Nayanthara: సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న ఏకైక హీరోయిన్ నయనతార (Nayanthara). అలాంటి ఈమె ఇండస్ట్రీకి వచ్చి ఈ ఏడాదితో 22 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ఒక ఎమోషనల్ పోస్ట్ పంచుకుంది నయనతార. మరి అందులో ఏముందో ఇప్పుడు చూద్దాం..
నయనతార తన పోస్ట్ లో.. “మొదటిసారి నేను కెమెరా ముందుకు వచ్చి నేటికి 22 సంవత్సరాలు పూర్తీ అయింది. అయితే సినిమానే నా ప్రపంచంలా మారుతుందని అప్పుడు నాకు అనిపించలేదు. అది తెలియకుండానే నేను సినీ రంగ ప్రవేశం చేశాను. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్, ప్రతి నిశ్శబ్దం నన్ను పూర్తిగా మార్చేశాయి. నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. నన్ను నన్నుగా మలిచి.. నాకంటూ ఒక స్థానాన్ని కలిగించాయి. ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాకు అండగా నిలిచిన ప్రేక్షకుల ప్రేమ, మద్దతు వల్లే ఇది సాధ్యమైంది. భవిష్యత్తులో కూడా మరింతగా ప్రేక్షకులను అలరిస్తానని హామీ ఇస్తున్నాను” అంటూ నయనతార తన పోస్ట్ లో పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
మలయాళీ సిరియన్ క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన ఈమె కాలేజీ రోజుల నుంచి మోడలింగ్ చేయడం మొదలు పెట్టింది. అలా ఈమెకు మలయాళీ డైరెక్టర్ సత్యన్ అంతిక్కాడ్ ‘మనస్సినక్కరే’ అనే సినిమాలో హీరోయిన్గా అవకాశం ఇచ్చారు. ముందు సినిమాలోకి వెళ్ళొద్దనుకున్న ఈమె.. ఒక సినిమాలో చేద్దామనుకొని కెరియర్ ప్రారంభించింది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు రావడం తలుపు తట్టాయి. ముఖ్యంగా మోహన్ లాల్ , మమ్ముట్టి , రజినీకాంత్ వంటి పెద్ద పెద్ద హీరోల సినిమాలలో అవకాశాలు వచ్చేసరికి వెనుతిరిగి వెళ్లాలనిపించలేదట. అలా నాడు మొదలైన ఆమె సినీ ప్రయాణం.. నేడు 22 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో అభిమానులు ఈమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ALSO READ:Shriya Reddy: మగాళ్ళ మధ్య ఆ ఫీలింగ్ రావాలంటే ఇలా చేయాల్సిందే.. ఇదేంట్రా బాబు!
ఇండస్ట్రీకి వచ్చి 22 సంవత్సరాలు అవుతున్నా.. హీరోయిన్గా ఇంకా వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా దూసుకుపోతోంది. అందులో భాగంగానే చిరంజీవి(Chiranjeevi ) నటిస్తున్న ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న ఈమె.. యష్(Yash ) హీరోగా నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమాలో హీరోకి చెల్లిగా నటిస్తోంది. అలాగే తమిళంలో హాయ్, రక్కాయి, మన్నంగట్టి, మూకుత్తి అమ్మన్ 2 వంటి చిత్రాలు చేస్తోంది. అలాగే మలయాళంలో కూడా ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
నయనతార వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ప్రముఖ నటుడు కొరియోగ్రాఫర్ ప్రభుదేవా (Prabhudeva) తో దాదాపు చాలా సంవత్సరాలు రిలేషన్ మెయింటైన్ చేసింది. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అతని కోసం మతం కూడా మార్చుకుందనే వార్తలు వినిపించాయి. కానీ ఎందుకో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు. ఆ తర్వాత కొంతకాలం సైలెంట్ గా ఉన్న ఈమె.. మళ్లీ ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ (Vighnesh shivan) తో ఏడడుగులు వేసింది. సరోగసీ ద్వారా ఇద్దరు మగ కవల పిల్లలకు కూడా జన్మనిచ్చారు.