E-Paper
Advertisement

బ్లడ్‌బాత్‌తోనే పాన్ ఇండియా హీరో అవుతావా నాని ?

బ్లడ్‌బాత్‌తోనే పాన్ ఇండియా హీరో అవుతావా నాని ?
Advertisement

Paradise Teaser ;ఒకప్పుడు మాస్ హీరో అంటే రెండు పాటలు పాడామా.. నాలుగు ఫైట్స్ చేశామా అన్నట్టుగా ఉండేది. కానీ కాలం మారింది. ఇప్పుడదంతా ప్యాన్ ఇండియా హీరో ట్యాగ్ వేసుకోవాలని తెగ ఆరాటపడిపోతున్నారు.

అయితే వెండితెరపై రక్తం చిందిస్తేనే ప్యాన్ ఇండియా హీరో అవుతారా.. ఏమో నాని అలాగే ఆలోచిస్తున్నట్టున్నాడు. అందుకే తాజాగా వచ్చిన ది ప్యారడైజ్ టీజర్‌లోనే రక్తాన్ని ఏరులై పారించాడు.

టీజర్‌లో రక్తం.. డైలాగ్‌లో దుమారం!

Advertisement

ది ప్యారడైజ్ టీజర్‌లో వినిపించిన…“ఇరుగు దృష్టి… పొరుగు దృష్టి… నల్లి గుట్లోన్ దృష్టి… బెదురు గుట్లోన్ దృష్టి… కత్తులన్నీ కటకట… నెత్తురంతా చిటపట… దృష్టంతా పోవాలి… థూ… థూ… థూ!”…అన్న డైలాగ్ విన్నాక ఖచ్చితంగా నాని రక్తంలో స్విమ్మింగ్ చేసినట్టే అనిపిస్తుంది. ఇక ఈ టీజర్ చూశాక ఒకప్పుడు మన పక్కింటి కుర్రాడిలా కనిపించే నాని నేనా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు అంతా.

టాలీవుడ్‌లో కొత్త రూల్ ఇదేనా?

మరోవైపు నాని టీజర్ చూస్తుంటే ప్యాన్ ఇండియా హీరో కావాలంటే ఇలా రక్తం చిందించాల్సిందేనా? ఇలా టాలీవుడ్‌లో ఏమన్నా కొత్త రూల్ వచ్చిందా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇక నేషనల్ వైడ్ హీరో కావాలంటే వెండితెరపై బ్లడ్ బాత్ పారాల్సిందేనా అన్న కామెంట్లు చక్కర్లు కొడుతున్నాయి.

మాస్ అంటే ఇప్పుడు ఇదే ఫార్ములా?

Advertisement

మామూలుగా ఒకప్పుడు మాస్ హీరో అంటే సిక్స్ ప్యాక్ ఉంటే చాలు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఒంటిమీద పిచ్చిపిచ్చిగా దెబ్బలు ఉండాలి.. చేతిలో గొడ్డలి ఉండాలి.. బ్యాక్‌గ్రౌండ్‌లో మంటలు మండాలి.. ఇక కెమెరా ముందు రక్తం పారాలి. అప్పుడే సోషల్ మీడియాలో ఊర మాస్, వైల్డ్ అంటూ ఆకాశానికి ఎత్తే పనిలో పడ్డారు సో కాల్డ్ ఫ్యాన్స్.

కేజీఎఫ్ నుంచి పుష్ప వరకు అదే ట్రెండ్!

ఇదొక్కటే కాదు… గత కొన్ని ఏళ్లుగా చూస్తే దాదాపు ఇదే సీన్ కనిపిస్తుంది. కేజీఎఫ్, సలార్, అనిమల్, మార్కో, పుష్ప… ఇలా ఏ సినిమా చూసినా రక్తం విచ్చలవిడిగా పారింది. చూస్తుంటే ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల కూడా అదే ఫార్ములాని నమ్ముకున్నట్టు కనిపిస్తుంది.

టీజర్‌లోనే ఈ రేంజ్ రక్తపాతం చూపిస్తే.. ఇక సెప్టెంబర్ 24న వచ్చే సినిమాలో ఇంకెంత బ్లడ్ బాత్ చూపిస్తారా అంటూ డిబేట్లు పెట్టేస్తున్నారు నెటిజన్లు.

పక్కింటి నాని… ఇప్పుడు జడల్ నాని!

ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే.. ఇప్పటివరకు నాని అంటే ప్రేక్షకుల్లో ఒక సాఫ్ట్ ఇమేజ్ ఉండేది. అలా మొదలైంది, భలే భలే మగాడివోయ్, నిన్ను కోరి, హాయ్ నాన్న… ఇలా ఏ సినిమా చూసినా పక్కింటి కుర్రాడిగానే కనిపించాడు.కానీ ఇప్పుడు అదే నానిని జడల్‌గా చూసి షాక్ అవుతున్నారు ఫ్యామిలీ ఆడియన్స్.

ఫ్యామిలీ ఆడియన్స్‌లో కొత్త డౌట్!

మరోవైపు ఇంత రక్తపాతాన్ని చూసిన ఫ్యామిలీ ఆడియన్స్.. ఇంట్లో పిల్లలతో వెళ్లొచ్చా? లేక ఫ్రెండ్స్‌తోనే వెళ్లాలా? అంటూ ఇప్పుడే లెక్కలు వేసుకునే పనిలో పడ్డారట.

రక్తమే మాస్‌కు అసలు నిర్వచనమా?

ఏదేమైనా ఒక విషయం మాత్రం నిజం… నాని ఎక్కడ రిస్క్ తీసుకోవడానికి వెనుకాడట్లేదు. దసరాలో మాస్ అవతారాన్ని చూపించిన నాని.. తాజాగా వచ్చిన ప్యారడైజ్ టీజర్‌తో విశ్వరూపాన్ని చూపించాడు.

కానీ నిజంగా మాస్ అంటే కేవలం రక్తమేనా? కథ ఉండకపోయినా పర్లేదా? ఎమోషన్ లేకపోయినా ఓకేనా? లేక నెత్తురు పారితే చాలు ప్రేక్షకుడు టికెట్లు తెంచేస్తాడా?ఏమో… సీతారామం, హనుమాన్, లక్కీ భాస్కర్ వంటి సినిమాలను మాత్రం మామూలుగానే సూపర్ హిట్ చేసేశారు.

ALSO READ:‘ది పారడైజ్’ టీజర్ చూసారా?.. నాని రచ్చ స్టార్ట్!

ఏది ఏమైనా చూడాలి… నాని ఇంతగా వెండితెరపై రక్తాన్ని పారించేందుకు ఎందుకు ఒప్పుకున్నాడో సెప్టెంబర్ 24న తేలిపోతుంది!

 

Tags

Related News

జి.డి. నాయుడు ఎవరో తెలుసా?.. ఆయన కథ ఇప్పుడు వెండితెరపై!

Korean Kanakaraj Twitter Review : ‘ కొరియన్ కనకరాజు ‘ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

51 షోలు ఓపెన్.. 48 హౌస్‌ఫుల్..దుమ్మురేపుతున్న కొరియన్ కనకరాజు !

‘ది పారడైజ్’ టీజర్ చూసారా?.. నాని రచ్చ స్టార్ట్!

పట్టు చీరల నుంచి డిజైనర్ వేర్ వరకు.. హీరోయిన్ల ఖరీదైన కలెక్షన్స్!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో గోల్డెన్ ఆఫర్!

నా సినిమాలు చూశావా? అని అడగలేకపోయా.. ప్రభాస్‌పై సందీప్ వంగా కామెంట్స్ వైరల్

Big Stories

Advertisement
×