Om Shanti Shanti Shantihi: ఈ మధ్యకాలంలో ప్రేక్షకుడిని థియేటర్ కి రప్పించడానికి నిర్మాతలు ఏ రేంజ్ లో తిప్పలు పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి కంటెంట్ బాగుంటే ఆడియన్స్ ఆటోమేటిక్ గా సినిమా థియేటర్ కి వస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ కలెక్షన్స్ మరింత పెంచుకోవడానికి ఇప్పుడు ఆఫర్లు కూడా ప్రకటిస్తూ అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ ప్రేక్షకుడిని థియేటర్ కి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.. ఇకపోతే మరి కొంతమంది తమకు డబ్బు పెద్దగా అవసరం లేకపోయినా పర్వాలేదు కానీ తమ సినిమాను ప్రతి ఒక్కరు చూడాలనే కోరికతోనే ప్రత్యేకించి కొన్ని వర్గాల ఆడియన్స్ కి ప్రత్యేకమైన ఆఫర్లను కూడా ప్రకటిస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే తాజాగా తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా వచ్చిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. రేపు అనగా 30 జనవరి 2026న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో చిత్ర బృందం వినూత్న ఆఫర్ ప్రకటించింది. ముఖ్యంగా ఈ సినిమాకు జంటగా వచ్చే వారికి వన్ ప్లస్ వన్ ఆఫర్ కింద ఒక టికెట్ కంటే మరో టికెట్ ఉచితంగా లభిస్తుంది అని ప్రకటిస్తూ ఈ మేరకు పోస్ట్ పంచుకుంది. ఇప్పటికే సింగిల్ స్క్రీన్ లలో కేవలం రూ.99, మల్టీప్లెక్స్ లలో రూ.150గా టికెట్ ధరలు నిర్ణయించి వార్తల్లో నిలిచిన మేకర్స్.. ఇప్పుడు ఈ ఆఫర్ తో మరింత మంది ఆడియన్స్ ను ఆశ్చర్యపరుస్తున్నారు. ఇకపోతే ఈ ఆఫర్ 29 జనవరి నిర్వహించనున్న పెయిడ్ ప్రీమియర్స్ తోనే అందుబాటులో ఉంది. ఇకపోతే ప్రత్యేకించి అనంతపురం, అమలాపురం, అగనంపూడి, మచిలీపట్నంలలో ఎంపిక చేసిన థియేటర్లలో మాత్రమే ఈ ప్రీమియర్లు ప్రదర్శించబడుతున్నాయి.
ఇక ఈరోజు నుంచి అలాగే రేపు ఏ థియేటర్లలో విడుదలైనా సరే ఆ థియేటర్లలో ఈ వన్ ప్లస్ వన్ ఆఫర్ లభిస్తుంది అని చిత్ర బృందం ప్రకటించి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. మొత్తానికైతే మధ్య తరగతి కుటుంబాల కోసమే ఈ తక్కువ ధరలు , ఆఫర్లు నిర్ణయించామని.. ముఖ్యంగా తమ సినిమా ప్రతి ఒక్కరికి చేరాలనే కోరికతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం చిత్ర నిర్మాతలు తీసుకున్న నిర్ణయానికి ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘ జయ జయ జయ జయహే’ చిత్రానికి రీమేక్ గా వస్తోంది. ఈ సినిమాని ఏ.ఆర్. సజీవ్ దర్శకత్వం వహిస్తుండగా.. సృజన్ యారబోలు నిర్మించారు. భార్యపై ఆధిపత్యం ప్రదర్శించే భర్తకు.. భార్య ఎలా బుద్ధి చెప్పింది? అనే కామెడీ ఎమోషనల్ డ్రామా తో ఈ సినిమా రూపొందుతోంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి.
also read:Vijay Thalapathy: ఆగిన జననాయగన్.. స్పందించిన విజయ్ తండ్రి!
మరోవైపు ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే ఈ సినిమాలో జంటగా నటిస్తున్న తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా మధ్య ఎఫైర్ సాగుతోంది అంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే .అటు దీనిపై స్పందించిన ఈషా రెబ్బ తరుణ్ భాస్కర్ తో పెళ్లి అనే వార్తలను ఖండించింది.అయితే తన డేటింగ్ లో ఉన్నట్టు చెప్పుకొచ్చింది. మరోవైపు తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాను. ఆ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా అనౌన్స్ చేస్తానని తెలిపారు.మొత్తానికైతే ఇద్దరూ తమ పై వస్తున్న డేటింగ్ రూమర్స్ కి చెక్ పెట్టే ప్రయత్నం మాత్రం చేయలేదు.