Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అత్తారింటికి దారేది సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2014లో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా తర్వాత మళ్లీ సినిమాలు చేయను అని అనౌన్స్ కూడా చేశారు. అయితే సినిమా తప్ప వేరే ఇన్కమ్ సోర్స్ పవన్ కళ్యాణ్ కు లేదు కాబట్టి మళ్ళీ సినిమాలు చేయాల్సి వచ్చింది.
వకీల్ సాబ్ సినిమాతో పవన్ కళ్యాణ్ మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. వకీల్ సాబ్ సినిమాను సెట్ చేసింది త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆ తర్వాత త్రివిక్రమ్ ఇన్వాల్వ్ అయిన సినిమా భీమ్లా నాయక్. ఆ సినిమాకి స్క్రీన్ ప్లే తో పాటు డైలాగులు కూడా అందించారు త్రివిక్రమ్. ఆ తర్వాత దగ్గరుండి బ్రో అనే ప్రాజెక్టు కూడా సెట్ చేశారు. అయితే ఈ మూడు సినిమాలు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి సరైన సంతృప్తిని ఇవ్వలేదు. సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఓజీ సినిమా కొంతమేరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని సంతృప్తిపరిచింది.
పవన్ కళ్యాణ్ చిన్నప్పుడు అంతా చెన్నైలో పెరిగిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ తమిళ్ కూడా చాలా అలవోకగా మాట్లాడగలుగుతారు. అయితే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో లోకేష్ కనకరాజ్ ఫిలిం మేకింగ్ చాలా బాగుంటుంది అని చెప్పారు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఇద్దరు దర్శకులు రెడీగా ఉన్నట్లు సమాచారం వినిపిస్తుంది. హెచ్ వినోద్ మరియు లోకేష్ కనగరాజ్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు విశ్వసినీ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తుంది.
పవన్ కళ్యాణ్ తమిళ దర్శకులతో పనిచేయడం కొత్తమీ కాదు. ఒకప్పుడు ఎస్ జె సూర్య దర్శకత్వంలో ఖుషి అనే సినిమాను చేశారు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఆ సినిమా తర్వాత దాదాపు పది సంవత్సరాలు పాటు పవన్ కళ్యాణ్ కు చెప్పుకోదగ్గ హిట్ సినిమా పడలేదు.
ఆ తర్వాత ఎస్ జె సూర్య దర్శకత్వంలో చేసిన కొమరం పులి సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. తమిళ దర్శకుడు ధరణి దర్శకత్వంలో చేసిన బంగారం సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అలానే విష్ణువర్ధన్ దర్శకత్వంలో చేసిన పంజా సినిమా కూడా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ నమ్ముకున్న తమిళ్ డైరెక్టర్స్ ఎవరూ కూడా ఊహించని స్థాయి సక్సెస్ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ విషయం వినగానే మళ్లీ తమిళ్ దర్శకులతో అవసరమా అని పవన్ కళ్యాణ్ అభిమానులు ఆందోళనలో ఉన్నారు.
Also Read: Telugu film industry: పాత కథలకు కొత్త రంగులను పూస్తే సరిపోతుందా? నిర్మాతలు పాత సినిమాలు చూడరా?