E-Paper
Advertisement

12 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో..

12 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో..
Advertisement

Hero Abbas:  ‘ప్రేమ దేశం’ చిత్రంతో యువత ఫేవరెట్ హీరోగా మారిపోయిన అబ్బాస్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా ఆ సమయంలో అబ్బాస్ హెయిర్ కట్ అంటూ ఆయన హెయిర్ కట్ ను కూడా చేయించుకొని తెగ ట్రెండ్ అయ్యారు. అంతేకాదు అప్పట్లో కాలేజీల్లో అబ్బాస్ హెయిర్ కట్ కి ఎంత డిమాండ్ ఉండేదో కూడా.. అలాంటి ఈయన దాదాపు కొన్ని సంవత్సరాల పాటు వరుస సినిమాలలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.. ఒకానొక సమయంలో వరుస ఫ్లాప్ లతో అవకాశాలు తగ్గిపోవడంతో.. నిర్మాతలను అవకాశాల కోసం అడుక్కున్న రోజులు కూడా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

12 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న అబ్బాస్..

అలా దాదాపు 12 ఏళ్ల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరమైన అబ్బాస్.. జీవి ప్రకాష్ కుమార్ ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘హ్యాపీ రాజ్’ అనే తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ ద్వారా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చారు. మరియా రాజా ఎలాంచేజియన్ దర్శకత్వంలో బియాండ్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చి అందరిని సర్ప్రైజ్ చేశారు. అలాంటి ఈయన ఇప్పుడు తెలుగులో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు.

జనవరి 12న విడుదల మూవీతో తెలుగులో రీ ఎంట్రీ..

Advertisement

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జనవరి 12న విడుదల’ అనే చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. విక్టరీ వెంకటేష్ , కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో.. కృతి శెట్టి, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంతో అబ్బాస్ తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే 2014లో ఈయన చివరిగా తెలుగులో నటించారు. ఇక చాలాకాలం గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇలా తెలుగులో రీఎంట్రీ ఇస్తుండడంతో తెలుగు ఆడియన్స్ కూడా ఈయనను తెరపై చూడడానికి తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరో రెండు చిత్రాలలో అవకాశం..

ఇకపోతే అబ్బాస్ జనవరి 12న విడుదల చిత్రంతో పాటు విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న రౌడీ జనార్ధన చిత్రంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంతోపాటు నీరో అనే మరో చిత్రంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా చాలాకాలం గ్యాప్ తర్వాత ఇప్పుడు వరుస పెట్టి సినిమాలలో నటిస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ ను చాలా సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే రీఎంట్రీలో మరిన్ని అవకాశాలు అందుకొని మళ్లీ బిజీగా మారిపోవాలని అభిమానులు సినీ ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

Advertisement

also read; బిగ్ బాస్ నుండి టెంపర్ వంశీ ఎలిమినేటెడ్!

అబ్బాస్ కెరియర్..

19 ఏళ్ల వయసులోనే డబ్బు సంపాదనకు సినిమాను ఒక ఆదాయ మార్గంగా ఎంచుకున్న అబ్బాస్.. కెరియర్ ప్రారంభంలో విజయాలు అందుకున్నప్పటికీ.. ఆ తర్వాత ఎక్కువగా ఫ్లాప్స్ చూశారు. ఒకానొక సమయంలో అవకాశాలు లేక నిర్మాతలను కూడా అడుక్కున్నారట. ఇక కొన్నాళ్లకు ఆ పనిని పూర్తిగా ఆస్వాదించలేక సినిమాలకు దూరం అయ్యానని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. జీవిత అనుభవం మేరకు సోషల్ మీడియా వేదికగా అభిమానులను మోటివేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Related News

ఆటో జానీగా ‘కాకా’.. అఫీషియల్ రిలీజ్ డేట్ ప్రకటించిన చిరంజీవి!

నాని మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నాడా.. ?

గ్లామర్ డోస్ పెంచేసిన శివానీ నాగరం..ఫొటోషూట్‌లో అదరగొట్టేసిందిగా!

జీవా, శ్రీహరి స్నేహం వెనుక ఇంత కథ ఉందా? బాలచందర్ ఎమోషనల్ కామెంట్స్!

బాలయ్య ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ‘దాదా’ రిలీజ్ డేట్‌పై ఫుల్ క్లారిటీ!

తొడలు కొట్టడం, ఛాలెంజ్‌లు చేయడం.. ఈవెంట్లకు వెళ్లాలంటేనే భయమేస్తోంది.. బోయపాటి శ్రీను!

థియేటర్‌కు వెళ్లాక సీన్లు తీసేస్తే మా పరువు పోయినట్టే.. సీనియర్ ఎడిటర్ వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×