E-Paper
Advertisement

వందే భారత్ రైలులో షాకింగ్ ఘటన.. వడలో బోల్ట్ ఏంటి భయ్యా?

వందే భారత్ రైలులో షాకింగ్ ఘటన.. వడలో బోల్ట్ ఏంటి భయ్యా?
Advertisement

Vande Bharat Food Controversy: వందే భారత్ రైళ్లలో ప్రయాణికులకు అందించే ఫుడ్ క్వాలిటీపై మరోసారి తీవ్ర చర్చ మొదలయ్యింది. రైలులో వడ్డించిన వడలో ఏకంగా ఒక పెద్ద బోల్టు కనిపించడం కలకలం రేపింది. భోజనం చేస్తుండగా ఈ విషయాన్ని గుర్తించిన ప్రయాణికుడు ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రయాణికుడికి క్షమాపణలు చెప్పడంతో పాటు, సర్వీస్ ప్రొవైడర్‌పై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.

వడలో బోల్టు చూసి షాకైన ప్రయాణికుడు

ఈ ఘటన బెంగళూరు నుంచి బెళగావికి వెళ్లే వందే భారత్ రైలులో జరిగింది. సమర్థ్ కోడియాల్ అనే ప్రయాణికుడు రైలులో ప్రయాణిస్తున్న సమయంలో తనకు అందించిన భోజనంలో వడను తింటుండగా అందులో పెద్ద బోల్టు కనిపించింది. దీంతో ఆయన ఒక్కసారిగా షాకయ్యాడు. సాధారణంగా రైళ్లలో ప్రయాణించే వారికి ఫుడ్ అందించే ముందు క్వాలిటీని చెక్ చేయాల్సి ఉంటుంది. అలాంటిది తినే ఆహారంలోనే ఇలాంటి వస్తువు కనిపించడంతో ప్రయాణికుడు ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వే శాఖ, ఐఆర్‌సిటిసి అధికారులు ఈ విషయంపై వెంటనే స్పందించాలని కోరారు.

సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియో షేర్

Advertisement

తనకు ఎదురైన ఎక్స్ పీరియెన్స్ ను సమర్థ్ కోడియాల్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. వడలో బోల్టు కనిపించిన ఫొటోలతో పాటు వీడియోను కూడా పోస్టు చేశారు. అందులో ప్లేటులో సగం తిన్న వడ, దాని పక్కనే ఉన్న పెద్ద బోల్టు కూడా కనిపిస్తున్నాయి. ఈ పోస్టు సోషల్ మీడియాలో క్షణాల్లోనే వైరల్ అయ్యింది. ప్రీమియం రైలు అయిన వందే భారత్‌లో ఇలాంటి ఘటన జరగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఐఆర్‌సిటిసి సీరియస్ యాక్షన్   

ప్రయాణికుడి కంప్లైంట్ పై ఐఆర్‌సిటిసి వెంటనే స్పందించింది. ఈ ఘటన వల్ల అతడికి కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసింది. అంతేకాకుండా, ఘటనను తీవ్రంగా పరిగణించి సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌పై కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. కిచెన్ సిబ్బంది ఫుడ్ తయారీ సమయంలో తగిన ప్రమాణాలు పాటించాలని ఆదేశించినట్లు వెల్లడించింది. అంతేకాదు, కిచెన్ లో ఎప్పటికప్పుడు చెకింగ్స్ చేసి, ఫుడ్ తయారీకి ఉపయోగించే పాత్రలను క్లియర్ గా  పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు తెలిపింది.

రైళ్లలో ఫుడ క్వాలిటీపై మళ్లీ చర్చ

Advertisement

రైలు ప్రయాణాల్లో అందించే ఫుడ్ కు సంబంధించి ప్రయాణికులు అప్పుడప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వందే భారత్ రైలులో జరిగిన తాజా ఘటన మరోసారి ఫుడ్ క్వాలిటీపై చర్చకు కారణం అయ్యింది. ప్రయాణికులకు అందించే ఫుడ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు.

Read Also: ఢిల్లీ To ముంబై జర్నీ ఇక 6 గంటలే.. 5 రాష్ట్రాలను కలపనున్న బుల్లెట్ రైలు రూట్ ఇదే!

Tags

Related News

బ్రహ్మంగారి గుట్టకు బ్రహ్మాండమైన ఘాట్ రోడ్.. నల్లగొండలో సరికొత్త టూరిజం డెస్టినేషన్!

లోకల్ రైల్లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్.. వీడియో వైరల్, రైల్వేశాఖ రియాక్షన్ ఇదే!

సంక్రాంతికి ఊరెళ్తున్నారా? చర్లపల్లి – శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైళ్లు ఇవే!

క్యూబ్ ఆకారంలో మల విసర్జన.. ప్రపంచంలో ఈ ఒక్క జంతువుకే సాధ్యం!

అండమాన్ కాలాపాని జైలును తలపించే మరో జైలు.. తెలంగాణలో ఎక్కడుందో తెలుసా?

ఢిల్లీ To ముంబై జర్నీ ఇక 6 గంటలే.. 5 రాష్ట్రాలను కలపనున్న బుల్లెట్ రైలు రూట్ ఇదే!

మందు కొడితే ఇంత మంచిగా మారిపోతారా? బ్యాంకాక్ వీధుల్లో విదేశీయుడి వింత ప్రవర్తన!

Big Stories

Advertisement
×