Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ స్కూల్లో వింత ఘటన జరిగింది. దసరా పండుగను ఆనందంగా జరుపుకున్న విద్యార్థులు.. తమ పాఠశాలకు రాగానే ప్రిన్సిపాల్ విధించిన నిబంధనలకు షాకైయ్యారు. అయితే దసరా సెలవుల తర్వాత ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం లేక, స్కూళ్లకు ఆలస్యంగా వచ్చారు చాలా మంది విద్యార్థులు. దీంతో ప్రిన్సిపాల్ కలర్ డబ్బా తేస్తేనే లోపలికి రానిస్తా అని వింత పనిష్‌మెంట్ ఇచ్చారు.
ప్రిన్సిపాల్ విధించిన నిబంధనలతో విద్యార్థులు షాక్
పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కి దసర సెలవుల తర్వాత యథావిధిగా స్కూల్‌కి వచ్చారు.. అయితే ఆ విద్యార్థులకు ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం లేక స్కూల్‌కి లేటుగా వచ్చారు.. దీంతో విద్యార్థులు లేటుగా వచ్చినందుకు క్లాస్ రూమ్ లోకి టీచర్స్ రానివ్వలేదు..
కలర్ డబ్బా తీసుకువస్తేనే లోపలికి అనుమతి
ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ దగ్గరకు తీసుకెళితే వారు వింత పనిష్మెంట్ విధించారు. అయితే లేటుగా వచ్చిన ప్రతి విద్యార్థి… స్కూల్ ఎదుట ఉన్న షాప్‌లో ఒక కలర్ డబ్బా కొని తీసుకురావాలని ఆదేశించారు. కలర్ డబ్బా కొనుక్కొని వస్తేనే లోపలికి అనుమతి అంటూ ఆదేశించారు. ఏమి చేసేది లేక విద్యార్థుల తల్లిదండ్రులు కొనుక్కొని వెళ్తున్నారు. ఈ వింత పనిష్మెంట్‌పై తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విధ్యార్థుల మనోభావాలు దెబ్బ తీస్తున్నారంటూ.. విద్యార్థి సంఘాలు ఫైర్..
ఈ ఘటన వెలుగులోకి రాగానే స్థానిక విద్యార్థి సంఘాలు తీవ్రంగా స్పందించాయి. విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, ఆర్థికంగా బలహీన వర్గాల విద్యార్థులపై.. ఇలాంటి శిక్షలు విధిస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Also Read: నేడు కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన..
ఈ వ్యవహారంపై కలెక్టర్ విచారణ జరపాలంటూ డిమాండ్
విద్యార్థులపై అనవసర ఒత్తిడి తీసుకువస్తున్న ప్రిన్సిపల్, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, వెల్ఫేర్ శాఖ అధికారులు ఈ వ్యవహారంపై విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.