Keerthy suresh: సినీ నటి కీర్తి సురేష్(Keerthy Suresh) నేడు తన పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ఆమె కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తెలియజేస్తూ కీర్తి సురేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక నేడు కీర్తి పుట్టినరోజు సందర్భంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్ లో దిల్ రాజు, శిరీష నిర్మాతలుగా వ్యవహరిస్తున్న సినిమా నుంచి ఒక ఆసక్తికరమైన పోస్టర్ విడుదల చేశారు. ఈ సినీ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రం 59 వ సినిమా కావడంతో SVC 59 పేరిట ఈ పోస్టర్ విడుదల చేశారు.
ఇందులో భాగంగా కీర్తి సురేష్ నీడతో కలిగి ఉన్న ఫోటోని విడుదల చేస్తూ…” ఆమె ప్రేమ ఒక కావ్యం.. ఆమె ఆత్మ ఓ పాట” అంటూ ఈ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే కీర్తి సురేష్ పాత్ర చాలా డెప్త్ గా ఉండబోతుందని, ఆమె పాత్రను తెలియజేస్తూ ఈ పోస్టర్ విడుదల చేశారని స్పష్టం అవుతుంది. ఇక ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఎంతో ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు “రౌడీ జనార్ధన్”(Rowdy Janardhan) అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు రవి కిరణ్ కోలా(Ravi Kiran kola) దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)నటిస్తున్న విషయం తెలిసిందే. కింగ్డమ్ సినిమా మంచి సక్సెస్ కావడంతో దిల్ రాజు తిరిగి విజయ్ దేవరకొండతో ఈ సినిమాని ప్రకటించార. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులను కూడా జరుపుకోబోతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను చిత్ర బృందం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఇకపోతే కీర్తి సురేష్ చాలా గ్యాప్ తర్వాత ఇలా తెలుగు సినిమాకు కమిట్ అవడంతో ఆమె అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా చివరిగా నాని నటించిన దసరా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఉత్తమ నటిగా జాతీయ అవార్డు…
ఈ సినిమా అనంతరం ఈమె హీరోయిన్ గా నటించకపోయిన మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలి పాత్రలో కనిపించారు. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ సినిమా పనులలో బిజీగా ఉన్నారు అనంతరం పెళ్లి చేసుకోవడంతో కొంతకాలం పాటు తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న కీర్తి సురేష్ ప్రస్తుతం రౌడీ జనార్ధన్ సినిమా పనులలో బిజీ కాబోతున్నారని తెలుస్తోంది. బాలనటిగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్ నేను శైలజ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇక మహానటి సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఈ సినిమాలో తన నటనకు ఏకంగా నేషనల్ అవార్డు కూడా అందుకున్న సంగతి తెలిసిందే.
Also Read: Lasya -Roja: యాంకర్ లాస్య గృహప్రవేశం.. సందడి చేసిన రోజా..ఎంతో ప్రత్యేకం అంటూ!