Afghanistan vs Bangladesh: ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి ఈ వన్డే సిరీస్ ప్రారంభమైంది. అయితే టి20 సిరీస్ కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్, తొలి వన్డేలో మాత్రం రెచ్చిపోయి పర్ఫామెన్స్ ఇచ్చింది. దీంతో తొలి వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ పై ఏకంగా ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది ఆఫ్గనిస్తాన్. బ్యాటింగ్ అలాగే బౌలింగ్ లో అద్భుతమైన ప్రదర్శన కనపరిచిన ఆఫ్ఘనిస్తాన్, పడి లేచిన సింహం లాగా గర్జించింది. అటు వన్డేలలో 200 వికెట్లు తీసి, రషీద్ ఖాన్ చరిత్ర సృష్టించాడు.
Also Read: Abhishek Sharma Car: అభిషేక్ కారుకు ఇండియాలో నో పర్మిషన్…దుబాయ్ లో వదిలేశాడుగా !
ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య తొలి వన్డే అబుదాబీ వేదికగా జరిగింది. నిన్న అర్ధరాత్రి వరకు కొనసాగిన ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ , 48.5 ఓవర్లలో 221 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్ అలాగే మిడిల్ ఆర్డర్ దారుణంగా విఫలం కావడంతో 221 పరుగులకే కుప్ప కూలింది. హసన్ మిరాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 60 పరుగులు చేయగా తోహిద్ హ్రిడోయ్ (Towhid Hridoy ) 56 పరుగులతో రాణించారు. ఇక 222 పరుగుల లక్ష్యాన్ని కేవలం 5 వికెట్లు నష్టపోయి సాధించింది ఆఫ్ఘనిస్తాన్. 47.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేదించి ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఆఫ్ఘనిస్తాన్. ఓపెనర్ రహ్మానుల్లాహ్ గుర్బాజ్ ( Rahmanullah Gurbaz ) 50 పరుగులు చేయక రహమత్ షా ( Rahmat Shah) హాఫ్ సెంచరీ చేసుకున్నాడు. దీంతో వన్డేలలో 4000 పరుగుల మైలు రాయిని దాటాడు. అటు అజ్మతుల్లా ఒమర్జై 40 పరుగులు చేయగా షాహిది 33 పరుగులతో రాణించారు.
బంగ్లాదేశ్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య నిన్న జరిగిన వన్డే మ్యాచ్ లో రషీద్ ఖాన్ అద్భుతంగా రాణించాడు. ఈ మ్యాచ్ లో రషీద్ ఖాన్ ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. పది ఓవర్లు వేసిన రషీద్ ఖాన్ 38 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే రషీద్ ఖాన్ సరికొత్త చరిత్ర క్రియేట్ చేశాడు. 200 వికెట్లు వన్డేల్లో తీసిన ప్లేయర్ గా రషీద్ ఖాన్ తన ఖాతాలో మరో రికార్డు వేసుకున్నాడు. తక్కువ వన్డేల్లో 200 వికెట్లు తీసిన ఆరవ ప్లేయర్గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్, ఆఫ్ఘనిస్తాన్ తరఫున ఏకైక ప్లేయర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతవరకు వన్డేల్లో ఆఫ్గనిస్తాన్ నుంచి ఏ ఒక్క ప్లేయరు 200 వికెట్లు పడగొట్టలేదన్న సంగతి తెలిసిందే. అటు రషీద్ ఖాన్ టి20 లో కూడా 175 లకు పైగా వికెట్లు తీశాడు.
🚨 HISTORY BY RASHID KHAN 🚨
– He becomes First Afghan bowler to take 200 Wickets in ODI also 6th Fastest player. 🔥 pic.twitter.com/oU5E4P8RlL
— ACB Xtra (@acb_190) October 8, 2025