E-Paper
Advertisement

‘ది పారడైజ్’ టీజర్ చూసారా?.. నాని రచ్చ స్టార్ట్!

‘ది పారడైజ్’ టీజర్ చూసారా?.. నాని రచ్చ స్టార్ట్!
Advertisement

Paradise Teaser:వచ్చేసింది.. నాని అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ‘ది పారడైజ్’ టీజర్ వచ్చేసింది.ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.ఇప్పుడు టీజర్ చూస్తుంటే అదే రేంజ్‌లో ఉందని అర్థమవుతోంది.జడల్ పాత్రలో ఈసారి నాని బాక్సాఫీస్ వద్ద రచ్చ చేసేలానే కనిపిస్తున్నాడు.

నాని తన కెరీర్‌లో ఇప్పటివరకు కనిపించని సరికొత్త అవతారంలో కనిపిస్తుండటంతో ఫుల్ హ్యాపీ మోడ్‌లోకి వెళ్లిపోయారు నాని ఫ్యాన్స్.

పక్కింటి కుర్రాడు నుంచి మాస్ హీరోగా నాని

Advertisement

మామూలుగా నాని అంటే పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడు.కానీ ‘ది పారడైజ్’లో మాత్రం నాని పూర్తి స్థాయి మాస్ హీరో అవతారం ఎత్తాడు.ఇంతకుముందు ఎప్పుడూ చూడని రఫ్ అండ్ టఫ్, పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తున్నాడు.

మళ్లీ శ్రీకాంత్ ఓదెల – నాని కాంబో

ఈ సినిమాని SLV Cinemas పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘దసరా’ 100 కోట్ల క్లబ్‌లో చేరడంతో పాటు నానిని మాస్ హీరోగా నిలబెట్టింది.ఇప్పుడు అదే కాంబినేషన్‌లో ‘ది పారడైజ్’ ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

టీజర్‌లోనే భారీ స్కేల్ కనిపించింది

Advertisement

టీజర్‌లో కనిపించిన విజువల్స్, యాక్షన్ ఎలిమెంట్స్ చూస్తుంటే ఇది సాధారణ సినిమా కాదని తెలుస్తోంది.పవర్‌ఫుల్ కథ, భారీ స్కేల్, ఇంటెన్స్ క్యారెక్టరైజేషన్‌తో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు కనిపిస్తోంది.ముఖ్యంగా నాని చెప్పే డైలాగ్స్, అతడి స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

అయితే టీజర్‌లో అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షించినది చివర్లో వచ్చే డైలాగ్. “ఇరుగు దృష్టి… పొరుగు దృష్టి… నల్లి గుట్లోన్ దృష్టి… బెదురు గుడ్లోని దృష్టి… కత్తులన్నీ కటకట… నెత్తురంతా చిటపట… దృష్టంతా పోవాలి… థూ… థూ… థూ!” అంటూ నాని చెప్పిన విధానం ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఈ డైలాగ్ చెప్పిన స్టైల్, వాయిస్ మాడ్యులేషన్, బేస్ చూస్తుంటే చాలామందికి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గుర్తొచ్చారనే కామెంట్లు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. మోహన్ బాబు పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పేటప్పుడు ఉండే ఆ గ్రేస్, ఆ మ్యానరిజం, ఆ కమాండ్‌ను నాని తన స్టైల్‌లో ప్రజెంట్ చేశాడని అభిమానులు అంటున్నారు.

అంతేకాదు.. “ఈ దేశం ఎవరిది?.. ఈ జాగా ఎవరిది?” అంటూ కత్తులు పట్టుకుని నాని అరుస్తూ కనిపించే సన్నివేశాలు మాస్ ఆడియన్స్‌కు ఫుల్ మీల్స్‌లా అనిపిస్తున్నాయి. థియేటర్లలో ఈ సీన్స్‌కు విజిల్స్, అరుపులు గ్యారెంటీ అని అభిమానులు ఇప్పటినుంచే పోస్టులు పెడుతున్నారు.

ఇక అనిరుధ్ రవిచందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. టీజర్‌లో ప్రతి షాట్‌కు అనిరుధ్ ఇచ్చిన బీజీఎం వేరే లెవెల్‌లో ఉంది. యాక్షన్ సీన్స్‌కు తగ్గట్టుగా మ్యూజిక్ హైప్‌ను మరింత పెంచేసింది. టీజర్ పూర్తయ్యాక కూడా ఆ బీజీఎం మైండ్‌లో తిరుగుతూనే ఉండేలా కంపోజ్ చేశాడని ఆకాశానికి ఎత్తేస్తున్నారు అంతా.

పాన్ ఇండియా రిలీజ్‌కు ప్లాన్

‘ది పారడైజ్’ను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.‘దసరా’ సినిమాతో నాని నార్త్ ఆడియన్స్‌కు కూడా దగ్గరయ్యాడు.ఇప్పుడు ఈ సినిమాతో తన మార్కెట్‌ను మరింత పెంచుకోవాలని చూస్తున్నాడు.

కొత్త కథలే నాని బలం

ఇక నాని గత సినిమాలను గమనిస్తే.. ఎప్పుడూ కొత్త కథలకే ప్రాధాన్యత ఇస్తుంటాడు.‘జెర్సీ’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘అంటే సుందరానికి’, ‘దసరా’, ‘హాయ్ నాన్న’ లాంటి సినిమాలతో నటుడిగా తన స్థాయిని నిరూపించాడు.ఒక సినిమాకు మరో సినిమాకు పూర్తిగా భిన్నంగా కనిపించేలా ప్లాన్ చేసుకుంటూ వస్తున్న నాని.. ఇప్పుడు ‘ది పారడైజ్’తో మరోసారి కొత్త ప్రయోగం చేస్తున్నాడు.

పాన్ ఇండియా రేసులో ‘ది పారడైజ్’

ప్రస్తుతం టాలీవుడ్‌లో పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది.ప్రభాస్ ‘స్పిరిట్’, మహేష్ బాబు – రాజమౌళి ప్రాజెక్ట్, అల్లు అర్జున్ – అట్లీ సినిమా లాంటి భారీ చిత్రాల మధ్య నాని ‘ది పారడైజ్’ కూడా మంచి హైప్ క్రియేట్ చేస్తోంది.

టీజర్‌తోనే భారీ అంచనాలు

మొత్తానికి టీజర్‌తోనే ‘ది పారడైజ్’పై భారీ అంచనాలు పెరిగిపోయాయి.నాని కొత్త లుక్, శ్రీకాంత్ ఓదెల మేకింగ్ స్టైల్, పవర్‌ఫుల్ కథ.. ఇవన్నీ కలిస్తే ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్లలో ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.

also read:పట్టు చీరల నుంచి డిజైనర్ వేర్ వరకు.. హీరోయిన్ల ఖరీదైన కలెక్షన్స్!

Tags

Related News

పట్టు చీరల నుంచి డిజైనర్ వేర్ వరకు.. హీరోయిన్ల ఖరీదైన కలెక్షన్స్!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో గోల్డెన్ ఆఫర్!

నా సినిమాలు చూశావా? అని అడగలేకపోయా.. ప్రభాస్‌పై సందీప్ వంగా కామెంట్స్ వైరల్

ప్రదీప్ రావత్ మృతిపై విస్తుపోయే నిజాలు బయటపెట్టిన కొడుకు!

వైజాగ్ లో బన్నీ AAA సినిమాస్ ఓపెనింగ్…. కానీ ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!

ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా చిరంజీవి.. స్పందించిన టీమ్!

లీకులు ఫుల్.. అప్‌డేట్ నిల్.. ఇదేం గేమ్ జక్కన్నా?

Big Stories

Advertisement
×