Pawan Singh apologises to Anjali Raghav: పబ్లిక్ ఈవెంట్‌లో నటిని అసభ్యంగా తాకిన ప్రముఖ నటుడు, భోజ్‌పూరి సూపర్ స్టార్ పవన్ సింగ్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆయన తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇది కాస్తా వివాదానికి దారి తీయడంతో ఎట్టకేలకు ఈ సంఘటనపై అతడు స్పందించాడు. దీనిపై వివరణ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. తన ప్రవర్తన వల్ల ఇబ్బంది కలిగితే.. సారీ అంటూ నటి అంజలిని క్షమాపణలు కోరాడు. కాగా ఇటీవల లక్నోలో జరిగిన ఓ కార్యక్రమానికి నటుడు పవన్ సింగ్, తన సహా నటి అంజలి రాఘవ్‌తో కలిసి పాల్గొన్నాడు.
స్టేజ్‌పై అంజలి రాఘవ్ మాట్లాడుతుండగా.. పవన్ సింగ్ ఆమె నడుమును తాకాడు. తన నడుముపై ఏదో ఉన్నట్టుగా దాన్ని తుడుస్తున్నట్టుగా కనిపించాడు. అలా రెండు సార్లు తాకడంతో ఆ సంఘటన చూసి స్థానికులంత షాక్ అయ్యారు. పవన్ తీరుపై ఎలా స్పందించాలో అయోమయంలో ఉన్న నటి అంజలి.. నవ్వుతూ దాన్ని కవర్ చేసింది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అంతా పవన్ సింగ్‌పై విరుచుకుపడుతున్నారు. ఈ సంఘటనపై ఆయన వివరణ ఇవ్వాలని, నటి అంజలికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే అంజలిని కూడా ఈ వీడియో స్పందించాలని పెద్ద ఎత్తున సందేశాలు వచ్చాయి. తన సోషల్ మీడియాలో వరుసగా మెసేజ్‌లు వెళ్లాయి.
హీరో ప్రవర్తనపై నటి ఆవేదన
ఈ ఘటనపై ఆమె స్పందించాలని, పవన్ సింగ్ అసభ్యంగా తాకినప్పుడు.. కోపం ప్రదర్శించాలి లేదా చెంప చెల్లుమనిపించాలని. కానీ,వాటిలో తాను ఏది చేయలేదు.. పైగా నవ్వింది. అలా చేయడం వెనుక మీ ఉద్దేశం ఏంటని, దీనిపై వివరణ ఇవ్వాలని అభిమానుల నుంచి వరస మెసేజ్‌లు రావడంతో చివరకు ఆమె సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసింది. తన వీడియో వైరల్ అయినప్పటి నుంచి తనకు ఒత్తిడి పెరిగింది. దీనిపై స్పందించాలంటూ వరుసగా మెసేజ్‌లు, కాల్స్ వస్తున్నాయని చెప్పింది. స్టేజ్‌పై ఆయన అలా ప్రవర్తించడంతో తనకు ఏం తోచలేదని.. అయోమయ పరిస్థితుల్లోనే తాను నవ్వినట్టు చెప్పింది. ఈ సంఘటన తనని ఎంతో బాధిస్తోంది.. చాలా ఆందోళనగా ఉందని చెప్పింది. ఏదేమైనా ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడం నాకు చాలా అభ్యంతరకంగా అనిపిస్తోందని, నటిని అవ్వడం వల్ల తనకు ఇలాంటి పరిస్థితి ఎదురైందనే ఆందోళన కలుగుతోందని తెలిపింది.
సారీ చెప్పిన హీరో
అందుకే ఇక తాను భోజ్‌పూరి పాటలు, సినిమాల్లో నటించనని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఇక తాను భోజ్‌పూరి ఇండస్ట్రీని వదిలేస్తున్నాను అంటూ కీలక ప్రకటన చేసింది. అయితే ఈ వీడియో చూసిన నటుడ పవన్ సింగ్ ఈ సంఘటనపై స్పందిస్తూ పోస్ట్ షేర్ చేశాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ షేర్ చేశాడు. “అజలి.. నా బిజీ షెడ్యూల్ కారణంగా నువ్వు విడుదల చేసిన వీడియో చూడలేకపోయా. నువ్వు భోజ్‌పూరి ఇండస్ట్రీని వదిలేస్తానంటూ ఇచ్చిన స్టేట్‌మెంట్ నన్నుబాధించింది. నా తీరుతో నువ్వు ఎంత ఇబ్బందికి గురయ్యావో తెలిసి నాకు చాలా బాధగా అనిపించింది. అది నేను ఎలాంటి దురుద్దేశంతో చేయాలని. మనద్దరం ఆర్టిస్టులం అనే చనువుతోనే అలా చేశాను. అంతే తప్పా నాకు నీపై ఎలాంటి ఆలోచన లేదు. ఒక ప్రవర్తనతో నువ్వు బాధపడినట్టయితే దానికి నా క్షమాపణలు” అంటూ తన పోస్టర్‌లో రాసుకొచ్చాడు.
Also Read: Vishal-Sai Dhanshika: విశాల్, సాయి ధన్సిక ఆస్తుల విలువెంతో తెలుసా? వీరిద్దరికి కలిపి..