Payal Ghosh:సినీ ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా చేసే కామెంట్లు వారిని వార్తల్లో నిలిచేలా చేస్తూ ఉంటాయి. అనూహ్యంగా తమ పర్సనల్ విషయాలను బయట పెట్టడమే కాకుండా తమ కోరికలను కూడా బయటపెట్టి విమర్శలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఇప్పుడు ఒక హీరోయిన్ ఏకంగా అలాంటి కామెంట్లు చేసి ట్రోల్స్ ఎదుర్కొంటుంది అని చెప్పవచ్చు. మరి ఆమె ఎవరు ? అసలేం జరిగింది? తన మనసులో ఉన్న కోరిక ఏంటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
ఆమె ఎవరో కాదు పాయల్ ఘోష్ (Payal Ghosh).. మంచు మనోజ్ (Manchu Manoj) హీరోగా వచ్చిన ‘ప్రయాణం’ సినిమాలో నటించిన ఈమె.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) నటించిన ‘ఊసరవెల్లి’ సినిమాలో తమన్నా(Tamannaah ) ఫ్రెండ్ పాత్రలో నటించింది. తన నటనతో ప్రేక్షకులను అలరించే ఈమె.. ఎక్కువగా క్రికెటర్లను టార్గెట్ చేస్తూ వారిపై చేసే బోల్డ్ కామెంట్లు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి.. మధ్యలో ఇర్ఫాన్ పఠాన్ తో ఐదేళ్లపాటు డేటింగ్ చేసిన ఈమె.. మధ్యలో మోసం చేయడంతో డిప్రెషన్ లోకి వెళ్లినట్లు కూడా తెలిపింది. ఆ బాధతోనే తొమ్మిదేళ్లు శృం*గా*రానికి కూడా దూరంగా ఉన్నానని.. ఆ సమయంలో నరకం అనుభవించానని.. ఊహించని కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ.
ఇకపోతే అతని తర్వాత గౌతమ్ గంభీర్ కూడా అప్పుడప్పుడు మెసేజ్లు చేసేవాడని.. కానీ రిప్లై ఇవ్వలేదని మధ్యలో ఒక వ్యక్తి తనతో లైంగిక కోరిక తీర్చుకోవడానికి ప్రయత్నించినా తాను పట్టించుకోలేదని.. దానిపైన గౌరవం ఉంది. కాబట్టే ఎవరితో పడితే వాళ్లతో అలాంటి తప్పుడు పనులు చేయలేదు అంటూ కూడా చెప్పుకొచ్చింది పాయల్ ఘోష్. ఏది ఏమైనా ఈ ముద్దుగుమ్మ చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:Rishab Shetty: హాట్ టాపిక్ గా మారిన రిషబ్ శెట్టి ఇల్లు.. ఖరీదే కాదు.. ప్రత్యేకతలు కూడా!
ప్రచారకర్తగా, ప్రముఖ నటిగా పేరు సొంతం చేసుకున్న ఈమె ప్రయాణం సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టి తెలుగు, కన్నడ , హిందీ, తమిళ్ భాషలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమె అసలు పేరు హారిక. 1989 నవంబర్ 13న కలకత్తాలో జన్మించింది. హాన్స్ గ్రాడ్యుయేట్ -పొలిటికల్ సైన్స్, ఫ్యాషన్ డిజైనింగ్ లో డిప్లమా చేసింది. ఇండస్ట్రీలోకి వచ్చాక.. పాయల్ ఘోష్ గా పేరు మార్చుకున్న ఈమె.. పుట్టుకతోనే బెంగాలీ అయినా.. ప్రచార కార్యక్రమాలలో నటించడం కోసం ముంబైకి వెళ్లి యాక్టింగ్ స్కూల్లోనే చేరింది.
పాయల్ ఘోష్ రాందాస్ అథవాలేకు చెందిన రాజకీయ పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరి మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్ గా పని చేస్తోంది.
పాయల్ ఘోష్ నటించిన చిత్రాల విషయానికి వస్తే.. షార్ప్ పేర్ల్ వర్షధారి, మిస్టర్ రాస్కెల్ , తెరోడమ్ వీడియైల్, ఫ్రీడం, పటేల్ కి పంజాబీ షాదీ వంటి చిత్రాలలో నటించింది.