Shriya Reddy: శ్రియా రెడ్డి (Shriya Reddy) .. తన నటనతో హీరోలతో పోటీ పడుతూ భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె.. చేసే పాత్ర ఏదైనా సరే 100% న్యాయం చేస్తుందనటంలో సందేహం లేదు. ముఖ్యంగా విలన్ పాత్రలకు పెట్టింది పేరు శ్రియా రెడ్డి. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసి హీరోలు, విలన్లతో పోటీపడి మరీ నటించే అతి కొద్దిమంది నటీమణులలో టాప్ స్థానాన్ని సొంతం చేసుకుంది. క్యారెక్టర్ ఏదైనా సరే సినిమాలో ఉండే పాత్రను డామినేట్ చేయడంలో ఈమె తర్వాతే ఎవరైనా. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా సుజీత్ (Sujeeth ) దర్శకత్వంలో వచ్చిన ఓజీ (OG) సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్ర పోషించి అందరినీ అబ్బురపరిచింది.
ఇకపోతే నటన విషయంలోనే కాదు.. ఫిట్నెస్ విషయంలో కూడా చాలామంది నటీనటులకు స్ఫూర్తిగా నిలిచే ఈమె.. మగాళ్ళ మధ్య ఆ ఫీలింగ్ రావాలి అంటే అలా చేయాల్సిందే అంటూ కామెంట్లు చేసింది. మరి శ్రియా రెడ్డి చేసిన ఈ కామెంట్ల వెనుక ఉన్న అసలు కథ ఏంటి? అనే విషయానికొస్తే.. ‘సలార్’ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. శ్రియా రెడ్డి మాట్లాడుతూ..” యాక్టింగ్ చేయడానికి వెళ్లే ముందు కచ్చితంగా నేను పుష్అప్స్ చేసేదాన్ని. సుమారుగా ప్రతిసారి 60 పుష్ అప్స్ చేసేదాన్ని. నా క్యారవాన్ లో కాస్ట్యూమ్స్ సమయంలో ఇలా చేయడం నా రొటీన్ దినచర్య. ప్రాథమికంగా నేను చేసే చాలా సులభమైన వర్కౌట్ పుష్ అప్స్ మాత్రమే. షాట్ కి అంతా రెడీ అయిందని, లొకేషన్ నుంచి నాకు ఫోన్ వస్తే మాత్రం.. కచ్చితంగా కొంత సమయం కావాలని యూనిట్ తో రిక్వెస్ట్ చేసే దాన్ని. నా వర్కౌట్ పూర్తిచేసుకుని వెంటనే షాట్ కి వెళ్ళిపోయేదాన్ని.
అందుకే నా వర్కౌట్ సెషన్ తో కొత్త ఎనర్జీ వచ్చిన భావన కలిగేది. నేను ఎక్కడ ఉన్నా సరే చాలామంది పురుషుల మధ్య నిలబడినప్పుడు నన్ను నేను అజేయురాలిగా భావించాలంటే నేను లోపలి నుంచే ఆ ఫీలింగ్ అనుభవించాలి. అందుకే నాలో ధైర్యాన్ని నింపుకోవడం కోసం ఖచ్చితంగా ప్రతి షాట్ కి ముందు నేను పుష్ అప్స్ చేసి కొత్త ఎనర్జీని పొందిన తర్వాతే షాట్లోకి వెళ్తాను.” అంటూ తెలిపింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
శ్రియా రెడ్డి కెరియర్ విషయానికొస్తే.. 1983 నవంబర్ 28న జన్మించిన ఈమె తమిళ్ చిత్రాలలో ఎక్కువగా నటిస్తుంది. యాంకర్ గా వీ. జే.గా పనిచేసిన ఈమె తండ్రి మాజీ క్రికెటర్ భరత్ రెడ్డి. నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకు ముందు ఎస్ఎస్ మ్యూజిక్ అనే ఛానల్ లో వీడియో జాకీగా పని చేసిన ఈమె.. సమురాయ్ అనే తమిళ చిత్రంతో నటిగా అరంగేట్రం చేసింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో సినిమాలు చేస్తున్న ఈమె సలార్ 2 లో కూడా నటించబోతోంది.
ALSO READ:Payal Ghosh: 9 ఏళ్లుగా భరించలేకపోతున్నా.. కా**ఛ తీరలేదంటూ హీరోయిన్ బోల్డ్ కామెంట్!