E-Paper
Advertisement

Peddi Promotions: ప్రమోషన్లు మొదలెట్టిన ‘పెద్ది’.. ఫస్ట్ ఈవెంట్ ఎక్కడంటే?.. సెకండ్ సింగిల్ ఈరోజే కానీ!

Peddi Promotions: ప్రమోషన్లు మొదలెట్టిన ‘పెద్ది’.. ఫస్ట్ ఈవెంట్ ఎక్కడంటే?.. సెకండ్ సింగిల్ ఈరోజే కానీ!
Advertisement

Peddi Promotions: మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ (Peddi). ఈ సినిమా షూటింగ్ దశలోనే భారీ అంచనాలను మూటగట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘RRR’ తర్వాత రామ్ చరణ్‌కు అంతర్జాతీయంగా పెరిగిన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, చిత్ర యూనిట్ ప్రమోషన్లను విదేశాల నుండే ప్రారంభించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఏప్రిల్ 4న అమెరికాలోని అట్లాంటాలో ఒక భారీ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌లో రామ్ చరణ్‌తో పాటు దర్శకుడు బుచ్చిబాబు, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మరియు ఇతర చిత్ర బృందం పాల్గొనే అవకాశం ఉంది. విదేశీ గడ్డపై ఒక తెలుగు సినిమాకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున ఈవెంట్ నిర్వహించడం సినిమా రేంజ్‌ను తెలియజేస్తోంది.

Read also-Vijay Thalapathy : విజయ్ కు మరో షాక్.. నిన్న భార్య.. నేడు కొడుకు..!

నెక్స్ట్ స్టాప్ నార్త్ ఇండియా!

Advertisement

అట్లాంటా ఈవెంట్ ముగిసిన వెంటనే చిత్ర యూనిట్ ఇండియాకు తిరిగి వచ్చి, నార్త్ ఇండియా ప్రమోషన్లపై దృష్టి సారించనుంది. హిందీ మార్కెట్‌లో చరణ్‌కు ఉన్న పట్టును మరింత బలోపేతం చేసేందుకు ముంబై లేదా ఢిల్లీలో ఒక భారీ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారు. పాన్-ఇండియా రేంజ్‌లో సినిమాను ప్రొజెక్ట్ చేసేందుకు ఇది ఒక కీలక అడుగు కానుంది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ తన బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చుకున్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా కావడంతో ఆయన లుక్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ కానుంది. ఈ చిత్రాన్ని 2026, ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

Read also-Horror thriller OTT: గదిలో భయపెట్టే దయ్యం… తల్లికూతుర్ల అగచాట్లు… ఊహకు అందని క్లైమాక్స్

Advertisement

మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 4న జరిగే అట్లాంటా ఈవెంట్‌తో సినిమా ప్రచార వేగం పుంజుకోనుంది. ఈ ఈవెంట్‌లో సినిమాకు సంబంధించిన ఏదైనా స్పెషల్ టీజర్ లేదా గ్లింప్స్ విడుదల చేస్తారేమోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మార్చ్ 2, 2026న సెకండ్ సింగిల్ విడుదల చేయాల్సి ఉండగా మూవీ టీం ప్రకటించి వదిలే సింది. పాటకు సంబంధించి ప్రోమోను కూడా విడుదల చేయలేదు. దీంతో అసలు ఈ రోజు పాట్ విడుదల అవుతుందో లేదో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పెద్ది సెకండ్ సింగిల్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×