Rishab Shetty: ప్రముఖ కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) .. ఒక్క సినిమాతో పాన్ ఇండియా హీరోగా, డైరెక్టర్ గా కూడా పేరు సొంతం చేసుకున్నారు. కాంతార (Kantara ) సినిమాతో సంచలనం సృష్టించిన రిషబ్ శెట్టి.. ఇప్పుడు కాంతార చాప్టర్ వన్ (Kantara chapter 1) అంటూ మళ్ళీ మన ముందుకు వచ్చి వరుస కలెక్షన్స్ వసూలు చేస్తూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఈయన గురించి తెలుసుకోవాలని తెగ గూగుల్ సర్చ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రిషబ్ శెట్టి ఇల్లు, ఆ ఇంటి ప్రత్యేకతలు అన్నీ కూడా వైరల్ గా మారుతున్నాయి.
విషయంలోకి వెళ్తే.. రిషబ్ శెట్టి ఉడుపిలో సుమారుగా రూ.12కోట్లు విలువచేసే మేన్షన్ ఉంది. ట్రెడిషనల్ కర్ణాటక ఆర్కిటెక్చర్ కి, మోడ్రన్ టెక్నాలజీని జత చేసి తన అభిరుచి మేర ఈ గృహాన్ని నిర్మించుకున్నారు. కర్ణాటక ఉడుపిలోని కుందాపురలోనే ఈయన నివాసం ఉంది. ముఖ్యంగా కాంతార చాప్టర్ వన్ సినిమాలోని దాదాపు 90 శాతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇక్కడే జరిగాయట.
రిషబ్ శెట్టి ఇంటి ప్రత్యేకతల విషయానికి వస్తే.. బర్మా టేక్ వుడ్ ను, ఇత్తడిని కలగలిపి వుడ్ వర్క్ చేశారట. ఇంటి ముందు దాదాపు 300 కిలోల గ్రానైట్ రాయితో తులసి కోటను ఏర్పాటు చేశారు. అలాగే యక్ష గానాన్ని తలపించే విషయాలు.. యువరాజ్ సింగ్ ఆటోగ్రాఫ్ ఉన్న బ్యాట్.. కాంతారలో ఉపయోగించిన రైఫిల్ ఇలా ఇంట్లో ప్రతిదీ రిషబ్ అభిరుచిని ప్రతిబింబిస్తుందని ఆ ఇల్లును చూసిన ప్రముఖులు చెబుతూ ఉంటారు.
ALSO READ:Shahrukh Khan: షారుఖ్ ఖాన్ కు షాక్.. సమన్లు జారీ చేసిన హైకోర్టు!
అంతేకాదు రిషబ్ ఇంట్లో ఉన్న చాంటింగ్ కార్నర్, బ్లాక్ స్టోన్ మీద 7 సెకండ్ల పాటు ఎవరైనా నిలిచి ఉంటే కాంతార లోని భూతకోల ధ్వనించేలా ప్రత్యేకించి అమర్చిన మ్యూజిక్ సిస్టం ఇవన్నీ కూడా అందరిని ఆశ్చర్యపరుస్తాయి. అంతేకాదండోయ్ రిషబ్ ఇంట్లో ఉన్న ప్రైవేటు స్క్రీనింగ్ రూమ్ కి కూడా ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. డాల్బీ అట్మాస్ సౌండ్ తో అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ను అందిస్తుందట. పైగా ఇటాలియన్ లెదర్ రిక్లైనర్స్ ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ అని చెబుతూ ఉంటారు.
లివింగ్ రూమ్ ఇంటి చుట్టుపక్కల ప్రదేశాలు మాత్రమే కాదు కిచెన్ కోసం కూడా ఆయన ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కిచెన్ లో వాడిన నల్ల రాతిని కొబ్బరి నూనెతో పాలిష్ చేయించారట. అలాగే రిషబ్ ఇంట్లో ఉన్న లైబ్రరీలో సుమారుగా 1200 పుస్తకాలు ఉన్నాయి. అందులో జానపదాల నుంచి స్టీఫెన్ కింగ్ నావెల్స్ వరకు ఉన్నట్లు సమాచారం.
ఇక్కడ ఎవరికీ అంత చిక్కని ఐడియా ఏమిటంటే.. రిషబ్ ఇంటి కాపరి పేరు యక్ష. రిటైర్డ్ కోస్టల్ పోలీస్ డాగ్ అది. పైగా ఇంటి చుట్టూ ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు కూడా ఉంటాయట. విజిటర్స్ ఎవరైనా ఇంటి లోపలికి వెళ్లే ముందు బ్రాస్ లాకర్స్ లో తమ ఫోన్స్ ని డిపాజిట్ చేయాల్సిందే. ప్రతి నెల వైఫై పాస్వర్డ్ కూడా మారుతూ ఉంటుంది. ఆ పాస్ వర్డ్ లు అన్నీ కూడా కాంతార లోని ఫేమస్ డైలాగులే కావడం గమనార్హం.
ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. తన నివాసంలో తనకు ఇష్టమైన ప్రదేశం రెయిన్ రూమ్ అట. వర్షం పడేటప్పుడు దానిని ఆస్వాదిస్తూ కథలు రాసుకోవడం, ఆ కథలను ఎడిట్ చేసుకోవడం వల్ల క్రియేటివ్ టచ్ ఉంటుందని ఆయన ఫీల్ అవుతారట. ఏది ఏమైనా రిషబ్ శెట్టి తనకోసం తన ఫ్యామిలీ కోసం నిర్మించుకున్న ఆ ఇంటి ప్రత్యేకతలు తెలిసి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.