Rain Alert: ఈ సంవత్సరం వర్షాలు వేసవికాలం మొదలు.. ఇప్పటికి తగ్గడం లేదు.. ఎప్పుడు లేని విధంగా వర్షాలు కురిశాయి.. వాగులు, వంకలు, చెరువులు ఏర్లై పారాయి.. వర్షాల కారణంగా ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇది సరిపోదు అన్నట్లుగా వర్షాలు మరో మూడు రోజులు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షం..
తెలంగాణను వర్షాలు వీడటం లేదు.. అయితే తెలంగాణలో నేటితో పాటు మరో మూడు రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ క్రమంలో నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, భువనగిరి, రంగారెడ్డి, యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, జోగులాంబ గద్వాల, సిరిసిల్ల, కరీంనగర్, మేడ్చల్, మంచిర్యాల పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. అలాగే ఉరుములు, మెరుపులు, పిడుగుల పడే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో వానలే వానలు..
నేడు హైదరాబాద్‌లో ఉదయం వరకు పొడిగా ఉన్న వాతావరణం.. మధ్యాహ్నం తర్వాత వర్షాలు కురుస్తున్నాయి. నేడు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నాంపల్లి, చార్మినార్, బహదూర్‌పురా, కిషన్‌బాగ్, రాజేంద్రనగర్, చంద్రాయణగుట్ట, ఆల్వాల్, మల్కాజ్‌గిరి, బోడుప్పల్, కీసర, దమ్మాయిగూడ, హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్, బీఎన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం, ఖైరతాబాద్, షేక్‌పేట్, టోలిచౌకి, గోల్కొండ, మెహదీపట్నం వంటి ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. బయటకు వెళ్లిన వారు.. అలాగే ఆఫీసులకు వెళ్లిన వారు త్వరగా ఇంటికి చేరుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు కుమ్ముడే కుమ్ముడు..
ఏపీలో బంగాళఖాతంలో అల్పపీడనం కారణంగా వర్షాలు ఆగకుండా కురుస్తున్నాయి. దీంతో సముద్రాలు పొంగిపోతున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మత్స్యకారులు వర్షాల కారణంగా వేటకు వెళ్లకపోవడంతో వారి జీవనం సాగించడానికి కష్టతరంగా మారిపోయింది.. అయిన కానీ, వర్షాలు మాత్రం తగ్గడం లేదు.. మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.
Also Read: ప్రెసిడెంట్ ట్రంప్‌నకు యూఎస్ చట్టసభ సభ్యులు లేఖ
నేడు ఈ ప్రాంతాల్లో భారీ వర్షం..
ఏపీలో ఉత్తరాంధ్ర, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, రాయలసీమ, అల్లూరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖ, విజయవాడ, పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.