ముందుకు వస్తున్నాడు!Looking forward to entertaining you all this Sankranthi with a whole new side of ‘Auto Johnny’.@dirbobby and the entire team are putting their heart and soul into making #KAAKA a memorable… pic.twitter.com/oKQuNX7dXW
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 29, 2026