Pooja Hegde : టాలీవుడ్ ముద్దుగుమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిన ఈ హీరోయిన్ ఈ మధ్య అడపా దడపా సినిమాలలో మెరుస్తుంది.. మరోసారి వరుస ఫ్లాపులతో టాలీవుడ్ నుంచి జెండా పీకేయాల్సి వచ్చింది. అయితే దాదాపు మూడేళ్ల తర్వాత టాలీవుడ్‌లో తిరిగి ఎంట్రీ ఇస్తున్నారు పూజా హెగ్డే.. అయితే ఈమె ఈ మధ్య చూసిన సినిమాలో యావరేజ్ టాక్ ని అందుకున్న కూడా రెమ్యూనరేషన్ విషయంలో నో కాంప్రమైజ్ అంటుంది.. తాజాగా ఆమె చేస్తున్న సినిమాకి మరోసారి రెమ్యూనరేషన్ ని పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పటికైనా ఇలాంటివి తగ్గించుకుంటే మంచిది అని నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా కామెంట్లు చేస్తున్నారు. అందులో నిజం ఎంత ఉందో ఒకసారి తెలుసుకుందాం..
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే తెలుగుతో పాటు పలు భాషల్లో చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. ఒకప్పుడు వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాల్లో నటించిన ఈమె ఈమధ్య ఏ సినిమా చేసిన సరే ఫ్లాప్ అవడంతో మార్కెట్ బాగా తగ్గిపోయింది. మరోసారి వరుస ఫ్లాపులతో టాలీవుడ్ నుంచి జెండా పీకేయాల్సి వచ్చింది. అయితే దాదాపు మూడేళ్ల తర్వాత టాలీవుడ్‌లో తిరిగి ఎంట్రీ ఇస్తున్నారు పూజా హెగ్డే.. ఎఫ్ 3లో స్పెషల్ సాంగ్ చేసింది. తాజాగా ఆమెకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కబురు వచ్చింది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న సినిమాలో పూజ హెగ్డే ప్రేమిస్తుంది. అయితే ఈ సినిమాకి రికార్డు స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్టు ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది.
Also Read: గురువారం టీవీల్లోకి వస్తున్న సినిమాలు.. అవే స్పెషల్..
గత మూడేళ్ల నుంచి ఈమె ఖాతాలో భారీ విజయాన్ని అందుకున్న సినిమాలో ఒక్కటి కూడా పడలేదు.. ఫ్లాపులు ఉన్నప్పటికీ.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆమెకున్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు పూజా డిమాండ్‌కు తలొగ్గినట్లుగా తెలుస్తోంది.. దుల్కర్ సల్మాన్ నటిస్తున్న సినిమాలో పూజా హెగ్డే ఎందుకైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఈమె మూడు కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతేఫ్లాపుల్లో ఉన్నప్పటికీ పూజా హెగ్డే క్రేజ్, డిమాండ్ ఏమాత్రం తగ్గలేదని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. దుల్కర్ సల్మాన్ మూవీ కాకుండా ప్రస్తుతం దళపతి విజయ్ చివరి చిత్రం జననాయగన్‌తో పాటు కాంచన 4 తో పాటుగా ఓ హిందీ సినిమాలో నటిస్తుంది.. అలాగే కొన్ని బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తుంది. చేతిలో సినిమాలో ఉన్నాయి కానీ వీటిలో ఒక్కటైన భారీ బిజీ అని అనుకుంటేనే ఈమెకు మంచి లైఫ్ ఉంటుందని టాక్.. మరి ఈయన ఎప్పటికైనా రెమ్యూనరేషన్ ని తగ్గించుకుంటే వరుస సినిమాలు క్యూ కట్టే అవకాశం ఉందని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై పూజ హెగ్డే ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..