E-Paper
Advertisement

సాటి మనుషుల పట్ల దయతో ఉండండి.. రేణు దేశాయ్ సంచలన పోస్ట్!

సాటి మనుషుల పట్ల దయతో ఉండండి.. రేణు దేశాయ్ సంచలన పోస్ట్!
Advertisement

Renu Desai: రేణు దేశాయ్ పరిచయం అవసరం లేని పేరు. సినీనటిగా అందరికీ ఎంతో సుపరిచితమైన ఈమె ఇటీవల సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను పంచుకుంటున్నారు. ఇకపోతే ఇటీవల దీపావళి పండుగ(Diwali Festival) ఎంతో ఘనంగా ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇక దీపావళి పండుగ రోజు క్రాకర్స్ కాల్చడం(Fire Crackers) పట్ల రేణు దేశాయ్(Renu Desai) సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. పండుగ పేరుతో అర్ధరాత్రి తర్వాత కూడా పెద్ద శబ్దాలతో క్రాకర్స్ పేల్చడాన్ని ఈమె తప్పు పట్టారు. ఈ విషయం గురించి తాను మాట్లాడితే తనని హిందూ వ్యతిరేకి అంటూ మాట్లాడతారని, అందుకే తాను పండగ రోజు ఈ విషయం గురించి మాట్లాడలేదని రేణు దేశాయ్ తెలిపారు.

అర్ధరాత్రి అయిన పెద్ద పెద్ద శబ్దాలు..

దీపావళి పండుగ సందర్భంగా అర్ధరాత్రి అయినా కూడా టపాకాయల మోత తగ్గలేదని తెలిపారు. నా గది సౌండ్ ప్రూఫ్ కావడంతో నాకు ఎలాంటి శబ్దాలు వినిపించలేదు కానీ ఎంతోమంది చిన్న పిల్లలు వయసు పైబడిన వారు ఉంటారు అలాంటి వారికి ఇది చాలా ఇబ్బందులు కలిగిస్తుందని ఈమె పేర్కొన్నారు. రాత్రి 9 గంటలలోపు ప్రజలు ఒక ట్రక్కు క్రాకర్స్ కాల్చుకోవచ్చు . కనీసం 10 గంటలకైనా ఈ క్రాకర్స్ కాల్చడం ఆపేయొచ్చు. మూడు రోజుల నుంచి అర్ధరాత్రి రెండు మూడు గంటల వరకు క్రాకర్స్ కాలుస్తూనే ఉన్నారని తెలిపారు.

క్రాకర్స్  కాల్చడం కాలుష్యం కాదు…

Advertisement

ఇక తాను క్రాకర్స్ కాల్చడం వల్ల వచ్చే కాలుష్యం గురించి మాట్లాడటం లేదని తెలిపారు. సంవత్సరంలో 365 రోజులు కార్లు పరిశ్రమల కారణంగా మనకు కాలుష్యం ఏర్పడుతూనే ఉంది. ఇక దీపావళి పండుగ ఒకరోజు క్రాకర్స్ కాల్చడం వల్ల కొత్తగా కాలుష్యం ఏర్పడదని ఈమె తెలిపారు. అయితే ఈ పండుగను క్రాకర్స్ కాలుస్తూ ఎంజాయ్ చేయవచ్చు కానీ 10 గంటలలోపు పూర్తి చేస్తే బాగుంటుందని రేణు దేశాయ్ తెలిపారు. ఎంతోమంది అనారోగ్య సమస్యలతో చంటి బిడ్డలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు .మీ సాటి మనుషుల పట్ల కాస్త దయతో ఉండటానికి ప్రయత్నం చేయండి అంతేకానీ వారిని ఎంజాయ్మెంట్ పేరుతో హింసించొద్దు అంటూ రేణు దేశాయ్ పోస్ట్ చేశారు.

Advertisement

ఈ విధంగా రేణు దేశాయ్ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో యదావిధిగా నేటిజన్స్ ఈమెను టార్గెట్ చేస్తూ కామెంట్లో చేస్తున్నారు. గతంలో కూడా వినాయక చవితి పండుగ సందర్భంగా అర్ధరాత్రి వరకు డీజే సౌండ్స్ వస్తున్నాయని, వీటి ద్వారా ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు అంటూ రేణు దేశాయ్ మాట్లాడటంతో ఈమెపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీపావళి క్రాకర్స్ కారణంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారని దయచేసి 10 గంటల లోపే పూర్తి చేసుకోండి అంటూ ఈమె పోస్ట్ చేయడంతో మరోసారి విమర్శలను ఎదుర్కొంటున్నారు.

Also Read: తొమ్మిదో నెల ప్రెగ్నెన్సీ.. బేబీ బంప్ తో సమంత మెటర్నటీ ఫోటోషూట్!

Related News

పవన్ కళ్యాణ్ – అన్నా విడాకుల వెనుక అసలు కారణం ఇదేనా?

తరుణ్ భాస్కర్ తో ఈషా ఇంట దివాళీ వేడుకలు.. ఇంకెన్నాళ్ళు?

మళ్లీ తల్లిదండ్రులు కాబోతున్న కిరణ్-రహస్య.. వైరల్ న్యూస్ లో నిజమెంత?

తెలుగు రికార్డులను తిరగరాస్తున్న వారణాసి మూవీ!

అన్నాతో పవన్ కళ్యాణ్ విడాకుల వార్తలు.. వైరల్ అవుతున్న వేణుస్వామి కామెంట్స్!

పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా విడాకులు.. అసలేం జరిగింది..?

తొమ్మిదో నెల ప్రెగ్నెన్సీ.. బేబీ బంప్ తో సమంత మెటర్నటీ ఫోటోషూట్!

Big Stories

Advertisement
×