OTT Movie : రియల్ స్టోరీల ఆధారంగా వస్తున్న డాక్యుమెంటరీలు, ఇంట్రస్టింగ్ గా, ఆలోచింపజేసేవిధంగా ఉంటున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే డాక్యుమెంటరీ 2023లో ఫ్లోరిడాలో జరిగిన నిజమైన ఘటన ఆధారంగా తీశారు. ఒక నల్లజాతి మహిళ, మరో తెల్ల జాతి మహిళ ఎదురెదురు ఇంట్లో నివాసిస్తుంటారు. అయితే చిన్న చిన్న గోడవలతో మొదలై ప్రాణాలు తీసుకునే వరకు వీళ్ళ స్టోరీ వెళ్తుంది. పోలీసులు ఈ కేసులోని అసలు నిజాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు. ఈ డాక్యుమెంటరీ పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘ది పెర్ఫెక్ట్ నెయిబర్’ (The Perfect Neighbor) 2025లో వచ్చిన అమెరికన్ డాక్యుమెంటరీ ఫిల్మ్. గీతా గాంధ్భీర్ దీనికి దర్శకత్వం వహించారు. దీనిని 2025 జనవరి 24న సుండాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ఇది డైరెక్టర్ అవార్డ్ (U.S. డాక్యుమెంటరీ) అవార్డ్ ను కూడా గెలుచుకుంది. 2025 అక్టోబర్ 17న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై, IMDbలో ఇది 8.0/10 రేటింగ్ పొందింది.
ఫ్లోరిడాలోని ఒక చిన్న ఊరిలో ఓవెన్స్ అనే నల్ల జాతి మహిళ, తన ముగ్గురు పిల్లలతో ప్రశాంతంగా జీవిస్తుంటుంది. అయితే ఆమె ఇంటికి పొరుగున ఉండే సుజాన్ అనే ఒక తెల్ల జాతి మహిళ, ఓవెన్స్ తో చాలా సార్లు గొడవ పెట్టుకుంటుంది. ఎందుకంటే ఓవెన్స్ పిల్లలు అల్లరి చేస్తున్నారని, తనకి ఇబ్బందిగా ఉంటోందని పలుమార్లు తిట్ల పురాణం అందుకుంటుంది. సుజాన్ వంద కంటే ఎక్కువ సార్లు పోలీసులకు కాల్ చేసి అజికే గురించి ఫిర్యాదు చేస్తుంది. ఒక రోజు ఓవెన్స్, సుజాన్‌తో మర్యాద పూర్వకంగా మాట్లాడి, గొడవలు ఆపమని చెప్పడానికి ఆమె ఇంటికి వెళ్తుంది. కానీ సుజాన్ భయపడి, తన తలుపు వెనక నుంచి తుపాకీతో అజికేను కాల్చి చంపేస్తుంది.
Read Also : పనిలేని వాడికి పవర్ వస్తే ఇట్టా ఉంటది… బ్యాంకుకు కన్నం వేసే మాస్టర్ ప్లాన్… వీళ్ళెక్కడి సూపర్ హీరోలు సామీ
ఈ ఘటన అక్కడ ఉన్న వాళ్ళని షాకింగ్ కి గురిచేస్తుంది. ఫ్లోరిడాలో ఆత్మ రక్షణకు తుపాకీ ఉపయోగించే హక్కు ఉంటుంది. దాని ఆధారంగా తాను భయపడ్డానని, సెల్ఫ్-డిఫెన్స్‌లో కాల్చానని ఆమె పోలీసులకు చెప్తుంది. కానీ అజికే కుటుంబం ఈ చట్టం వల్ల తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తారు. ఈ డాక్యుమెంటరీలో పోలీస్ లు 911 కాల్ రికార్డింగ్స్, అజికే కుటుంబం ఇంటర్వ్యూలు చూపిస్తారు. ఈ ఫుటేజ్‌లో సుజాన్, అజికే మధ్య గొడవలు, సుజాన్ పోలీసులకు చేసిన ఫిర్యాదులు కనిపిస్తాయి. ఈ చట్టం ఎలా దుర్వినియోగం అవుతుందనేది చూపిస్తుంది. చివర్లో సుజాన్ కు కోర్టులో శిక్ష పడుతుంది. ఓవెన్స్ కుటుంబం న్యాయం కోసం పోరాడే సన్నివేశాలు ఎమోషనల్ గా, ఆలోచింపజేసే విధంగా ఉంటాయి.