E-Paper
Advertisement

51 షోలు ఓపెన్.. 48 హౌస్‌ఫుల్..దుమ్మురేపుతున్న కొరియన్ కనకరాజు !

51 షోలు ఓపెన్.. 48 హౌస్‌ఫుల్..దుమ్మురేపుతున్న కొరియన్ కనకరాజు !
Advertisement

Korean KanakaRaju:ఒకటి కాదు రెండు కాదు… ఆపరేషన్ వాలెంటైన్, గాండీవ దారి అర్జున, మట్కా అంటూ వరుసగా ముచ్చటగా మూడు అట్టర్ ఫ్లాపులు.దీంతో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలంటూ మేర్లపాక గాంధీతో జతకట్టాడు వరుణ్ తేజ్.

రిలీజ్‌కు ముందే ప్రీమియర్స్‌కు క్యూ

తాజాగా ఈ సినిమా ఆగస్టు 7న అంటే రేపే రిలీజ్ అవుతుండగా, ఆగస్టు 6న అంటే ఈ రోజే ప్రీమియర్స్ ప్లాన్ చేసింది మూవీ టీం. అయితే ఊహించని విధంగా ఈ సినిమా ప్రీమియర్స్‌కి జనాలు క్యూ కట్టడం ఇక్కడ విశేషం.అవును… రిలీజ్‌కి ముందు ఈ సినిమాపై మోస్తరు అంచనాలు ఉండగా, ఊహించని విధంగా ఈ సినిమాకి సాలిడ్ రెస్పాన్స్ వస్తుందని టికెట్ బుకింగ్స్‌లో క్లియర్‌గా కనిపిస్తోంది.

హైదరాబాద్‌లో హౌస్‌ఫుల్ షోల హవా

Advertisement

ముఖ్యంగా హైదరాబాద్‌లో ఓపెన్ చేసిన ప్రీమియర్స్ పరిస్థితి చూస్తే ఈ మెగా ప్రిన్స్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కినట్టే కనిపిస్తుంది.ప్రస్తుతం హైదరాబాద్‌లో మొత్తం 55 ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారట మేకర్స్. అయితే వాటిలో ఇప్పటికే 48 పైగా షోలు హౌస్‌ఫుల్ అయ్యాయని ట్రేడ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట.ఇక మిగిలిన షోలు కూడా మరికొద్ది సేపట్లోనే అమ్ముడవబోతాయని తెలుస్తుంది.

అడ్వాన్స్ బుకింగ్స్ జోరు

ముఖ్యంగా కూకట్‌పల్లి, అమీర్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, మియాపూర్, కొంపల్లి, ఎల్‌బీనగర్, గచ్చిబౌలి, ఆర్టీసీ క్రాస్‌రోడ్ ఏరియాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ స్ట్రాంగ్‌గా మరియు జోరుగా సాగుతున్నాయని తెలుస్తోంది.ఇక ఎన్నడూ లేనంతగా ఈ సినిమాకి అదనంగా మరిన్ని షోల కోసం డిమాండ్ చేస్తున్నారట ఫ్యాన్స్.

వరుణ్ తేజ్‌కు కమ్‌బ్యాక్ వస్తుందా?

Advertisement

అయితే గత కొంతకాలంగా వరుణ్ తేజ్‌కి అనుకున్నంత స్థాయిలో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీంతో ఎలాగైనా మా వరుణ్ ఈ కొరియన్ కనకరాజుతో సాలిడ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఎంతగానో ఆశపడుతున్నారు మెగా ఫ్యాన్స్.ఇక ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.మొత్తానికి ఈ ప్రీమియర్ షో బుకింగ్స్ చూస్తుంటే వరుణ్ తేజ్‌పై ఉన్న భారమంతా దిగినట్టే కనిపిస్తుంది.

ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేసిన కథ

ఇక కొరియన్ కనకరాజు సినిమా కథ విషయానికి వస్తే… కొరియన్ బ్యాక్‌గ్రౌండ్‌లో సాగే ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ పుష్కలంగా ఉండనుందని ఇప్పటికే ప్రమోషన్స్‌లో ఊదరగొట్టింది మూవీ టీం.అందువల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాపై ఇంట్రెస్ట్ చూపుతున్నారని జరుగుతున్న బుకింగ్స్‌ని బట్టి అర్థమవుతోంది.

హనుమాన్, కోర్ట్, టిల్లు స్క్వేర్ బాటలోనేనా?

ఇండస్ట్రీలో ప్రీమియర్ షో రెస్పాన్స్ విషయానికి వస్తే హనుమాన్, కోర్ట్, టిల్లు స్క్వేర్ వంటి ఎన్నో సినిమాలు మంచి ప్రీమియర్ టాక్ తెచ్చుకున్నాయి.మొత్తంగా వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు సినిమా కూడా అదే బాటలో నడుస్తుండటం విశేషం.

also read:‘ది పారడైజ్’ టీజర్ చూసారా?.. నాని రచ్చ స్టార్ట్!

మొదటి రోజు కలెక్షన్లపై భారీ అంచనాలు

ఇక ఈ ప్రీమియర్ షోల నుంచి వచ్చే టాక్ రేపటి ఓపెనింగ్‌కి దారులు తీస్తాయన్న సంగతి తెలిసిందే.అలా మొదటి రోజే ఈ సినిమా ఊహించని కలెక్షన్లను కొల్లగొట్టబోతుందని వస్తున్న రెస్పాన్స్‌ని చూస్తుంటేనే అర్థమవుతోంది.చూడాలి మరి… ప్రీమియర్ షోలలో బాగుందని ఊదరగొడుతున్న కొరియన్ కనకరాజు రేపటికి ఎలాంటి ఫలితాన్ని రాబడతాడో!

Tags

Related News

జి.డి. నాయుడు ఎవరో తెలుసా?.. ఆయన కథ ఇప్పుడు వెండితెరపై!

Korean Kanakaraj Twitter Review : ‘ కొరియన్ కనకరాజు ‘ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

‘ది పారడైజ్’ టీజర్ చూసారా?.. నాని రచ్చ స్టార్ట్!

పట్టు చీరల నుంచి డిజైనర్ వేర్ వరకు.. హీరోయిన్ల ఖరీదైన కలెక్షన్స్!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో గోల్డెన్ ఆఫర్!

నా సినిమాలు చూశావా? అని అడగలేకపోయా.. ప్రభాస్‌పై సందీప్ వంగా కామెంట్స్ వైరల్

ప్రదీప్ రావత్ మృతిపై విస్తుపోయే నిజాలు బయటపెట్టిన కొడుకు!

Big Stories

Advertisement
×