BigTV English

Pawan Singh: పవన్‌ సింగ్‌ వివాదం.. అంతలోనే మరో భోజ్‌పూరి నటుడు పాడు పని, వీడియో వైరల్‌

Pawan Singh: పవన్‌ సింగ్‌ వివాదం.. అంతలోనే మరో భోజ్‌పూరి నటుడు పాడు పని, వీడియో వైరల్‌

Actor Khesari Lal Yadav Video Viral: ప్రముఖ భోజ్‌పూరి నటుడు పవన్‌ సింగ్‌ వివాదం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా ఉంది. ఇటీవల ఓ పబ్లిక్‌ ఈవెంట్‌లో నటిని అసభ్యంగా తాకిన వీడియో నెటింట దుమారం రేపింది. దీంతో అతడిపై తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. హీరో చేసిన పనికి ఏకంగా నటి ఇండస్ట్రీనే వదిలేసింది. దీంతో హీరో దిగివచ్చి క్షమాపణలు చెప్పాలి. నటి అంజలికి సారీ చెబుతూ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఇక ఈ వివాదం ఇప్పటికే సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గానే ఉంది. పవన్‌ సింగ్‌ తీరుపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. అతడిపై నెటిజన్స్‌ తీవ్ర స్థాయిలో మండపడ్డారు.


అప్పుడు పవన్ సింగ్.. ఇప్పుడు ఖేసరి లాల్

ఇప్పటికే ఈ సంఘటన నెట్టింట హాట్‌ టాపిక్‌గానే ఉంది. ఈ ఘటన మరువక ముందే మరో భోజ్‌పూరి నటుడి అసభ్యకరమైన వీడియో వెలుగులోకి వచ్చింది. మరో భోజ్‌పూరి స్టార్‌ నటుడు ఖేసరి లాల్‌ యాదవ్‌.. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఓ పబ్లిక్‌ ఈవెంట్‌ కి వచ్చిన ఆయనను చూసి మహిళా ఫ్యాన్స్‌ అత్యుత్సాహం ప్రదర్శించారు. స్టేజ్‌పైకి వెళ్లి నటుడితో పలకరించేందుకు స్టేజ్‌ అక్కడ. ఈ సందర్బకంగా ఖేసరి లాల్‌ సదరు లేడీ ఫ్యాన్స్‌ పట్ల వ్యవహరించిన తీరు ప్రతి ఒక్కరిని ఆగ్రహానికి గురి చేస్తోంది. వారి పట్ల అసభ్యకరంగా మాట్లాడుతూ.. వారిని ఇబ్బందికి గురి చేశాడు. అక్కడ పబ్లిక్‌లోనే వారిపై బాడీ షేమింగ్‌ చేశాడు. వాళ్లని తాకరాని చోట తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు.


లేడీ ఫ్యాన్ తో అసభ్యకరంగా..

ఓ పబ్లిక్‌ ఈవెంట్‌కి హాజరైన భోజ్‌పూరి స్టార్‌ హీరో ఖేసరి లాల్‌ యాదవ్‌ను కలిసేందుకు ఇద్దరు మహిళ అభిమానులు స్టేజ్‌ ఎక్కారు. నటుడితో కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా వారితో ఖేసరి లాల్‌ ఇలా అన్నాడు. మీలో ఎవరు పెద్ద అని అడిగాడు. అందులో ఓ యువతి నేను పెద్ద.. తను చిన్న అని సమాధానం ఇచ్చింది. దీనికి అతడు నువ్వు చిన్న అయినప్పటికీ.. నీవి అన్ని పెద్దవిగా ఉన్నాయంటూ అసభ్యకరంగా మాట్లాడాడు. అదే టైంలో తన చేతిని కూడా తన శరీరం వైపు అభ్యంకరంగా చూపించాడు. ఇక ఆ అమ్మాయి ఏదో మాట్లాడి వెళ్లిపోతుండగా.. హగ్ చేసుకోవాని చెప్పాడు. హగ్ చేసుకున్న తర్వాత సదరు ఫ్యాన్‌తో తనకు ఎక్కడ పట్టుకోవాలనిపిస్తే.. అక్కడే పట్టుకుంటానంటూ డబుల్‌ మీనింగ్‌లో మాట్లాడారు.

అదీ కూడా మైక్‌లో పబ్లిక్‌ ఆ మహిళ ఫ్యాన్స్‌ పట్ల అనుచితంగా వ్యవహరించారు. ఇప్పుడు ఈ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు నటుడి తీరుపై నెటిజన్స్‌ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మీ భోజ్‌పూరి హీరోలకు అసలు మర్యాద తెలియదా? పద్దతి లేదా? అందరు అంతేనా. పేరుకే సెలబ్రిటీలు.. కానీ, పబ్లిక్‌ ప్లేస్‌లో ఎలా వ్యవహరించాలో కనీస జ్ఞానం కూడా లేదంటూ తిట్టిపోస్తున్నారు. పవన్‌ సింగ్‌ ఘటన మరవక ముందే అంతలోని మరో భోజ్‌పూరి నటుడి వీడియో బయటకు రావడంతో సోషల్‌ మీడియా వేదికగా అభిమానులు, నెటిజన్స్‌ వారిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ నటుడు కూడా బహిరంగ క్షమాపణలు చెప్పాలని, అప్పుడే వారికి ఎలా ఉండాలి.. ఉండోద్దనే జ్ఞానం వస్తుందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Pawan Singh: నటితో హీరో అసభ్య ప్రవర్తన.. ఎట్టకేలకు స్పందించిన పవన్‌ సింగ్‌, హీరోయిన్‌కి క్షమాపణలు..

Related News

Yash vs Ranbir Kapoor : రామాయన్ రిలీజ్ కి ముందే, రాముడికి రావణుడికి బాక్సాఫీస్ ఫైట్

Siva Karthikeyan : మదరాసి మూవీలో యంగ్ టైగర్ గెస్ట్ రోల్… ఓపెన్‌గా చెప్పేసిన హీరో

Vijay Devarakonda: దిల్‌ రాజుకి ‘రౌడీ’ నచ్చడం లేదా.. అందుకే ఈ మార్పులా?

Naga Chaitanya Samantha : సమంత కేసు… మరోసారి కోర్టు మెట్లు ఎక్కిన నాగార్జున, నాగ చైతన్య

Little Hearts Making Video: ఒక్క చిన్న వీడియో… బుడ్డోళ్లు ఇండస్ట్రీ మొత్తాన్ని ట్రోల్ చేశారు

Spirit : అయ్యో ప్రభాస్ కి ఏమైంది, మరి అంతలా తగ్గిపోయాడు ఏంటి?

Big Stories

×