E-Paper
Advertisement

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో గోల్డెన్ ఆఫర్!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో గోల్డెన్ ఆఫర్!
Advertisement

Rukmini Vasanth:ప్రముఖ హీరోయిన్ రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అవకాశం లభించాలే కానీ పాత్రలో లీనమైపోవడానికి ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. అలాంటి ఈమె ఎప్పటికప్పుడు తన నటనలో మార్పులు చేసుకుంటూ.. నేడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. వరుస పెట్టి పాన్ ఇండియా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే ఒకవైపు వరుస చిత్రాలలో నటిస్తూనే.. మరొకవైపు క్రేజీ ఆఫర్లను సొంతం చేసుకుంటోంది.

మెగా హీరోతో క్రేజీ ఛాన్స్..

ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తూ బిజీగా మారిన ఈమె మరో మెగా ప్రాజెక్టుకు సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. రామ్ చరణ్ (Ram Charan), బుచ్చిబాబు సనా(Bucchibabu Sana) దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా చేసి మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం సుకుమార్(Sukumar) దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉండగా.. పెద్ది సినిమా షూటింగ్ సమయంలో తన చేతి మణికట్టు వద్ద జరిగిన గాయం కారణంగా ఇటీవల సర్జరీ చేయించుకొని.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలోనే సుకుమార్ సినిమా షూటింగ్ సెట్లో పాల్గొనబోతున్నారు. అయితే ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా ఎంపికైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్..

Advertisement

ఇప్పటికే సినిమా స్టోరీ ఆమెకు వినిపించగా.. కథకు ఇంప్రెస్ అయిన రుక్మిణి వసంత్ హీరోయిన్ గా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. రామ్ చరణ్ సరసన హీరోయిన్గా రుక్మిణి వసంత్ కు స్క్రీన్ టెస్ట్ కూడా చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేయనున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఒకవేళ ఇదే నిజమైతే టాలీవుడ్లో మరో బ్లాక్ బాస్టర్ హిట్ ఈమె ఖాతాలో చేరడం ఖాయమని తెలుస్తోంది.

ALSO READ: ప్రదీప్ రావత్ మృతిపై విస్తుపోయే నిజాలు బయటపెట్టిన కొడుకు!

బడా ప్రాజెక్టులతో దూసుకుపోతున్న రుక్మిణీ వసంత్..

Advertisement

కాంతార చాప్టర్ 1 సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణీ వసంత్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న డ్రాగన్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అంతేకాదు ప్రముఖ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) హీరోగా నటిస్తున్న టాక్సిక్ సినిమాలో కూడా రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. అలా ఒకవైపు వరుస చిత్రాలతో దూసుకుపోతున్న ఈమె ఇప్పుడు మరో స్టార్ హీరో మూవీలో అవకాశం అందుకున్నట్టు వార్తలు రావడం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

విభిన్న గెటప్స్ లో శర్వానంద్.. ‘జార్జ్ క్రిష్’ నుండి ఫస్ట్ బూస్టర్ రిలీజ్!

ది ప్యారడైజ్ దెబ్బ.. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ లో ఇప్పుడైనా మార్పు వస్తుందా?

మా ఇంటి వాచ్‌మెన్ ఫోన్‌లో నా ఇంటిమేట్ సీన్స్.. నరకం చూశా – రాధిక ఆప్టే

డింపుల్ హయతి నెలకు అంత సంపాదిస్తుందా..? సినిమాల కన్నా ఎక్కువే..

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత..

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

నాని కెరీర్‌లోనే బిగ్ రిలీజ్.. ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ లెక్కలు ఇవే!

అబ్బబ్బా.. ఖుషీ కపూర్ ఏంటి ఈ లుక్! ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్

Big Stories

Advertisement
×