E-Paper
Advertisement

ఉదయాన్నే కొబ్బరి నీళ్లలో ఈ 6 సూపర్ ఫుడ్స్ కలిపి తాగితే.. రోజంతా ఫుల్ ఎనర్జీ, డబుల్ హైడ్రేషన్!

ఉదయాన్నే కొబ్బరి నీళ్లలో ఈ 6 సూపర్ ఫుడ్స్ కలిపి తాగితే.. రోజంతా ఫుల్ ఎనర్జీ, డబుల్ హైడ్రేషన్!
Advertisement

Morning Healthy Drinks: ఉదయం నిద్రలేవగానే చాలామంది టీ, కాఫీల కోసం చూస్తుంటారు. కానీ వాటికి బదులుగా ఒక గ్లాసు కొబ్బరి నీళ్లు తాగితే శరీరానికి అందే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన డ్రింక్ కొబ్బరి నీళ్లు. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్స్ మన శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతాయి. అయితే, ఒట్టి కొబ్బరి నీళ్లే కాకుండా.. వాటిలో మరికొన్ని సహజమైన పదార్థాలను కలుపుకుని తాగితే దాని శక్తి రెట్టింపు అవుతుంది. విటమిన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా అందడంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మరి ఉదయాన్నే కొబ్బరి నీళ్లలో కలుపుకుని తాగదగ్గ ఆ 6 సూపర్ ఫుడ్స్ ఏంటో చూద్దామా..

నిమ్మరసం:

కొబ్బరి నీళ్లలో కొద్దిగా నిమ్మరసం పిండుకుని తాగితే రుచితో పాటు పోషకాలు కూడా పెరుగుతాయి. నిమ్మలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి, చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. కొబ్బరి నీళ్ల సహజ తీపికి నిమ్మ పులుపు తోడైతే ఉదయాన్నే ఎంతో రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది.

సబ్జా గింజలు:

Advertisement

చూడటానికి చియా సీడ్స్ లాగే కనిపించే సబ్జా గింజలను నీటిలో నానబెడితే జెల్ లాగా ఉబ్బుతాయి. వీటిని కొబ్బరి నీళ్లలో కలుపుకుని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా శరీరం చల్లబడుతుంది. ఎండాకాలంలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి ఇది బెస్ట్ ఆప్షన్.

చియా సీడ్స్:

చియా గింజల్లో ఫైబర్, ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నీళ్లలో నానబెట్టిన చియా గింజలను తాగడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నీరసం రాకుండా స్థిరమైన ఎనర్జీ లభిస్తుంది.

Advertisement

Also Read: చలికాలంలో ఇమ్యూనిటీని పెంచే సూపర్ డ్రింక్.. ఇంట్లోనే రుచికరమైన మునక్కాయ సూప్ ఇలా చేసుకోండి!

పుదీనా ఆకులు:

కొబ్బరి నీళ్లలో తాజా పుదీనా ఆకులను వేసుకుని తాగితే మంచి సువాసనతో పాటు కడుపుకు ఎంతో హాయిగా ఉంటుంది. పుదీనా జీర్ణవ్యవస్థను శాంతపరిచి, గ్యాస్ లేదా కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. వేసవిలో శరీరానికి మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది.

అల్లం రసం:

కొబ్బరి నీళ్లకు కొంచెం ఘాటు తగలాలంటే కాస్త తురిమిన అల్లం లేదా అల్లం రసం కలుపుకోవచ్చు. ఇది జీర్ణ ఎంజైమ్‌లను చురుగ్గా మార్చి గట్ హెల్త్‌ను మెరుగుపరుస్తుంది. శరీరంలోని వాపులను తగ్గించడానికి కూడా ఉదయాన్నే ఈ డ్రింక్ ఎంతో మేలు చేస్తుంది.

ఉసిరి పొడి:

ఉసిరికాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు దండిగా ఉంటాయి. కొబ్బరి నీళ్లలో చిటికెడు ఉసిరి పొడి కలుపుకుని తాగితే రోగనిరోధక శక్తి బలపడుతుంది. కొద్దిగా వగరు, పులుపు రుచితో కూడిన ఈ డ్రింక్ జీర్ణక్రియను సాఫీగా ఉంచుతుంది.

Also Read: కంటి పరీక్షల్లో అంతా నార్మల్.. కానీ చీకటి పడితే చూపు మందగిస్తోందా? కొత్త జన్యు వ్యాధిని గుర్తించిన శాస్త్రవేత్తలు!

Tags

Related News

రెస్టారెంట్ స్టైల్ చికెన్ సూప్..ఇలా చేయండి!

బచ్చలికూర టమాటో కర్రీ..వేడివేడి అన్నంలోకి అదిరిపోయే రెసిపీ!

గుత్తి బెండకాయ వేపుడు..జిగురు లేకుండా క్రిస్పీగా ఇలా చేయండి!

రెస్టారెంట్ స్టైల్ మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్..నిమిషాల్లో రెడీ!

జలుబు,ఫీవర్ టైమ్‌లో నోటికి రుచిగా..ఘాటైన రొయ్య పొట్టు చారు ఇలా ట్రై చేయండి!

రోటీ,బిర్యానీలోకి అదిరిపోయే కాంబినేషన్..రాయల్ మొగలాయ్ ఎగ్ కర్రీ సీక్రెట్ రెసిపీ!

ఒక్కసారి పెడితే ఏడాదంతా నిల్వ..సగ్గుబియ్యం వడియాలు ఇలా చేస్తే సూపర్ టేస్ట్!

Big Stories

Advertisement
×