Venu Swamy:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా, ఇటు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ ముచ్చటగా మూడోసారి కూడా విడాకులు తీసుకున్నట్లు ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఇలా మూడు పెళ్లిళ్లు చేసుకుని, విడాకులు తీసుకోవడం ఏంటి? అంటూ తమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో గతంలో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి (Venuswamy) చేసిన కామెంట్ల తాలూకా వీడియోలు మళ్లీ వైరల్ అవుతున్నాయి.
వేణు స్వామి మాట్లాడుతూ..” పవన్ కళ్యాణ్ జాతకంలో గురువు నీచ స్థానాన్ని బట్టి మనం అంచనా వేయగలం. ఆయన జాతకంలో నాలుగు పెళ్లిళ్లు రాసి పెట్టిన ఉన్నాయి. ఇప్పటికే రెండు పెళ్లిళ్లకు ఆయన స్వస్తి పలికారు. మూడవ భార్యతో ఆయన కొనసాగుతున్నారు అయితే ఈమెకు కూడా విడాకులు ఇస్తారని నేను చెప్పను కానీ అది జరిగినప్పుడు మీకే తెలుస్తుంది. మళ్ళీ ఆయన నాలుగో పెళ్లి కూడా చేసుకుంటారు. అది ఆయన జాతకం మీద ఆధారపడి ఉంది” అంటూ గతంలో కామెంట్ చేశారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన మూడవ భార్య అన్నా కొణిదెలకి కూడా విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించడంతో ఈ వీడియో మళ్లీ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది . మొత్తానికైతే పవన్ కళ్యాణ్ మూడవ భార్యకు కూడా విడాకులు ఇచ్చిన వేళ ఆయనకు సంబంధించిన ఇలా ఎన్నో పాత వీడియోలు మళ్లీ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.
అసలు విషయంలోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన సతీమణి అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు వారు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు.”మా జీవితంలో ఎంతో ముఖ్యమైన సమయాన్ని కలిసి గడిపిన తర్వాత పరస్పర అవగాహన, గౌరవంతో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. మా వైవాహిక జీవితం ముగిసినా, మేం మంచి స్నేహితులుగా ఉంటాం. మా చక్కని పిల్లలకు బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా కొనసాగుతాం. మా పిల్లల సంతోషం, శ్రేయస్సు మాకు ఎల్లప్పడూ ఉమ్మడి ప్రాధాన్యాలుగా ఉంటాయి.ఈ దశలో మమ్మల్ని మీరు అర్థం చేసుకుంటారని, సానుభూతితో వ్యవహరించాలని, మా వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని కోరుకుంటున్నాం. మా ప్రయాణంలో వెంట నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.”అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు.
also read:కోట్ల రూపాయల కార్లు కొనడంపై క్లారిటీ ఇచ్చిన అషు రెడ్డి..
ఇకపోతే పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో నందిని రెడ్డి అనే అమ్మాయితో పెద్దలు కుదిరిచిన వివాహం చేసుకున్నారు. కెరియర్లో మంచి సక్సెస్ అందుకుంటున్న తొలి రోజుల్లోనే ప్రముఖ హీరోయిన్ రేణు దేశాయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహం చేసుకోవడానికి ముందే నందిని రెడ్డికి విడాకులు ఇచ్చి.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత రేణు దేశాయ్ విడాకులు ఇచ్చిన పవన్ కళ్యాణ్ రష్యాకు చెందిన అన్నా లెజినోవా ను వివాహం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈమెకు కూడా విడాకులు ఇవ్వడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.